పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
సంస్థ సుస్థిర అభివృద్ధి సాధనకు ఉపకరించే వినూత్న ఆవిష్కరణలు ఆవిష్కరించిన భారత్ పెట్రోలియం పరిశోధన, అభివృద్ధి విభాగం
బయో-రిఫైనరీ వ్యర్థాల వినియోగం కోసం వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న బీపీసీఎల్
ముడి చమురు నుంచి చమురు వెలికి తీసేందుకు, నిరంతర పర్యవేక్షణ, సామర్ధ్య పెంపుదల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న బీపీసీఎల్
ఇంధన పొదుపు కోసం అధిక సామర్థ్యం గల ఎల్పీజీ బర్నర్‌ను అభివృద్ధి చేసిన బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం
164 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసిన బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం
Posted On:
30 MAY 2023 5:32PM by PIB Hyderabad
గ్రేటర్ నోయిడాలో ఉన్న భారత్ పెట్రోలియం పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని ఇటీవల మీడియా బృందం సందర్శించింది.భారత్ పెట్రోలియం పరిశోధన, అభివృద్ధి విభాగం సాధించిన విజయాలు, చేపడుతున్న కార్యక్రమాలు వివరించడానికి పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పర్యటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పిఐబి ఏడిజి,పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ సమక్షంలో బీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ సంస్థలు) శ్రీ పి.ఎస్ రవి, బీపీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డి),శ్రీ బి.ఎల్. నెవల్కర్,బీపీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఇంచార్జ్ (ఆర్ అండ్ డి), శ్రీ ఆర్.కె. వూలపల్లి, బీపీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (పిఆర్, బ్రాండింగ్) శ్రీ ఎస్.ఏ. అక్తర్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.
దాని అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్న బీపీసీఎల్ వ్యూహాత్మక ప్రణాళికతో ప్రధాన ఉత్పత్తులు అమ్మకాల ద్వారా వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తోంది. పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ ప్రపంచంలో అత్యుత్తమ పరిశోధన కేంద్రాలలో ఒకటిగా బీపీసీఎల్ గుర్తింపు పొందింది.
బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం అనేక విజయాలు సాధించింది. పరిశోధన, అభివృద్ధి రంగంలో బీపీసీఎల్ అనేక మైలు రాళ్లు దాటింది. అత్యంత ఆధునిక ఆవిష్కరణలు సాధించిన బీపీసీఎల్ 164 ఆవిష్కరణలకు పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసింది. వివిధ దేశాలలో బీపీసీఎల్ 87 ఉత్పత్తులకు పేటెంట్ హక్కులు సాధించింది. బీపీసీఎల్ అభివృద్ధి చేసిన 17 సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగంలో ఉన్నాయి. 230 కి పైగా పత్రాలు వివిధ శాస్త్రీయ పుస్తకాలలో ప్రచురితం అయ్యాయి. వరి గడ్డి ముడి పదార్థంగా పనిచేసే 2జీ బయో-రిఫైనరీ యాష్, కంపోస్టబుల్ బయోమెటీరియల్స్ , సూపర్అబ్సార్బెంట్ పాలిమర్ ఉత్పత్తుల నుంచి "గ్రీన్ సిలికా"ను అభివృద్ధి చేయడం లాంటి ఆవిష్కరణలను బీపీసీఎల్ అభివృద్ధి చేసింది.
సుస్థిర అభివృద్ధి సాధించాలన్న భారత్ పెట్రోలియం లక్ష్య సాధనకు, శూన్య కర్బన విడుదల ఉండాలన్న [ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉద్గారాలను తగ్గించడానికి డీజిల్-ఇథనాల్ మిశ్రమం వంటి కార్యక్రమాలను బీపీసీఎల్ అభివృద్ధి చేసి అమలు చేస్తోంది. లక్ష్య సాధన కోసం ప్రముఖ సంస్థలతో అవగాహన కుదుర్చుకున్న బీపీసీఎల్ ఆవిష్కరణ సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.
భారతదేశంలో గ్లోబల్ క్లీన్ ఎనర్జీ విప్లవం సాధన కోసం ప్రధానమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల ప్రస్తావించిన కేంద్ర మంత్రి ,శ్రీ హర్దీప్ సింగ్ పూరి " ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాంకేతికత, స్థిరత్వం అంశాలకు బీపీసీఎల్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రగతి పధంలో సాగుతోంది.నైపుణ్యం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ భారతదేశ ఇంధన రంగంలో సమూల మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నబీపీసీఎల్ బృందానికి అభినందనలు" అని అన్నారు.
బీపీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి. కృష్ణకుమార్ మాట్లాడుతూ “ఇంధన లక్ష్యం సాధించడం మా లక్ష్యం, ప్రతిభ, ఆవిష్కరణలు, సాంకేతికత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న బీపీసీఎల్ సంస్థను వినియోగదారుల తమ మొదటి ఎంపికగా ఎంపిక చేసుకున్నారు. సం' అని అన్నారు.
వెబ్ ద్వారా మీడియాతో మాట్లాడిన బీపీసీఎల్ డైరెక్టర్ (రిఫైనరీస్) శ్రీ సంజయ్ ఖన్నా "చమురు శుద్ధి సంస్థలు తరచుగా ముడి నూనెల మిశ్రమాన్ని ప్రాసెస్ చేస్తాయి. దీని కోసం నిజ-సమయ ప్రాతిపదికన ఖచ్చితమైన విశ్లేషణ అందుబాటులో ఉండదు. ముడి చమురు నాణ్యత , వ్యత్యాసాలు విశ్వసనీయమైన సమాచారం లేకపోవడం వల్ల సామర్థ్యం వినియోగంలో మారుతుంది" అని అన్నారు.
పిఐబి ఏడిజి,పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ “ దేశంలో ఇంధన రంగాన్ని పటిష్టం చేసి అవసరమైన ఇంధన వనరులను అందుబాటులోకి తేవడానికి పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ కోసం దేశంలో అన్వేషణ మరియు ఉత్పత్తి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నాయి. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థలు పనిచేస్తున్నాయి." అని అన్నారు.
డిజిటల్ రంగంలో బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం ఒక ముఖ్యమైన మైలురాయి సాధించింది.పరిశోధన విభాగం రెండు వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేసింది. క్రూడ్ అనుకూలత కోసం K మోడల్, శీఘ్ర మరియు ఖచ్చితమైన నిజ-సమయ క్రూడ్ అస్సే కోసం BPMARRK® ని బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం అభివృద్ధి చేసింది. చమురు ,గ్యాస్ రంగంలో ఈ మైలురాయిని సాధించిన ఏకైక సంస్థగా బీపీసీఎల్ గుర్తింపు పొందింది. రిఫైనరీ యూనిట్ల నిజ-సమయ పర్యవేక్షణ మరియు ఆప్టిమైజేషన్ కోసం రిఫైనరీ ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని అందించడానికి ఇటీవల రిఫైనరీ సాఫ్ట్‌వేర్ వ్యాపారంలో ప్రపంచ అగ్రగామి అమెరికాకు చెందిన M/s Aspen Technology Inc.తో బీపీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.
దేశ సహజ వాయువు అవసరాలు 44 MMTPA గా ఉన్నాయి. 50% అవసరాలు దిగుమతులుగా ఉన్నాయి. దిగుమతుకు తగ్గించడానికి బీపీసీఎల్ పరిశోధన, అభివృద్ధి విభాగం పిఎన్జీ బర్నర్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసింది.. బర్నర్
55% సామర్థ్యాన్ని అధిగమించి 70% సామర్థ్యం సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగాత్మమగా పిఎన్జీ స్టవ్‌ను విడుదల చేచేయాలని నిర్ణయించారు. దీనివల్ల , ఇది దిగుమతి భారం గణనీయంగా తగ్గుతుంది.
***
(Release ID: 1928511)
Visitor Counter : 157