ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భారతదేశం క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో పెద్ద ఉత్పత్తి దేశంగా మారింది : కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా


2022-23లో 6.02 ఎంటి దిగుమతులు చేసుకోగా 6.72 ఎంటి ఫినిష్డ్ స్టీల్ ఎగుమతులు జరిగాయి : శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా

గత 9 సంవత్సరాల (2014-15 నుంచి 2022-23) మధ్య కాలంలో ఉక్కు సిపిఎస్ఇలు రూ.90,273.88 కోట్ల విలువ గల సొంత వనరులు పెట్టుబడులుగా పెట్టాయి

వివిధ నగరాల్లో ఆరు వాహన తుక్కు కేంద్రాలు ప్రారంభించారు, మరో మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి

డిఎంఐ & ఎస్ పి పథకం ఇంతవరకు రూ.34,800 కోట్ల దిగుమతి ప్రత్యామ్నాయాలు అందించింది : కేంద్ర మంత్రి
ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం కింద 27 కంపెనీలతో 57 ఎంఓయులు కుదుర్చుకున్నాం; రూ.29,530 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 55000 ఉపాధి అవకాశాల సామర్థ్యం ఏర్పడింది
హరిత ఉక్కు ఉత్పత్తికి 13 టాస్క్ ఫోర్స్ లు కార్యాచరణ ప్రణాళికలు గుర్తించాయి

Posted On: 07 JUN 2023 7:44PM by PIB Hyderabad

కేంద్రంప్రభుత్వ 9 సంవత్సరాల ‘‘సేవ,  సుశాసన్, గరీబ్  కల్యాణ్’’ అనే థీమ్ పై కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా బుధవారం న్యూఢిల్లీలోని రాజీవ్  గాంధీ భవన్  లో పత్రికా సమావేశం నిర్వహించారు. 

ప్రగతి (వృద్ధి), వికాస్ (అభివృద్ధి) రెండింటిలోనూ ఉక్కు రంగం ప్రాధాన్యతను తెలియచేస్తూ ‘‘2018 సంవత్సరంలో జపాన్  ను పక్కకు నెట్టి క్రూడ్  ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో  పెద్ద ఉత్పత్తిదారుగా మారింది’’ అని మంత్రి చెప్పారు. భారత ఉక్కు పరిశ్రమలో అద్భుతమైన వృద్ధి నమోదయిందన్నారు. 

గత 9 సంవత్సరాల క లంలో ప్రభుత్వ విజయాలను నొక్కి చెబుతూ 2022-23 సంవత్సరంలో 6.02 ఎంటి దిగుమతులు, 6.72 ఎంటి ఎగుమతులతో భారతదేశం నికర ఉక్కు ఎగుమతి దేశంగా మారిందన్నారు. 2014-15 సంవత్సరంలో 9.32 ఎంటి దిగుమతులు, 5.59 ఎంటి ఎగుమతులతో దేశం నికర దిగుమతిదారుగా ఉండేదని వివరించారు. 2014-15 ముందు నాటి స్థితి  నుంచి 2022-23 నాటికి ఉక్కు రంగం సాధించిన అద్భుతమైన వృద్ధిని ఈ దిగువ పట్టిక సూచిస్తుంది : 

కీలక కొలమానాలు

2014-15

2022-23

% పెరుగుదల

క్రూడ్ ఉక్కు సామర్థ్యం (ఎంటి)

109.85

160.03

46%

క్రూడ్ ఉక్కు ఉత్పత్తి (ఎంటి)

88.98

126.26

42%

స్థూల ఫినిష్డ్  ఉక్కు ఉత్పత్తి (ఎంటి)

81.86

122.28

49%

వినియోగం (ఎంటి)

76.99

119.86

57%

తలసరి ఉక్కు వినియోగం (కిలోలు)

60.8

86.7

 

 

గత 9  సంవత్సరాల కాలంలో (2014-15 నుంచి 2022-23) సెయిల్, ఎన్ఎండిసి, ఎంఓఐఎల్, కెఐఓసిఎల్, ఎంఎస్  టిసి, మెకాన్  వంటి ఉక్కు ఐపిఓలు తమ సొంత వనరుల నుంచి రూ.90,273.88 కోట్లు పెట్టుబడిగా పెట్టడమే కాకుండా ప్రభుత్వానికి రూ.21,204.18 కోట్లు డివిడెండ్  గా చెల్లించాయి. 

తుక్కు ఉక్కు రీసైక్లింగ్  విధానం 
ఫెర్రస్  స్క్రాప్  ను శాస్ర్తీయంగా ప్రాసెస్  చేసి, రీసైకిల్  చేయడాన్ని ప్రోత్సహించడం కోసం  తుక్కు ఉక్కు రీసైక్లింగ్  విధానం గురించి కేంద్రమంత్రి వివరిస్తూ దేశంలోని వివిధ నగరాల్లో ఆరు వాహన స్క్రాపింగ్  యూనిట్లు ప్రారంభించారని, మరో మూడు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జీవితకాలం ముగిసిపోయిన (ఇఎల్  వి) వాహనాలను ఉక్కు ఉత్పత్తికి ముడి సరకుగా వినియోగించాలన్నది లక్ష్యమని పేర్కొంటూ  ఈ విషయంలోరాష్ర్టప్రభుత్వాలను, ప్రైవేటు రంగాన్ని కూడా తమతో కలుపుకుంటున్నట్టు చెప్పారు.

జాతీయ స్టీల్  విధానం 2017 (ఎన్ఎస్  పి 2017) 
‘‘ఆర్థిక వృద్ధికి దోహదపడే ప్రపంచ పోటీ సామర్థ్యం గల, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన ఉక్కు పరిశ్రమ’’ అభివృద్ధి లక్ష్యంగా ప్రకటిస్తూ ఎన్ఎస్  పి 2017లో నిర్దేశించిన లక్ష్యం ఉక్కు రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా తెలిపారు. ఏడాదికి 300 ఎంటిపిఏ క్రూడ్  ఉక్కు ఉత్పత్తిని సాధించాలని, 2030-31 నాటికి 255 ఎంటిపిఏ క్రూడ్ ఉక్కు డిమాండు/ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించినట్టు చెప్పారు. అలాగే 2030-31 నాటికి సెయిల్  క్రూడ్  ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 19.51 ఎంటిపిఏ న చి 35.65 ఎంటిపిఏకు పెంచాలని నిర్ణయించామన్నారు. 

ప్రభుత్వం పూర్తిగా దేశీయంగా తయారైన ఉక్కు, స్టీల్ ఉత్పత్తులనే  సమీకరించాలని నిర్ణయించిందని, ఇది రూ.34,800 కోట్ల దిగుమతి ప్రత్యామ్నాయాలకు దారి తీసిందని మంత్రి నొక్కి చెప్పారు. 

ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల  పథకం (పిఎల్ఐ) 
స్పెషాలిటీ  స్టీల్  దేశీయంగానే ఉత్పత్తి చేయాలన్న విధానంలో పిఎల్ఐ పథకం ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ  ఈ స్కీమ్  కింద ఇప్పటివరకు 27 కంపెనీలతో 57 ఎంఓయులు కుదుర్చుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇది రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 24.7 మిలియన్  టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం, 55,000 ఉపాధి అవకాశాల కల్పన ఏర్పడనున్నట్టు చెప్పారు. 

ఇతర ఉత్పత్తుల నుంచి మన ఉత్పత్తులను వేరుగా చూపించడంలో ‘బ్రాండ్ ఇండియా’ లేబుల్  కీలకం. ఈ దిశగా ఉక్కు మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చొరవ గురించి ప్రస్తావిస్తూ దేశంలో ఉక్కు ఉత్పత్తులన్నింటికీ మేడ్  ఇన్  ఇండియా బ్రాండింగ్  చేయనున్నారని, ప్రధాన ఉక్కు ఉత్పత్తిదారులందరూ ఇప్పుడు ఇందులో భాగస్వాములయ్యారని మంత్రి చెప్పారు.

ఉక్కు మంత్రిత్వ శాఖ స్వయంగా పిఎం గతిశక్తి జాతీయ మాస్టర్  ప్లాన్  పోర్టల్  లో చేరిందని, 22 కీలకమైన మౌలిక వసతుల వ్యత్యాసాలను గుర్తించి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ;  షిప్పింగ్, వాటర్  వేస్ మంత్రిత్వ శాఖలతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నదని తెలిపారు. 

ఉక్కు రంగంలో కర్బన వ్యర్థాల తగ్గింపును ప్రోత్సహించడం లక్ష్యంగా హరిత ఉక్కు ఉత్పత్తికి సంబంధఇంచి ప్రత్యేక కార్యాచరణ చేపట్టవలసిన విభాగాలను గుర్తించేందుకు 13 టాస్క్  ఫోర్స్  లు ఏర్పాటు చేసింది.  ఈ దిశగా ఉక్కు పరిశ్రమతో పాటుగా పర్యావరణం;  అడవులు వాతావరణ మార్పులు (ఎంఓఇఎఫ్  సిసి), రైల్వే, విద్యుత్  వంటి ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా నిరంతరం సంభాషణలు జరుపుతోంది.  

 

***
 (Release ID: 1930730) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi