మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సింగపూర్ విద్యా మంత్రి తో సమావేశమైన భారత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ : ద్వైపాక్షిక సహకారాన్ని , విద్య, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పై దృష్టి


పరస్పర , ప్రపంచ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి భారత్- సింగపూర్ దేశాలు కట్టుబడి ఉన్నాయి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

సింగపూర్ లో ముగిసిన ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన

Posted On: 31 MAY 2023 7:30PM by PIB Hyderabad

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సింగపూర్ పర్యటన ముగిసింది. ప్రస్తుత సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, విద్య, నైపుణ్యాభివృద్ధిలో ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడానికి ఉన్న అవకాశాలను అన్వేషించడానికి మంత్రి సింగపూర్ లో మూడు రోజుల పర్యటన జరిపారు.

 

తన పర్యటనలో మూడవ, చివరి రోజున శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సింగపూర్ విద్యా శాఖ మంత్రి శ్రీ చాన్ చున్ సింగ్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపై మంత్రులు ఫలవంతమైన చర్చలు జరిపారు.

 

పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం, వృత్తి విద్యను ఏకీకృతం చేయడానికి భారతదేశంతో సింగపూర్ భాగస్వామ్యం అయ్యే మార్గాలను కూడా శ్రీ ప్రధాన్ పరిశీలించారు. సంస్థాగత యంత్రాంగాల ద్వారా ప్రస్తుత భాగస్వామ్యం పరిధిని విస్తృతం చేయడానికి, ముఖ్యంగా ఉపాధ్యాయులు , శిక్షకుల సామర్థ్యాలను పెంపొందించడానికి, భవిష్యత్తు నైపుణ్యాలను విద్య - నైపుణ్య పర్యావరణ వ్యవస్థలో చేర్చడానికి , ప్రత్యేక పాఠశాలలు, క్రీడా పాఠశాలలతో భాగస్వామ్యాన్ని అన్వేషించడానికి ఇద్దరు మంత్రులు అంగీకరించారు.

 

గత మూడు జి 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో క్రియాశీలంగా పాల్గొన్నందుకు శ్రీ చాన్ చున్ సింగ్ కు, సింగపూర్ విద్యా మంత్రిత్వ శాఖకు శ్రీ ప్రధాన్ తన కృతజ్ఞతలు తెలియజేశారు.

భారత్, సింగపూర్ వంటి సహజ మిత్రదేశాలు పరస్పర, ప్రపంచ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. . పుణెలో త్వరలో జరగనున్న జీ20 విద్యా మంత్రుల సమావేశంలో సింగపూర్ ప్రతినిధి బృందం పాల్గొంటుంది.

 

సింగపూర్ ను భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ఆ ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమం - స్కిల్స్ ఫ్యూచర్ సింగపూర్ - ను శ్రీ ప్రధాన్ సందర్శించారు. స్కిల్స్ ఫ్యూచర్ సింగపూర్ (ఎస్ ఎస్ జి ) జాతీయ స్కిల్స్ ఫ్యూచర్ ఉద్యమం అమలును ప్రేరేపిస్తుంది. సమన్వయం చేస్తుంది, నైపుణ్యాల ప్రావీణ్యతను అన్వేషించడం ద్వారా జీవితకాల అభ్యసన సంస్కృతి ,సంపూర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. సింగపూర్ లో నాణ్యమైన విద్య , శిక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

 

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, సింగపూర్ ను జీవితకాల అభ్యాసకుల దేశంగా, నైపుణ్యాల ప్రావీణ్యానికి విలువనిచ్చే సమాజంగా తీర్చిదిద్దేందుకు స్కిల్స్ ఫ్యూచర్ దోహదపడుతుందన్నారు.

స్కిల్స్ ఫ్యూచర్ చొరవ సింగపూర్ వాసులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించిందని, సింగపూర్ తదుపరి దశ అభివృద్ధిలో ఇది కీలక చోదకశక్తి అని ఆయన అన్నారు.  భారతదేశంలో నిరంతర విద్య , జీవితకాల అభ్యాసం కూడా జాతీయ విద్యావిధానం (ఎన్ఇపి) మూలమని శ్రీ ప్రధాన్ చెప్పారు. ఈ రోజు పొందిన అంతర్దృష్టులు భారతదేశ నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మార్చడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడానికి , జాతీయ పురోగతిని నడిపించడానికి  యువ జనాభా పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే మన ప్రయత్నాలకు విలువను జోడిస్తాయని ఆయన పేర్కొన్నారు.

 

సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, డిజైన్ ను కూడా ఆయన సందర్శించారు.

 

శ్రీ ప్రధాన్ తన మూడు రోజుల సింగపూర్ పర్యటనలో, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన పలువురు కీలక మంత్రులను కలుసుకున్నారు. డి పి ఎం , ఆర్థిక మంత్రి, సింగపూర్, శ్రీ లారెన్స్ వాంగ్; సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ గాన్ కిమ్ యాంగ్; సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్;  సీనియర్ మంత్రి , సామాజిక విధానాల సమన్వయ మంత్రి శ్రీ ధర్మన్ షణ్ముగరత్నం లను శ్రీ ప్రధాన్

కలుసుకున్నారు. భువనేశ్వర్ లో జరిగిన జి20 ఫ్యూచర్ ఆఫ్ వర్క్ వర్క్ వర్క్ షాప్ ఫలితాల ఆధారంగా, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి , భారతీయ నైపుణ్య పర్యావరణ వ్యవస్థను మార్చడానికి సింగపూర్ నైపుణ్యం , పరిజ్ఞానాన్ని భారతదేశం ఉపయోగించుకునే మార్గాలపై వారు చర్చించారు.

 

భారత్- సింగపూర్ దేశాలు బలమైన చారిత్రక, సాంస్కృతిక , నాగరిక సంబంధాలను కలిగి ఉన్నాయని శ్రీ ప్రధాన్ అన్నారు. ఈ రోజు మన స్నేహం ఇచ్చి పుచ్చు కోవడం, పరస్పర విశ్వాసం,  గౌరవంతో వేళ్లూనుకు పోయింది. విజ్ఞానం, నైపుణ్యాలు, సరిహద్దు రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం మన చిరకాల స్నేహానికి కొత్త కోణాలను జోడిస్తుంది‘  అని ఆయన అన్నారు.

 

నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, స్పెక్ట్రా సెకండరీ స్కూల్, స్కిల్స్ ఫ్యూచర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ సహా వివిధ పాఠశాల, ఉన్నత, నైపుణ్య సంస్థలను కూడా శ్రీ ప్రధాన్ సందర్శించారు.

 

శ్రామిక శక్తి శిక్షణ కోసం సింగపూర్ లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు,  నమూనాల గురించి మరింత అవలోకనం చేసే అవకాశం శ్రీ ప్రధాన్ కు లభించింది. బోధన-అభ్యసన వాతావరణం, బోధనా విధానం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తు పని ప్రదేశాలకు వారిని సిద్ధం చేయడానికి ప్రతి అభ్యాసకుడికి తగిన వేగంతో అభ్యసనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుందని తెలుసుకున్న మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య, పరిశోధన, సృజనాత్మకత, ఎంటర్ ప్రెన్యూర్ షిప్,  తరగతి గది నాలుగు గోడలను దాటి అభ్యసనను తీసుకువెళ్ళడంపై మంత్రి భారతీయ విద్యార్థులతో సంభాషించారు ఉత్తమ అంతర్దృష్టులను గ్రహించారు.

 

21వ శతాబ్దం భారతదేశ శతాబ్దం కాబోతోందని ప్రధాన్ ఉద్ఘాటించారు. 21వ శతాబ్దానికి స్ఫూర్తినిచ్చేలా కొత్త నమూనాలను రూపొందించేందుకు

ఎన్ టి యు , భారత విశ్వవిద్యాలయాలు వంటి ప్రపంచ శ్రేణి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

 

సింగపూర్ పర్యటనలో భాగంగా ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థులు, ఒడియా అసోసియేషన్, భారత సంతతి సభ్యులతో మంత్రి సమావేశాలు జరిపారు.

 

*****


(Release ID: 1928844) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi