పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

2023 ప్రథమార్ధంలో అంటే జనవరి - జూన్ మధ్య కాలంలో, ఢిల్లీ 8 సంవత్సరాలలో అంటే 2016 నుండి 2023 వరకు (కోవిడ్ ప్రభావిత సంవత్సరం 2020 మినహా) అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేసింది.


గత ఏడేళ్లతో పోలిస్తే 2023లో ఢిల్లీలో రోజువారీ సగటు ఎ క్యు ఐ అత్యల్పంగా నమోదైంది.

జూన్ 30 నాటికి, ఢిల్లీ సగటు గాలి నాణ్యత ‘తటస్థ‘ కేటగిరీలో ఉంది, అంటే 200 ఎ క్యు ఐ కంటే తక్కువగా ఉంది, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఈ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి, నియంత్రించడానికి, తగ్గించడానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న నిరంతర ప్రయత్నాలు 2023 లో మెరుగైన గాలి నాణ్యతకు దారితీస్తాయి.

వివిధ భాగస్వామ్య సంస్థల ద్వారా కొనసాగుతున్న పటిష్టమైన పర్యవేక్షణ అమలు చర్యలు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను మెరుగ్గా అమలు చేయడానికి దారితీస్తాయి

Posted On: 30 JUN 2023 5:25PM by PIB Hyderabad

జూన్ 30 నాటికి, ఢిల్లీ సగటు గాలి నాణ్యత ' తటస్థ ' కేటగిరీలో అంటే 200

ఎ క్యు ఐ  కంటే తక్కువగా ఉంది. అనుకూలమైన వాతావరణ/ శీతోష్ణ పరిస్థితులు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సి ఆర్ )  లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సి ఎ క్యు ఎం),  వివిధ భాగస్వాములు చేస్తున్న స్థిరమైన, సమగ్రమైన , సమిష్టి ప్రయత్నాలు ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఢిల్లీలో మెరుగైన మొత్తం గాలి నాణ్యతను సాధించడంలో సహాయపడ్డాయి.

 

ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎ క్యు ఐ ) లో 'గుడ్ టు మోడరేట్'గా వర్గీకరించిన రోజుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎనిమిది  సంవత్సరాలలో అంటే 2016 నుండి 2023 వరకు (జనవరి - జూన్ కాలానికి), ఢిల్లీ ప్రస్తుత సంవత్సరంలో (గ్రాఫ్ లో చిత్రీకరించిన విధంగా కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా 2020 సంవత్సరంలో చాలా తక్కువ మానవ సంబంధ, పారిశ్రామిక , వాణిజ్య కార్యకలాపాల కాలాలను మినహాయించి) అత్యధిక సంఖ్యలో 'గుడ్ టు మోడరేట్' ఎయిర్ క్వాలిటీ రోజులను  నమోదు చేసింది.

 

2016-2023 మధ్య ప్రతి సంవత్సరం మొదటి అర్ధ సంవత్సర కాలంలో కనిపించిన 'గుడ్ టు మోడరేట్' గాలి నాణ్యత ఉన్న రోజుల తులనాత్మక చార్ట్ క్రింద చూడవచ్చు

 

 

2016 సంవత్సరం మొదటి అర్ధ సంవత్సర కాలంలో (అంటే జనవరి నుండి జూన్ వరకు) 'గుడ్ టు మోడరేట్' ఎయిర్ క్వాలిటీ డేస్ సంఖ్య 30; 2017లో 57; 2018లో 65; 2019లో 78; 2020లో 126; 2021లో 84; 2022లో 54; ప్రస్తుత సంవత్సరం 2023 లో 101 ఉన్నాయి.

 

2016 నుండి గత ఏడు సంవత్సరాల కాలంతో పోలిస్తే (2020 - కోవిడ్ కారణంగా లాక్ డౌన్ సంవత్సరం మినహా) 2023 లో ఢిల్లీ 'పేలవమైన స్థాయి నుండి తీవ్రమైన' గాలి నాణ్యతతో తక్కువ రోజులను నమోదు చేసింది. మొదటి అర్ధ సంవత్సరానికి (జనవరి నుంచి జూన్ వరకు) 'పేలవమైన స్థాయి నుంచి తీవ్రమైన' గాలి నాణ్యత రోజుల సంఖ్య కూడా 2016 సంవత్సరంలో 147 నుండి ప్రస్తుత సంవత్సరం 2023 నాటికి 80 కి క్రమంగా తగ్గుతోంది.

 

ఈ కాలంలో ఢిల్లీ సగటు ఎ క్యు ఐ  కూడా మోడరేట్ ఎ క్యు ఐ  కేటగిరీలో అంటే 200 కంటే తక్కువగా ఉంది. గత ఏడు సంవత్సరాలుగా అంటే 2016 (2020 మినహా - గ్రాఫ్ లో చూపించిన విధంగా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ సంవత్సరం మినహా) తో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం (జనవరి - జూన్) లో ఢిల్లీ అత్యల్ప ఎ క్యు ఐ ని నివేదించింది.

 

ఈ క్రింది చార్ట్  ఎనిమిది  సంవత్సరాల (2016-2023) మొదటి అర్ధ సంవత్సర కాలానికి సగటు ఎ క్యు ఐ ని వివరిస్తుంది:

 

 

రోజువారీ సగటు పిఎం 10 , పిఎం 2.5 గాఢత స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే, 2016 నుండి (2020 మినహా - గ్రాఫ్ లో చిత్రీకరించిన విధంగా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ సంవత్సరం మినహా)

గత ఏడు  సంవత్సరాల పోలిస్తే  2023 మొదటి అర్ధ సంవత్సర కాలంలో, ఢిల్లీ రోజువారీ సగటు పిఎం 10 , పిఎం 2.5 గాఢత అత్యల్ప స్థాయిలను చూసింది,

 

ఎనిమిది సంవత్సరాల (2016-2023) లో మొదటి అర్ధ సంవత్సర కాలానికి పిఎమ్ 10 , పిఎమ్ 2.5 రన్నింగ్ సగటును (μg/m3) వివరించే తులనాత్మక చార్ట్ ను క్రింద చూడవచ్చు.

 

 

ఈ మెరుగుదల వాయు కాలుష్య కారకాలలో గణనీయమైన తగ్గింపును సూచిస్తుంది, తక్కువ స్థాయిలో ధూళి కణాలు (పిఎమ్ 2.5 , పిఎమ్ 10) ,

ఇతర హానికరమైన ఉద్గారాలు.  ఈ క్షీణత ధోరణి గణనీయమైన కాలంగా కొనసాగింది.  ఢిల్లీ- ఎన్ సి ఆర్ మొత్తం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి

సి ఎ క్యు ఎం , వివిధ వాటాదారులు తీసుకున్న నిబద్ధతకు,  చర్యకు నిదర్శనం.

 

రానున్న రోజుల్లో ఢిల్లీ- ఎన్ సి ఆర్ లో మెరుగైన గాలి నాణ్యత కోసం కృషి చేయడం చాలా అవసరమని కమిషన్ పునరుద్ఘాటించింది. వాయు కాలుష్య నివారణ, నియంత్రణ , తగ్గింపు కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి,  ఈ ప్రాంతంలో మొత్తం గాలి నాణ్యతను మెరుగుపరచడానికి సి ఎ క్యు ఎం సంబంధిత వివిధ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.

 

***



(Release ID: 1936560) Visitor Counter : 147


Read this release in: Hindi , English , Urdu