కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల సేవలకు "వన్ స్టాప్ సొల్యూషన్"గా పోస్టల్ శాఖ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ ,"తెలంగాణలో బౌద్ధ వారసత్వం - బావపూర్ కుర్రు" పోస్ట్ కార్డ్ ను విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Posted On:
30 JUN 2023 5:27PM by PIB Hyderabad
ఈరోజు హైదరాబాద్ డాక్ సదన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రత్యేక పోస్టల్ కవర్ ,"తెలంగాణలో బౌద్ధ వారసత్వం - బావపూర్ కుర్రు" పోస్ట్ కార్డ్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ కిషన్ రెడ్డి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దార్శనికత తో అమలు చేస్తున్న కార్యక్రమాలు పోస్టల్ విభాగాన్ని బహుళ సేవా ఏజెన్సీగా అభివృద్ధి చేశాయన్నారు. పోస్టల్ విభాగం ప్రజలకు ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పోస్టల్ విభాగానికి ఉన్న వ్యవస్థను ఆధారంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అట్టడుగున ఉన్నవారికి, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సంక్షేమ పథకాల ఫలాలు పోస్టల్ శాఖ "వన్ స్టాప్ సొల్యూషన్"గా పనిచేస్తుందని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. వస్తువులను అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు, కేంద్ర సంక్షేమ పథకాల అమలులో పోస్టల్ విభాగం కీలకంగా మారిందని మంత్రి అన్నారు.
2016 లో ఏర్పడిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ సాధించిన ప్రగతిని, అమలు చేసిన కార్యక్రమాలను శ్రీ కిషన్ రెడ్డి అభినందించారు. వివిధ కార్యక్రమాల అమలు కోసం పోస్టల్ శాఖ 7429 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఏర్పడిన తర్వాత కొత్తగా రెండు పోస్టల్ పోస్టల్ రీజియన్‌లు, 17 పోస్టల్ డివిజన్‌లు, 2 ఆర్‌ఎంఎస్ డివిజన్‌లు ఏర్పడ్డాయి. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ప్రజల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేని గ్రామాల్లో 58 కొత్త పోస్టాఫీసులను ప్రారంభించి తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా “తెలంగాణలో బౌద్ధ వారసత్వం – బావాపూర్ కుర్రు”పై 5 చిత్రాల పోస్ట్ కార్డ్‌ల సెట్, పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాల్లో వెలుగు చూసిన “క్రీ.పూ. 2 వ శతాబ్దపు నాగముచ్చిలింద బౌద్ధ స్థూపం” పై ప్రత్యేక కవర్ , 2014 తర్వాత “ తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ విభాగంలో చోటు చేసుకున్న మార్పులు” పై రూపొందించిన బ్రోచర్ ను శ్రీ జి కిషన్ రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి విడుదల చేశారు.
హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.వి.ఎస్.రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెచ్చిన ప్రత్యేక పోస్టల్ కవర్ రద్దు చేయకుండా 45 రూపాయ;లకు, రద్దు చేసిన తర్వా 45 రూపాయలకు అందుబాటులో ఉంటుందన్నారు.
“తెలంగాణలోని బౌద్ధ వారసత్వం – బావాపూర్ కుర్రు”పై పిక్చర్ పోస్ట్ కార్డ్‌ల ధర రూ. 200/-, రద్దు లేకుండా ధర రూ. 150/- గ నిర్ణయించామని తెలిపారు. అన్ని ఫిలాటెలిక్ బ్యూరోలలో (అన్ని హెడ్ పోస్టాఫీసులు) అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి టి ఎం శ్రీలత, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ (హెడ్ క్వార్టర్స్) శ్రీ కె ఎ దేవరాజ్, పురాతత్వ శాస్త్రవేత్త,ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈ.శివారెడ్డి, న్యూరో సర్జన్ పురాతన నాణేల సేకరణదారుడు డాక్టర్ డి.రాజారెడ్డి, పోస్టల్ విభాగం సిబ్బంది, అధికారులు, లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1936556)