కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంత‌రిక్ష ఆధారిత క‌మ్యూనికేష‌న్ సేవ‌ల కోసం స్పెక్ట్రం అప్ప‌గింత పై సంప్ర‌దింపుల ప‌త్రంపై ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను అందుకునేందుకు ఆఖ‌రు తేదీని పొడిగించిన ట్రాయ్

Posted On: 14 JUN 2023 7:51PM by PIB Hyderabad

 అంత‌రిక్ష ఆధారిత క‌మ్యూనికేష‌న్ సేవ‌ల కోసం స్పెక్ట్రం అప్ప‌గింత పై సంప్ర‌దింపుల ప‌త్రాన్ని 06 ఏప్రిల్ 2023న టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌- టిఆర్ఎఐ) సంప్ర‌దింపుల ప‌త్రాన్ని విడుద‌ల చేసింది.  సంప్ర‌దింపుల ప‌త్రంలో లేవ‌నెత్తిన అంశాల‌పై భాగ‌స్వాములు /  వాటాదారులు లిఖిత‌పూర్వ‌క వ్యాఖ్య‌లను స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీని 04 మే, 2023గాను, ప్ర‌తి వ్యాఖ్య‌ల‌కు ఆఖ‌రు తేదీని 18 మే 2023గా నిర్ణ‌యించింది. వాటాదారులు, పారిశ్రామిక అసోసియేష‌న్ల విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లిఖిత పూర్వ‌క వ్యాఖ్య‌లు, ప్ర‌తి వ్యాఖ్య‌ల‌కు ఆఖ‌రు తేదీల‌న‌ను వ‌రుస‌గా 01 జూన్‌, 2023, 15 జూన్ 2023వ‌ర‌కు పొడిగించారు. 
సంప్ర‌దింపుల ప‌త్రంలో లేవ‌నెత్తిన అంశాల‌కు స్పంద‌న‌గా 64 మంది వాటాదారుల నుంచి వ్యాఖ్య‌ల‌ను అందుకోవ‌డం జ‌రిగింది. ఇవ‌న్నీ కూడా ట్రాయ్ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్పించేందుకు పారిశ్రామిక అసోషియేన్ నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తిని దృష్టిలో పెట్టుకుని లిఖిత‌పూర్వ‌క ప్ర‌తి వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీని 22 జూన్ 2023 వ‌ర‌కు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు. పొడిగింపు కోసం విజ్ఞ‌ప్తుల‌ను ఇక‌పై ప‌రిగ‌ణించ‌రు. 
ప్ర‌తి వ్యాఖ్య‌ల‌ను ట్రాయ్ స‌ల‌హాదారు (నెట్‌వ‌ర్క్స్‌, స్పెక్ట్రం, లైసెన్సింగ్‌) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదికి, ప్ర‌ధానంగా ఎల‌క్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.in అన్న ఐడికి పంపాలి. ఎటువంటి స్ప‌ష్టీక‌ర‌ణ‌/ స‌మాచారం కోసం టెలిఫోన్ నెంబ‌ర్  +91-11-23210481లో సంప్ర‌దించ‌వ‌చ్చు. 


***


(Release ID: 1932685) Visitor Counter : 135


Read this release in: Urdu , English , Hindi