రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్‌-యూకే 'ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్‌షాప్' న్యూదిల్లీలో నిర్వహణ

Posted On: 03 JUL 2023 4:49PM by PIB Hyderabad

భారత్‌-యూకే 'ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నికల్ వర్క్‌షాప్' ఇవాళ న్యూదిల్లీలో జరిగింది. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ రంగంలో పరస్పర సహకారం పెంచుకోవడం, సాంకేతికత మార్పిడి, మరిన్ని అవకాశాలను అన్వేషించడం ఈ కార్యశాల ఉద్దేశం. భారతదేశం తరపున సంయుక్త కార్యదర్శి (నేవల్ సిస్టమ్స్) శ్రీ రాజీవ్ ప్రకాష్, యూకే తరపున నేవల్ బేస్ కమాండర్ పోర్ట్స్‌మౌత్ కమొడోర్ జాన్ ఓయిస్‌ అధ్యక్షతన ఈ కార్యశాల జరిగింది.

రెండు దేశాల నిపుణులు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు కలవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, ఓడల కోసం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అభివృద్ధి చేయడంపై అర్థవంతమైన చర్చలు జరపడానికి కీలక వేదికగా ఈ కార్యశాల ఉపయోగపడింది.

ఓడల కోసం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అభివృద్ధిపై ఈ చర్చలు సమగ్ర అవగాహన అందించాయి. రెండు దేశాల మధ్య సహకారం & ఆలోచనల మార్పిడికి బాటలు వేశాయి.

రక్షణ రంగంలో బలమైన సంబంధం నిర్మించుకోవడానికి, ఉమ్మడి పరిశోధన, సాంకేతికత బదిలీ, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం అవకాశాలు అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి.

 

***


(Release ID: 1937096) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi