రక్షణ మంత్రిత్వ శాఖ
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నచీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే
Posted On:
10 JUN 2023 12:02PM by PIB Hyderabad
ఈరోజు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ (POP)ని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. 152 రెగ్యులర్ కోర్సులు, 135 మంది టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన మొత్తం 374 మంది క్యాడెట్‌లు, ఏడు మిత్ర దేశాలకు చెందిన 42 మంది క్యాడెట్‌లు ఇండియన్ మిలిటరీ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి క్యాడెట్‌ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భారత సైన్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు విధి నిర్వహణ చేపడతారు.
నాయకత్వం, స్వీయ-క్రమశిక్షణ యుద్ధ కళ లో శిక్షణ ఇస్తున్న ప్రముఖ సంస్థలలో ఒకటిగా ఇండియన్ మిలిటరీ అకాడమీ గుర్తింపు పొందింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొంటారు. యుద్ధ రంగంలో ప్రవేశించి రాణించడానికి అవసరమైన మేధో, నైతిక , శారీరక దారుడ్యం అభివృద్ధి చేయడం లక్ష్యంగాఇండియన్ మిలిటరీ అకాడమీ శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు భారత సైన్యంలో ప్రవేశించడానికి అవసరమైన దేశభక్తి, వ్యక్తిత్వం, చైతన్యం, చొరవ , అవగాహన లాంటి అంశాలలో కఠిన శిక్షణ పొందుతారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అభినందించారు. క్రమశిక్షణ, అవగాహన తో సాగిన పాసింగ్ అవుట్ పరేడ్ క్యాడెట్లు పొందిన శిక్షణ, నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అని అన్నారు. భవిష్యత్తు సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ఇండియన్ మిలిటరీ అకాడమీ బోధకులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న క్యాడెట్లను ఉద్దేశించి ఆర్మీ చీఫ్ మాట్లాడారు. “సైనిక వృత్తి అన్ని వృత్తుల కంటే గొప్పది. దీని ద్వారా యూనిఫాం ధరించి, నిస్వార్థ భక్తితో మీ మాతృభూమికి సేవ చేయడానికి మీకు అపూర్వమైన అవకాశం లభిస్తుంది. ఇది ఒక లక్ష్యంతో సాగే వృత్తి. విధి నిర్వహణ ఒకోసారి ప్రాణ త్యాగం కూడా కోరుతుంది. రాబోయే సంవత్సరాల్లో దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం అచంచలమైన సంకల్పం తో పనిచేసి త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడే అవకాశం కలుగుతుంది." అని జనరల్ మనోజ్ పాండే అన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల తల్లిదండ్రులను జనరల్ మనోజ్ పాండే అభినందనలు తెలిపారు. " భారత సైన్యంలో పూర్తి స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకున్న వారి తల్లిదండ్రులు , సంరక్షకులకు నా అభినందనలు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడంలో మీరు పోషించిన పాత్రకు నా అభినందనలు. తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహం లేకుండా పిల్లలు జీవితంలో రాణించలేరు.శిక్షణ పూర్తి చేసుకుని క్యాడెట్లగా సైన్యంలోకి ప్రవేశిస్తున్న వారు భవిష్యత్తులో నాయకులు గా మారుతారు. మీ విలువైన సహకారానికి దేశం రుణపడి ఉంటుంది ” అని జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న విదేశాలకు చెందిన క్యాడెట్లను జనరల్ మనోజ్ పాండే ప్రత్యేకంగా అభినందించారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వివిధ స్నేహపూర్వక విదేశీ దేశాలకు చెందిన నలభై రెండు (42) క్యాడెట్‌లను నేను అభినందిస్తున్నాను. మీ దేశ రాయబారులుగా వచ్చిన మీరు అకాడమీలో పొందిన శిక్షణ, గడిపిన రోజులను కలకాలం గుర్తు చేసుకోవాలి. ఇండియన్ మిలిటరీ అకాడమీ లో మీరు పొందిన మీకు శిక్షణ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఖచ్చితంగా బలోపేతం చేస్తుంది." అని జనరల్ మనోజ్ పాండే అన్నారు.
జనరల్ మనోజ్ పాండే ఈ క్రింది అవార్డులు అందించారు: -
* అకాడమీ ప్రతిష్టాత్మక స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డు అండర్ ఆఫీసర్ మిహిర్ బెనర్జీకి లభించింది.
* ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన సీనియర్ అండర్ ఆఫీసర్ అభిమన్యు సింగ్‌కుగోల్డ్ మెడల్ లభించింది.
* ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో రెండవ స్థానంలో నిలిచిన అండర్ ఆఫీసర్ మిహిర్ బెనర్జీకి అకాడమీ రజత పతకాన్ని అందించారు.
* ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మూడవ స్థానంలో నిలిచినఅండర్ ఆఫీసర్ కమల్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం లభించింది.
* టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు లో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన జూనియర్ అండర్ ఆఫీసర్ సూరీ భాన్ సింగ్‌కు సిల్వర్ మెడల్ లభించింది.
* విదేశీ GCల ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన కింగ్ లెన్‌డప్ (భూటానీస్ ఆర్మీ)కి 'బంగ్లాదేశ్ ట్రోఫీ, పతకం' ప్రదానం చేశారు.
* స్ప్రింగ్ టర్మ్ 2023 లో జరిగిన 12 శిక్షణా కార్యక్రమాలలో మొత్తంగా మొదటి స్థానంలో నిలిచినా కాసినో కంపెనీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బ్యానర్‌ను అందించారు.
పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం "పిప్పింగ్ సెర్మనీ" జరిగింది, ఇందులో మెరుస్తున్న ఇత్తడి నక్షత్రాలు భారతీయ సైన్యం లో కొత్తగా ప్రవేశించిన అధికారులు ఇత్తడి నక్షత్రాలను తమ తల్లిదండ్రుల నుంచి స్వీకరించారు. లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఉత్తర, పశ్చిమ సరిహద్దు తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వారి సంబంధిత యూనిట్లలో చేరతారు.
***
(Release ID: 1931332)
Visitor Counter : 130