రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యాధునిక సామర్ధ్యాలను థాయ్‌లాండ్‌కు ప్రదర్శించిన భారతీయ రక్షణ పరిశ్రమలు
Posted On:
22 JUN 2023 5:33PM by PIB Hyderabad
రక్షణ పరిశ్రమల అత్యాధునిక సామర్ధ్యాలను ప్రదర్శిస్తూ, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌టిఎఎఫ్) డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ పిబూన్ వొర్రావనప్రీచా నాయకత్వంలోని థాయ్‌లాండ్ బృందానికి న్యూఢిల్లీలో 22 జూన్ 2023న రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తి విభాగం చర్చలతో కూడిన సమావేశాన్ని నిర్వహించింది.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన మైలురాయికి సంకేతంగా థాయ్ బృందానికి భారతీయ రక్షణ పరిశ్రమలు అత్యాధునిక రక్షణ సామర్ధ్యాలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమాన్ని పరస్పర అవగాహనను తీవ్రతరం చేయడం, సంభావ్య భాగస్వాములను అన్వేషించడం,ప్రాంతీయ భద్రతకు దోహదం చేయడాన్ని లక్ష్యాన్ని పెట్టుకుని నిర్వహించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఉమ్మడి పరిశోధనల కోసం మార్గాలను అన్వేషించడం, సాంకేతిక బదిలీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు కట్టుబడి ఉండాలని ఇరు పక్షాలూ కూడా నిబద్ధతను వ్యక్తం చేశాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి, ఉమ్మడి విన్యాసాలు, సామర్ధ్య నిర్మాణ చొరవలు సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాలకు మార్గాన్ని వేసేలా ప్రెజెంటేషన్లు, చర్చలు ఉన్నాయి.
***
(Release ID: 1934628)
Visitor Counter : 157