ఆయుష్
తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సైడ్ ఈవెంట్ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
భారతీయ సాంప్రదాయ వైద్యంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఫోరం రూపొందించిన “జీ20 ప్రైమర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్” ఆవిష్కరణ
Posted On:
04 JUN 2023 7:36PM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ ఏడాది జూన్ 4 నుండి జూన్ 6 వరకు నిర్వహిస్తున్న 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సైడ్ ఈవెంట్ ఎగ్జిబిషన్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశోధన మండలిచే అభివృద్ధి చేయబడిన ఆయుష్-64, ఆయుష్-82,యూఎన్‌ఐఎం004 + యూఎన్‌ఐఎం 005, కబాసుర కుడినీర్ మరియు హోమియోపతిక్ ఫార్ములేషన్ నానోకుర్కుమిన్ వంటి పరిశోధన ఆధారిత ఆయుష్ ఔషధాలు/ఫార్ములేషన్‌ను ప్రదర్శిస్తోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) వారు తయారు చేసిన ఆయుష్ ఫార్ములేషన్‌ను కూడా ప్రదర్శిస్తోంది.

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన “జీ20 ప్రైమర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్” మరియు ఫోరమ్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఎఫ్‌ఐటిఎం)ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బాఘెల్, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.పి. ప్రసాద్, సిసిఆర్‌ఏఎస్ ఆర్‌ఓ డాక్టర్ సంతోష్ మానే మరియు హైదరాబాద్ ఎన్‌ఐఐఎంహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.
సాంప్రదాయ వైద్యంపై జీ-20 ప్రైమర్ బుక్‌లెట్ ఆయుష్ వ్యవస్థలు మరియు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో దాని పాత్రపై సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. దాంతో పాటు ఈ ప్రైమర్ ఆయుష్ వ్యవస్థ సూత్రాలు, అభ్యాసాలు మరియు ప్రయోజనాలు, ప్రధాన స్రవంతి ఆరోగ్య సంరక్షణలో దాని ఏకీకరణను ప్రోత్సహించడం, దాని ప్రయోజనాలు మరియు సవాళ్లను అన్వేషించడం మరియు జీ-20-సభ్య దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
జీ-20 సభ్య దేశాలకు చర్చలలో పాల్గొనడానికి, అనుభవాలను పంచుకోవడానికి మరియు ఆయుష్‌ను వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోకి చేర్చడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇది పునాదిగా ఉపయోగపడుతుంది. ఏకీకరణ, సహకారం, పరిశోధన మరియు నియంత్రణను ప్రోత్సహించడం ద్వారా జీ-20 దేశాలు ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడానికి, అందుబాటులో ఉండే మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించడానికి మరియు ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేయడానికి ఆయుష్ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
జీ20 ఇండియా ప్రెసిడెన్సీలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం హెల్త్ ట్రాక్‌కు సంబంధించిన యొక్క మూడు కీలక ప్రాధాన్యతలపై దృష్టి సారించింది. 3వ హెచ్‌డబ్ల్యుజి సైడ్ ఈవెంట్స్ ఎగ్జిబిషన్ ఆరోగ్య రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను హైలైట్ చేస్తోంది.
***
(Release ID: 1929785)
Visitor Counter : 204