రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కెన్యా పర్యటనలో నౌకాదళ సిబ్బంది (డీసీఎన్ఎస్) డిప్యూటీ చీఫ్


- జూన్ 21 – 23, 2023 వరు అధికారిక పర్యటనలో వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రూ

Posted On: 22 JUN 2023 1:20PM by PIB Hyderabad

డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (డీసీఎస్ఎన్) వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రూ కెన్యాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. జూన్ 21 నుండి 23, 2023 వరకు ఆయన పర్యటనలో ఉంటారు. వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రూ కెన్యా పర్యటనలో ఉండగానే  తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (21 జూన్ 2023) వేడుకల్లో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఓషన్ రింగ్ ఆఫ్ యోగా’ కార్యక్రమంలో భాగంగా భారత నౌకాదళపు నౌక సునయన పోర్ట్లో మొంబాసాలో పోర్టకాల్లో ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. (https: //pib.gov.in/PressReleasePage.aspx?PRID= 1933722). కెన్యా రక్షణ మంత్రిత్వ శాఖ క్యాబినెట్ సెక్రటరీ డీసీఎన్ఎస్ హెచ్.ఇ. అడెన్ బేర్ డ్యుయేల్ తో సంజయ్ మహీంద్రూ 21 జూన్ 2023న సమావేశమయ్యారు.  పరస్పర చర్చల సందర్భంగా ఇరువురు రెండు సముద్ర పొరుగు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను గురించి ప్రధానం చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. అతను కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్ (కేడీఎఫ్),  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ ఫ్రాన్సిస్ ఓ ఒగోల్లాతో కూడా సమావేశమయ్యారు.  నావికా దళం మరియు కెన్యా నౌకాదళాల మధ్య పరస్పర చర్యలను పెంపొందించడం, సముద్ర డొమైన్‌లో సమన్వయ కార్యకలాపాలను పెంపొందించడం వంటి కీలకమైన అంశాలు కూడా చర్చించబడ్డాయి. ఉమ్మడి, సమన్వయ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు మంచి క్రమాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, సాధారణ సముద్ర సవాళ్లను ఎదుర్కోవడంలో మరింత సహకరించుకోవడం, ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. డీసీఎన్ఎస్ నైరోబీలోని జీఎల్ఓసీఈపీఎస్ (గ్లోబల్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ స్ట్రాటజీ) సభ్యులతో కూడా సంభాషించారు. వైస్ వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రూ మొంబాసాలోని మ్టోంగ్వీ నేవల్ బేస్‌ను సందర్శించి, కెన్యా నేవీ హెడ్‌క్వార్టర్స్ (కె.ఎన్.హెచ్.క్యూ) వద్ద కెన్యా నేవీ కమాండర్‌తో సంభాషించాల్సి ఉంది. రెండు నౌకా దళాల మధ్య కొనసాగుతున్న నౌకదళాల భాగస్వామ్య  విన్యాసాలు (ఎంపీఎక్స్) యొక్క హార్బర్ ఫేజ్ కార్యకలాపాలను డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్‌తో పాటు డీసీఎన్ఎస్, కేడీఎఫ్ పర్యవేక్షిస్తుంది మరియు ఐఎన్ఎస్ సునయన సిబ్బందితో కూడా సంభాషిస్తారు. వైస్ అడ్మిరల్ సంజయ్ మహీంద్రూ కెన్యా నావల్ ట్రైనింగ్ కాలేజ్ మరియు మొంబాసాలోని కెన్యా షిప్‌యార్డ్ లిమిటెడ్ గురించి అంతర్దృష్టులు అందించబడతాయి. డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ పర్యటన, కెన్యా మరియు భారతదేశం మధ్య బలమైన మరియు దీర్ఘకాల సంబంధాన్ని పునరుద్ఘాటిస్తుంది. కెన్యాతో ముఖ్యంగా సముద్ర రంగంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

***(Release ID: 1934638) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Hindi , Tamil