రక్షణ మంత్రిత్వ శాఖ
సర్దార్ కేఎం పణిక్కర్ 'నిబ్' వ్యాస రచన పోటీ
Posted On:
22 JUN 2023 4:24PM by PIB Hyderabad
భారతీయ నావికాదళం, తన సిబ్బందిలో చదవడం, రాయడం, విమర్శనాత్మక ఆలోచనలు, క్రమబద్ధమైన విశ్లేషణలను ప్రోత్సహించే లక్ష్యంతో సర్దార్ కేఎం పణిక్కర్ 'నిబ్' (నేవీ ఇంటెలెక్చువల్ బీకన్) వ్యాస రచన పోటీని ప్రవేశపెట్టింది. భారతీయ సాయుధ దళాధికారుల్లో ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం నిరంతర విద్య, శిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ వ్యూహాలు, సాయుధ దళాల నిర్వహణ వంటి అంశాలపై అవగాహనతో కూడిన అభిప్రాయాలు చెప్పడం సాహిత్య సాధన వల్ల వృద్ధి చెందుతుంది.
సముద్ర వ్యూహాల్లో దిట్ట అయిన సర్దార్ కేఎం పణిక్కర్ సంస్మరణార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో సముద్ర వ్యూహాల కోసం ఆయన చాలా కృషి చేశారు. సముద్ర రంగంలో చైతన్యం పెంపొందించేలా రచనలు చేశారు. భారతదేశ వృద్ధిలో సముద్ర శక్తి, నౌకాదళ విధానం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. దీంతో, నౌకాదళం వార్షిక క్యాలెండర్‌లో ఈ వ్యాస రచన పోటీ ఒక ముఖ్యమైన అంశంగా మారింది.
కెప్టెన్ (కల్నల్ హోదాకు సమానం) కంటే కింది స్థాయి అధికారులందరూ ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో విజేతకు ఒక ప్రత్యేకమైన బ్యాడ్జ్‌ను బహూకరిస్తారు. దానిని ఒక సంవత్సరం పాటు అతని/ఆమె యూనిఫాంలో ధరించవచ్చు. ఆ బ్యాడ్జ్‌ను నావికాదళ అధిపతి విజేతకు అధికారికంగా అందజేస్తారు.
(Release ID: 1934629)
Visitor Counter : 147