కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"డిజిటల్ కమ్యూనికేషన్ సెక్టార్‌లో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ద్వారా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, సర్వీసెస్, యూజ్ కేస్‌లు మరియు బిజినెస్ మోడల్‌లను ప్రోత్సహించడం"పై కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసిన ట్రాయ్
Posted On:
22 JUN 2023 7:11PM by PIB Hyderabad
"డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ద్వారా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, సర్వీసెస్, యూజ్ కేసులు మరియు బిజినెస్ మోడల్‌లను ప్రోత్సహించడం"పై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. టెలికాం సాంకేతిక ఆవిష్కరణల కోసం అనేక దేశాల్లోని నియంత్రణ సంస్థలు శాండ్‌బాక్స్ ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేశాయి. ఈ ఫ్రేమ్‌వర్క్‌లు నియంత్రిత పరిసరాలలో కొత్త భావనలను పరీక్షించడానికి అనుమతిస్తాయి, మినహాయింపులు, భత్యాలు, సమయ పరిమితి మినహాయింపులను మంజూరు చేస్తాయి. ఈ ఫ్రేమ్‌వర్క్‌లు ఆర్థిక స్థితిస్థాపకత మరియు వినియోగదారుల రక్షణతో ఆవిష్కరణల కోసం నియంత్రకుల అభిలాషణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో, రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ కోసం ఫ్రేమ్‌వర్క్‌పై సిఫార్సులను అందించాలని టెలికాం విభాగం (డీఓటీ) ట్రాయ్ అభ్యర్థించింది. సృజనాత్మకతను ప్రోత్సహించడం మరియు డిజిటల్ కమ్యూనికేషన్ల రంగంలో అత్యాధునిక సాంకేతికతలను వేగవంతం చేయడం వంటి లక్ష్యంతో అథారిటీ సమస్యకు విధానాలను సూచిస్తుంది. కృత్తిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇతరత్రా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు డిజిటల్ కమ్యూనికేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి కనెక్ట్ చేయడం, ఇంటరాక్ట్ చేయడం మరియు సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నాయి. మేటి డైనమిక్ వాతావరణంతో పాటుగా ఉండేందుకు నవ సాంకేతికతలు, సేవలు, వినియోగ కేసులు, వ్యాపార నమూనాల అభివృద్ధి, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉంది. రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ వ్యూహం వివిధ రకాల పరిశ్రమలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే మార్గంగా ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందింది. ఇక్కడ కంపెనీలు మరియు ఇన్నోవేటర్‌లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నప్పుడు వారి భావనలు, వస్తువులు, సేవలను పరీక్షించవచ్చు. రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ టెలికాం పరిశ్రమలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌కి రియల్ టైమ్ నెట్‌వర్క్ వాతావరణం మరియు ఇతర డేటాకు యాక్సెస్ ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తుంది. తద్వారా కొత్త అప్లికేషన్‌లను మార్కెట్‌లో విడుదల చేయడానికి ముందు వాటి విశ్వసనీయతను పరీక్షిస్తుంది. ప్రారంభ కంపెనీకి అన్ని క్లియరెన్స్‌లను పొందేలా సింగిల్ విండోను అందించడానికి, ఇతర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సహాయాన్ని పొందడం ద్వారా ఇటువంటి పరీక్షలను నిర్వహించడం కోసం రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ క్రాస్ సెక్టోరల్ సహకారాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తుంది. ట్రాయ్ తన సంప్రదింపుల పత్రంలో, డిజిటల్ కమ్యూనికేషన్ల రంగంలో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ యొక్క అవకాశాన్ని పరిశీలిస్తుంది.
***
(Release ID: 1934690)
Visitor Counter : 167