విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాంచీలో 'బిజిలీ ఉత్సవ్' నిర్వహించిన ఆర్‌ఈసీ

Posted On: 01 JUL 2023 4:02PM by PIB Hyderabad

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, 29 జూన్ 2023న, జార్ఖండ్‌లోని రాంచీలో 'బిజిలీ ఉత్సవ్' నిర్వహించారు. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని మహారత్న సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. విద్యుత్ రంగంలోని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన గ్రామాల పౌరులు తమ అభిప్రాయాలు, అనుభవాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నారు. విద్యుత్తు వారి జీవితాలను ఎలా మార్చిందో వివరించారు.

రాంచీ పార్లమెంటు సభ్యుడు శ్రీ సంజయ్ సేథ్, రాంచీ డీజీఎం శ్రీ డీకే సింగ్, జార్ఖండ్ బిజిలీ విత్రన్ నిగమ్ లిమిటెడ్ (జేబీవీఎన్‌ఎల్‌) డీజీఎం శ్రీ మంతోష్ మణి సింగ్, జేబీవీఎన్‌ఎల్‌ ఈఈఈ (పశ్చిమ) శ్రీ హిమాన్షు, ఆర్‌ఈసీ చీఫ్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ అంజన్ లాహిరి, స్థానిక ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'బిజిలీ ఉత్సవ్'లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంధన పొదుపు, మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీకరణ సమయంలో ఎదుర్కొన్న వినియోగదారుల హక్కులకు సంబంధించిన సవాళ్లు, విద్యుత్‌ వచ్చాక ప్రజా జీవన నాణ్యత ఎలా మెరుగుపడిందనే అంశాలపై వక్తలు మాట్లాడారు.

పౌరులకు ఎల్‌ఈడీ బల్బుల పంపిణీతో ఈ కార్యక్రమం ముగిసింది.

ఆర్‌ఈసీ లిమిటెడ్ అనేది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ. భారతదేశంలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పనకు రుణాలు ఇవ్వడం, అభివృద్ధి చేయడం దీని లక్ష్యాలు. 1969లో ప్రారంభమైన ఆర్‌ఈసీ లిమిటెడ్, ఇప్పటికి యాభై సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది. రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర & రాష్ట్ర విద్యుత్ వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు, ప్రైవేట్ రంగ వినియోగ సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తుంది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, పునరుత్పాదక విద్యుత్‌ సహా విద్యుత్ రంగ విలువ గొలుసులోని ప్రతి అంచెలోని ప్రాజెక్టులకు ఈ సంస్థ నుంచి రుణం అందుతుంది. భారతదేశంలోని ప్రతి నాలుగు బల్బుల్లో ఒక బల్బు ఆర్‌ఈసీ నిధులతో వెలుగుతోంది.

 

***


(Release ID: 1936779) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Hindi