కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక- ఉపాధి కల్పన శాఖ కార్యదర్శుల రెండు రోజుల సమావేశం సమాప్తం
సామాజిక భద్రత అందని కార్మికులందరికీ పథకాలు వర్తించేలా సమష్టి
కృషి అవసరం: కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి స్పష్టీకరణ;
‘ఇ-శ్రమ్, వలస-బిఒసి కార్మికులుసహా ఎన్‌సీఎస్.. పీఎంఎస్‌వైఎం.. శ్రామిక్ చౌపల్.. ఇఎస్‌ఐసి’ వంటి సంబంధిత కీలకాంశాలపై చర్చించిన కార్యదర్శులు
Posted On:
30 JUN 2023 7:32PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 2023 జూన్ 29-30 తేదీల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక-ఉపాధి కల్పన శాఖ కార్యదర్శుల సమావేశాన్ని కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఆ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి ఆహుజా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మొత్తం 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అదనపు ప్రధాన కార్యదర్శులు/ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు/కార్మిశాఖ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే కార్మిక-ఉపాధి కల్పన శాఖ అదనపు కార్యదర్శి శ్రీ రమేష్ కృష్ణమూర్తి, ఆ శాఖ సీనియర్ సలహాదారు శ్రీ అలోక్ చంద్ర, ‘ఇఎస్‌ఐసి’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ సహా కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని ఇతర సంస్థల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శి తొలుత ప్రసంగిస్తూ- సమావేశ లక్ష్యాలను వివరించారు. ఈ మేరకు వలస-బిఒసి కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మిక సంక్షేమ సంబంధిత కీలకాంశాలపై చర్చించాల్సి ఉందని తెలిపారు. అదేవిధంగా శ్రామిక్ చౌపల్ కింద కార్మికుల ముంగిటకు చేరేవిధంగా అనుసరించాల్సని ప్రామాణిక విధాన ప్రక్రియసహా వివిధ పోర్టళ్ల ఏకీకరణ-సమాచార ఆదానప్రదానం, జాతీయ ఉపాధి సేవల కింద ఉద్యోగ సమ్మేళనాల నిర్వహణ, ‘ఎంపిఎస్‌వైఎం’ కింద నమోదు పెంపె తదితరాలపైనా చర్చించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.
ఈ చర్చనీయాంశాలకు అనుగుణంగా కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉపాధి) శ్రీ అమిత్ నిర్మల్ తొలుత ‘ఇ-శ్రమ్, ఎన్‌సిఎస్’ పోర్టళ్ల గురించి సోదాహరణంగా వివరించారు. అలాగే మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కమల్ కిషోర్ సోన్ ‘పిఎంఎస్‌వైఎం, బిఒసిడబ్ల్యు’పై ప్రదర్శనాత్మక వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వలస కార్మికుల సంక్షేమానికి భరోసా దిశగా రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు తమ సూచనలు-సలహాలు అందజేశారు. మరోవైపు శ్రామిక్ చౌపల్ అమలుకు ప్రామాణిక విధాన ప్రక్రియ, రాష్ట్రాల పోర్టళ్లతో ఇ-శ్రమ్, ఎన్‌సిఎస్ పోర్టళ్ల అనుసంధానం, సమాచార ఆదానప్రదానం, ఎన్‌సిఎస్ కింద ఉద్యోగ సమ్మేళనాల నిర్వహణ వంటి కార్మిక సంబంధిత వివిధ అంశాలపై సాగిన చర్చల్లో అధికారులంతా చురుగ్గా పాలుపంచుకున్నారు.
అంతేకాకుండా ఇఎస్‌ఐసి సంబంధిత అంశాలు- ఆసుపత్రులు/డిస్పెన్సరీలకు స్థలాల కేటాయింపు, ఇఎస్‌ఐఎస్ ఆస్పత్తుల పనితీరు, ఇఎస్‌ఐసి/ఇఎస్‌ఐఎస్ ఆస్పత్రుల నిర్మాణం, భవనాల-సేవా విభాగాల వార్షిక మరమ్మతులు-నిర్వహణ, ఇఎస్‌ఐఎస్ రాష్ట్ర సొసైటీ, ఒఎపి వినియోగం, ధన్వంతరి పథకం అమలు తదితరాలపైనా లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోగల ఇఎస్‌ఐఎస్ ఆస్పత్రులను మెరుగైన రీతిలో వినియోగించుకోవాలని ఇఎస్‌ఐసి డెరైక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.
చివరగా కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ- సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలోనూ ఇప్పటిదాకా సామాజిక భద్రత కిందకురాని కార్మికులను పథకాల పరిధిలో చేర్చేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర నోడల్ అధికారుల కోసం ‘ఎన్‌సిఎస్’ పోర్టల్‌లో ఒక డ్యాష్‌బోర్డును కార్యదర్శి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ పరిధిలోని 3193 కార్యాలయాలు/సంస్థల డిజిటల్ గుర్తింపుపై ప్రదర్శన కూడా నిర్వహించారు. అలాగే ఉత్తమ విధానాలు సహా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంబంధిత ఇతరత్రా అంశాలపైనా సమావేశం చర్చించింది.
*****
(Release ID: 1936719)
Visitor Counter : 121