సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
12 నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌నార్‌లను నిర్వహించనున్న డి.ఎ.ఆర్.పి.జి
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ అవార్డు పొందిన కార్యక్రమాలపై
12 నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌నార్‌ల నిర్వహణ
- అవార్డు విజేతలు వారి అనుభవాలను పంచుకోవడానికి, ఇతర రాష్ట్రాలు/జిల్లాల ప్రతిరూపణను సులభతరం చేయడానికి, ఉత్తమ పద్ధతులను వ్యాప్తి చేయడానికి తోడ్పడనున్న వెబ్‌నార్‌లు
- 2023-24కు సంబంధించి పన్నెండు వెబ్‌నార్‌ల కోసం క్యాలెండర్ విడుదల
- ప్రతి నెలా చివరి శుక్రవారం జరిగే ప్రతి వెబ్‌నార్‌లో రెండు అవార్డ్ ఇనిషియేటివ్‌లు ప్రదర్శన
- 30 జూన్ 2023న “సమగ్ర శిక్ష” థీమ్‌పై వెబ్‌నార్ నిర్వహణ
Posted On:
28 JUN 2023 6:44PM by PIB Hyderabad
జిల్లా కలెక్టర్లు మరియు ఇతర అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్లు/వెబినార్లను నిర్వహించాలని పరిపాలనా సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి)ని ప్రధాన మంత్రి ఆదేశించారు. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పీఎం అవార్డీలు గత అవార్డు విజేతలు తమ అనుభవాలను అందించనున్నారు. ఈ దిశాగా వారిని కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. అవార్డులు గెలుచుకున్నవారు వారి పనితీరును గురించి తెలియజేసేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆదేశాలకు అనుగుణంగా, డి.ఎ.ఆర్.పి.జి 2023-24 సంవత్సరంలో 12 నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్‌నార్‌లను నిర్వహించనుంది. నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్ సిరీస్ కింద 12 వెబ్‌నార్‌లకు సంబంధించి .ఎ.ఆర్.పి.జి ఈ రోజు క్యాలెండర్‌ను విడుదల చేసింది. నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్లు ప్రతి నెలా చివరి శుక్రవారం నిర్వహించాలి. జూన్ 2023 కోసం నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్ 30 జూన్ 2023న “సమగ్ర శిక్ష” థీమ్పై నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో వక్తలుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర చిత్రకూట్ జిల్లా కలెక్టర్మరియు జిల్లా కలెక్టర్ మహేసనా, గుజరాత్ పాల్గొంటారు. ఈ కార్య్రమాన్ని భారతదేశంలోని అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు మరియు పరిపాలనా సంస్కరణల కార్యదర్శులు, రాష్ట్ర పరిపాలన శిక్షణా సంస్థలు మరియు కేంద్ర శిక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులు ఈ వెబ్‌నార్లలో పాల్గొంటారు. నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్ సిరీస్ క్యాలెండర్ను https://darpg.gov.in/sites/default/files/Compendium23-24.pdfలో యాక్సెస్ చేయవచ్చు. 2022-23 సంవత్సరంలో, డి.ఎ.ఆర్.పి.జి ఏప్రిల్, 2022 నుండి ఏప్రిల్, 2023 వరకు 13 నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్లను నిర్వహించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ స్కీమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ కింద అవార్డ్-విన్నింగ్ నామినేషన్ల విధాన వ్యాప్తిని ప్రోత్సహించడానికి మరియు ప్రతిరూపాన్ని ప్రోత్సహించడానికి. ఒక్కో వెబ్నార్కు సుమారు 1000 మంది అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతి నేషనల్ గుడ్ గవర్నెన్స్ వెబ్నార్ సిరీస్ 2022-23 సంకలనాన్ని 2023 ఏప్రిల్ 20న సివిల్ సర్వీసెస్ డే ఈవెంట్లు 2023 ప్రారంభ సెషన్లో విడుదల చేశారు.
******
(Release ID: 1936215)
Visitor Counter : 208