రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

మిలిటరీ ఏవియేషన్‌లో నాణ్యతకు ప్రాధాన్యత : రక్షణ కార్యదర్శి


స్వదేశీ పరిశోధన, అభివృద్ధి తయారీని ప్రోత్సహించడం కోసం మిలిటరీ ఏవియేషన్‌లో క్యూఐ సంస్కరణలపై వర్క్‌షాప్

Posted On: 03 JUL 2023 6:21PM by PIB Hyderabad

మిలటరీ ఏవియేషన్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ (క్యూఏ) కు  ప్రభుత్వం కట్టుబడి ఉందని  రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. , రక్షణ తయారీ పరిశ్రమ స్వదేశీకరణ సాధించే అంశంలో ఎదురవుతున్న సమస్యలు  తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు అమలు చేస్తుందని  తెలిపారు.  “స్వదేశీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం- మిలిటరీ ఏవియేషన్‌లో క్యూఐ  సంస్కరణలు” అనే అంశంపై న్యూఢిల్లీలో 2023 జూలై 3న  జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ (DGAQA), రక్షణ మంత్రిత్వ శాఖ , సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIDM) ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో రక్షణ కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రక్షణ రంగం స్వావలంబన సాధించాలన్న ప్రధానమంత్రి ఆలోచన కార్యరూపం దాల్చేలా చూసి  ఆత్మ నిర్భరత సాధించడానికి రక్షణ శాఖ కృషి చేస్తోందన్నారు. స్వావలంబన సాధించడం ఒక సవాలుగా మారిందని శ్రీ గిరిధర్ అరమనే అన్నారు. అయితే లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి  చేసి లక్ష్య సాధన కోసం  చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్‌ రంగంలో  ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేట్ రంగాన్ని కోరారు.

విమానయాన రంగం అనేది అధునాతన సాంకేతికతతో కూడిన సంక్లిష్టమైన రంగమని శ్రీ గిరిధర్ అరమనే అన్నారు. భద్రత, విజయం సాధించడానికి  క్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  సమస్యలను  పరిష్కరించడానికి దేశం లేదా ప్రభుత్వ సంస్థలు నిర్దేశించే ఎయిర్‌వర్థినెస్ ఫ్రేమ్‌వర్క్ క్రింద  గ్లోబల్ ఏవియేషన్ పరిశ్రమలు  పనిచేస్తాయి. భారతదేశంలో టెక్నికల్ ఎయిర్‌వర్థినెస్ అథారిటీ (TAA) ఈ భాద్యత నిర్వర్తిస్తోంది. డిజిఏక్యూఏ  తో కలిసి టెక్నికల్ ఎయిర్‌వర్థినెస్ అథారిటీ నాణ్యత ప్రమాణాలు నిర్దేశిస్తుంది.   సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC) సహకారంతో  భారతీయ విమానయాన రంగానికి  ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్, నాణ్యత హామీని అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల్లో  భాగంగా భారత రక్షణ అవసరాలు తీర్చడానికి  సరఫరాదారులు, జాతీయ రక్షణ సంసిద్ధతకుతోడ్పడే విధంగా పెద్ద  సంఖ్యలో ఏరోస్పేస్ ఉత్పత్తి తయారీలను సిద్ధం  చేయడానికి డిజిఏక్యూఏ  వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

  ప్రాథమిక లక్ష్యం చేపట్టిన వివిధ  కార్యక్రమాలను వివరించడం లక్ష్యంగా వర్క్‌షాప్ నిర్వహించారు. డిఫెన్స్ ఏరోస్పేస్ తయారీ రంగంలోకి స్వదేశీ  తయారీదారుల సులభంగా ప్రవేశించడానికి అనువైన పరిస్థితులు డిజిఏక్యూఏ కల్పిస్తుంది.  వర్క్‌షాప్ ద్వారా స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సహకారం, మరిన్ని అవసరాలను గుర్తించడం లక్ష్యంగా వర్క్‌షాప్‌ ఏర్పాటయింది. వర్క్‌షాప్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఏవియేషన్, నేవల్ ఏవియేషన్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఆర్డిఓ  ల్యాబ్స్, భారత విమానయాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

***

 



(Release ID: 1937154) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi