కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెగా జాబ్-ఫెయిర్ కమ్ శ్రామిక్ చౌపాల్ లో భాగంగా అభ్యర్థులకు, కార్మికులకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ఆఫర్ లెటర్లను, ఇ-లేబర్ కార్డులను అందజేశారు.


2023, మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భోపాల్‌లో మెగా జాబ్-ఫెయిర్ కమ్ శ్రామిక్ చౌపాల్ నిర్వహించబడింది

Posted On: 29 MAY 2023 5:48PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధిశాఖ, కార్మికశాఖ సహకారంతో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో  మెగా జాబ్-ఫెయిర్ కమ్ శ్రామిక్ చౌపాల్‌ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది.

ఈరోజు మెగా జాబ్ మేళా ముగింపు సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్... ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆఫర్‌ లెటర్లను పంపిణీ చేశారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న ఉద్యోగార్ధులు మరియు యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఆర్ఎఫ్ టైర్స్, ఎల్&టీ ఫైనాన్స్, హెచ్ డీబీ ఫైనాన్స్, ఎల్ ఐసీ, బజాజ్ క్యాపిటల్, కాస్మోస్, సుజుకి మోటార్స్, టైమ్స్ ప్రో, ప్రిన్స్‌స్టన్ కాలేజ్, కటారియా గ్రూప్ తదితర కంపెనీలతో సహా మొత్తం 107 కంపెనీల పారిశ్రామికవేత్తలు జాబ్-ఫెయిర్‌లో పాల్గొన్నారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) , ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ), ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ కూడా ఈవెంట్‌కు మద్దతు ఇచ్చాయి. పారిశ్రామికవేత్తలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, శిక్షణ మరియు ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, వెబ్ డెవలపర్లు, ఐటీ నిపుణులు, బయోమెడికల్ నిపుణులు, ఫిట్టర్, టర్నర్, సీఎన్సీ మెకానిక్ వంటి విభిన్న ఉద్యోగాల అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొన్నారు. వీరిలో 3300 కంటే ఎక్కువ మంది ఉద్యోగార్ధులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. 630 మందికి పైగా ఉద్యోగార్ధులను కంపెనీల ప్రతినిధులు అక్కడికక్కడే ఎంపిక చేశారు. మరో 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగార్ధులను తదుపరి ఇంటర్వ్యూ/రిక్రూట్‌మెంట్ కోసం వివిధ కంపెనీలు షార్ట్‌లిస్ట్ చేశాయి.

సామాజిక భద్రత/సంక్షేమ పథకాల గురించి కార్మికులకు, ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని కార్మికులకు అవగాహన కల్పించడానికి మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల కింద నమోదు చేసుకునేలా కార్మికులను ప్రోత్సహించడానికి మరియు సులభతరం చేయడానికి మెగా జాబ్ మేళాతోపాటు శ్రామిక్ చౌపల్ కూడా నిర్వహించబడింది. దీనికి సంబంధించి, ఇ-శ్రమ్, ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పీఎం-ఎస్ వై ఎం), ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈఫీఎఫ్ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (బీఓసీడబ్లూ), చీఫ్ లేబర్ కమిషనర్, కార్మికుల నమోదు, అవగాహన మరియు ఫిర్యాదుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి మే 27 నుండి 29 వరకు ఈ జాబ్ ఫెయిర్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశాయి.

ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది కార్మికులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. శ్రామిక్ చౌపాల్ ద్వారా దాదాపు 200 మంది కార్మికులు ఈఎస్ఐఎస్ ద్వారా ఆరోగ్య పరీక్షలు కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ కూడా ఇ-శ్రమ్, పీఎంఎస్ వైఎం, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ మరియు ఇతర లబ్ధిదారులకు సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు.

***

 


(Release ID: 1928278) Visitor Counter : 182
Read this release in: English , Urdu , Hindi , Tamil