ఆయుష్
ఏఐఐఏ, విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రారంభమైన గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ ఫోరమ్ సమావేశం
Posted On:
31 MAY 2023 4:14PM by PIB Hyderabad
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఐ-వైఎస్ఆర్ఐ (గ్లోబల్ ఇండియన్ యంగ్ సైంటిస్ట్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమయింది. సదస్సు జూన్ 2వ తేదీ వరకు ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో సదస్సు కొనసాగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కోటేచా సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐఐఏ, విజ్ఞాన భారతి సీనియర్ అధ్యాపకులు పాల్గొంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకారాన్ని, ఆవిష్కరణలు ప్రోత్సహించే అంశంపై దృష్టి సారించి పనిచేస్తున్న వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ప్రవాస భారతీయులు, నిపుణులు, ఇతరులు సమావేశంలో పాల్గొంటున్నారు.
గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ ఫోరమ్ ను వివిధ సంస్థల అధిపతులకు పరిచయం చేయడం, గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ ఫోరమ్ అందిస్తున్న సహకారం, కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాలను వివరించడం, నూతన అవకాశాలు అన్వేషించి ఒప్పందాలు కుదుర్చుకోవడం లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలను వైవిధ్యంగా , సమానత్వం,గా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను సదస్సు గుర్తిస్తుంది. మరిన్ని సంస్థల సహకారం పొందడానికి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రవాస భారతీయులకు మరింత ప్రాధాన్యత కల్పించడం, శాస్త్ర సాంకేతిక రంగాల పరిధి పెంచడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలులో ఉన్న ఒప్పందాలు, అభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు లాంటి అంశాలు సదస్సులో చర్చకు వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల అంశాలను చర్చించి అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభించేలా గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ ఫోరమ్ కృషి చేస్తుంది.
గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ సమావేశం, గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నో క్రాట్స్ ఫోరమ్ సదస్సు జరగడం పట్ల ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కోటేచా హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రవాస భారతీయులు సహకారం,సహాయం అందించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం పాత్రను ఆయన వివరించారు. వినూత్నంగా ఆలోచించి, ఉమ్మడి సమస్యల పరిష్కారానికి పరిష్కార మార్గాలు అభివృద్ధి చేయాలని ఆయన యువ శాస్త్రవేత్తలకు సూచించారు. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సహకారం, క్రమశిక్షణతో కూడిన పరిశోధనలు, ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సమున్నత స్థానం సాధిస్తుందన్నారు.
నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ఫోరమ్ (GIST) సదస్సుకు ఏఐఐఏ సహకారం అందించిందని ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) తనూజా నేసరి అన్నారు.. సదస్సులో సాంప్రదాయ ఆయుర్వేద విధానం,వ్యవసాయం కోసం ఆయుర్వేద ఆహారం లాంటి అంశాలను శాస్త్రవేత్తలు,సాంకేతిక నిపుణులు చర్చించి, శాస్త్ర సాంకేతిక రంగాల సహకారంతో అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని డాక్టర్ తనూజా నేసరి అన్నారు.
సదస్సులో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది పరిశోధకులు, యువ పరిశోధకులు, గ్రామీణ ఆవిష్కర్తలు హాజరయ్యారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద , విజ్ఞాన్ భారతి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కలిసి సదస్సు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమైన అంశాలపై చర్చలు , సమావేశాలు నిర్వహిస్తారు. శాస్త్రీయ పురోగతి ,ఆవిష్కరణల కోసం మార్గాలను గుర్తిస్తారు. . వివిధ శాస్త్రీయ విభాగాలకు చెందిన నిపుణులు తమ నైపుణ్యం, అనుభవాలు మరియు అంతర్దృష్టులను పంచుకుంటారు. పరస్పర సహకారం, సమాచార మార్పిడికి సదస్సు వాతావరణాన్ని అందిస్తుంది.
భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో కూడిన ఒక వేదికను ఏర్పాటు చేయడానికి సదస్సు అవకాశం కల్పిస్తుంది.
***
(Release ID: 1928775)
Visitor Counter : 147