కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘5G & బియాండ్ హ్యాకథాన్ 2023’ని ప్రకటించిన టెలికాం శాఖ


100 అంకుల సంస్థలకు 5G అభివృద్ధి & ఉత్పత్తులు/సొల్యూషన్‌ల అభివృద్ధికి అవకాశం

Posted On: 28 JUN 2023 6:10PM by PIB Hyderabad

భారత ప్రభుత్వపు టెలికాం శాఖ 5జీ ఉత్పత్తులు, పరిష్కారాల అభివృద్ధి కోసం హ్యాకథాన్‌లను నిర్వహిస్తోంది. వివిధ సాంకేతిక రంగాలలో 5G ఉత్పత్తులు/సొల్యూషన్‌ల అభివృద్ధిని ఇది అత్యున్నత స్థితికి చేర్చుతుంది. '5G & బియాండ్ హ్యాకథాన్ 2023' కోసం జూన్ 28, 2023 నుండి టెలికాం శాఖ ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది, ఇది భారతదేశం-కేంద్రీకృతమైన అత్యాధునిక ఆలోచనలను షార్ట్‌లిస్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, వీటిని పని చేయదగిన 5జీ మరియు అంతకు మించి ఉత్పత్తులు మరియు పరిష్కారాలుగా మార్చవచ్చు. హ్యాకథాన్‌లో వంద మంది విజేతలు కోటి రూపాయల మొత్తం ప్రైజ్ పూల్‌ను పంచుకుంటాయి. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, టెల్కోలు/ ఓఈఎంల నుండి మెంటార్‌ల మద్దతుతో ఆయా అంకుర సంస్థలకు  మార్కెట్‌ను సిద్ధంగా ఉంచడానికి వారి 5జీ ఉత్పత్తులు/సొల్యూషన్‌లను మరింత వృద్ధి చేసేందుకు మరియు అమలు చేయడానికి ఒక అవకాశంగా కూడా ఇది నిలుస్తుంది.  ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఆరోగ్య సంరక్షణ, వి్ద్య & పరిపాలన, అగ్రిటెక్ & లైవ్‌స్టాక్, పర్యావరణ, పబ్లిక్ సేఫ్టీ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎంటర్‌ప్రైజ్, స్మార్ట్ సిటీస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ & ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్ & ట్రాన్స్‌పోర్టేషన్ మల్టీమీడియా & బ్రాడ్‌కాస్ట్ శాటిలైట్, ఇతరులతో పాటుపలు వర్గాల నుండి 5జీ & అంతకు మించి పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు. 5జీ & బియాండ్ హ్యాకథాన్ భారతదేశంలోని వ్యక్తులు, విద్యార్థులు, స్టార్టప్‌లు మరియు విద్యాసంస్థలకు అందుబాటులో ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దరఖాస్తులను జూలై 31, 2023న స్వీకరిస్తారు. మరిన్ని వివరాల కోసం https://dcis.dot.gov.in/hackathon పోర్టల్లో వీక్షించవచ్చు. 

 

***



(Release ID: 1936214) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Odia