మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

రేపు అండమాన్‌లో సాగర్ పరిక్రమ యాత్ర-VI ను ప్రారంభించనున్న శ్రీ పర్షోత్తం రూపాలా

Posted On: 28 MAY 2023 11:00AM by PIB Hyderabad

మత్స్య రంగం ప్రాథమిక స్థాయిలో 2.8 కోట్ల కంటే ఎక్కువ మంది మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులకు జీవనోపాధిఉపాధి, వ్యవస్థాపకతను అందిస్తుంది దీనికి తోడు విలువ గొలుసుతో పాటు అనేక లక్షల మందికి జీవన బాసటగా నిలుస్తోంది. ఈ రంగం దేశం యొక్క సామాజిక-ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా మారడానికి గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా అభివృద్ధి చెందింది. గత 75 ఏళ్లలో ఈ రంగం చేపల ఉత్పత్తిలో 22 రెట్లు పెరుగుదలతో రూపాంతరం చెందింది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా ఉన్న భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తి.. 2021-22లో సంవత్సరానికి రికార్డు స్థాయిలో 162.48 లక్షల టన్నులకు చేరుకుంది, 2020-21తో పోల్చితే 2021-22లో చేపల ఉత్పత్తిలో 10.34% పెరుగుదల నమోదు చేసింది. నేడు, ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారతదేశం 8శాతం వాటాతో 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా ఎదిగింది. ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి కల్చర్డ్ రొయ్యలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, మత్స్యకారులు, చేపల పెంపకందారులు మరియు వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలుసుకోవడానికి ముందుగా నిర్ణయించిన సముద్ర మార్గం ద్వారా మొత్తం దేశంలోని తీర ప్రాంతాలను సందర్శించడానికి "సాగర్ పరిక్రమ" కార్యక్రమం కింద విశిష్ట చొరవ తీసుకున్నారు. మత్స్యకారులు మరియు ఇతర వాటాదారుల ప్రయోజనాల కోసం దేశంలోని మత్స్య రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు వారి సమస్యలు మరియు సూచనల గురించి వారి నుండి నేరుగా వినడానికి వారితో సంభాషించడం "సాగర్ పరిక్రమ" విశిష్ట చొరవ. "సాగర్ పరిక్రమ" మొదటి దశ ప్రయాణం 5 మార్చి 2022న గుజరాత్‌లోని మాండ్వి నుండి ప్రారంభమైంది. ఇప్పటివరకు సాగర్ పరిక్రమలోని ఐదు దశల్లో గుజరాత్, డామన్ & డయ్యూ, మహారాష్ట్ర , కర్ణాటక తీర ప్రాంతాలు పశ్చిమ తీరాలు కవర్ చేయపడ్డాయి. సాగర్ పరిక్రమ ఫేజ్-VI ప్రయాణం అండమాన్ & నికోబార్ దీవులలోని ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ దఫా యాత్ర కొడియాఘాట్, పోర్ట్ బ్లెయిర్, పానీఘాట్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్, వి.కె. పూర్ ఫిష్ లెండింగ్ సెంటర్, హట్‌బే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం మొదలైన ప్రదేశాలను కవర్ చేస్తుంది. అండమాన్ & నికోబార్ దీవులు కలిగిన సుమారు 1,962 కి.మీ తీరం మరియు 35,000 చ.కి.మీ కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతం దృష్ట్యా మత్స్య అభివృద్ధికి విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

ఈ ద్వీపం చుట్టూ ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) సుమారు 6,00,000 చదరపు కిలోమీటర్లు, భారీ మత్స్య సంపదను కలిగి ఉంది. పెళుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయకుండా ఉపయోగించని మత్స్య వనరులను పెంపొందించడం ద్వారా చేపల ఉత్పత్తిని పెంపొందించడం కోసం మరియు మత్స్యకారుల సంక్షేమం , అభ్యున్నతికి, మత్స్య శాఖ, అండమాన్ & నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వివిధ పథకాలు/కార్యక్రమాలను అమలు చేస్తోంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ. పర్షోత్తం రూపాలా,  అండమాన్ & నికోబార్ యొక్క యుటీ అడ్మినిస్ట్రేషన్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, భారత ప్రభుత్వం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, ఆర్జీసీఏ మరియు ఎంపీఈడీఏ, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా మత్స్యకారుల ప్రతినిధులు అండమాన్ &నికోబార్ దీవులలో 29 - 30 మే, 2023 తేదీలలో జరిగే సాగర్ పరిక్రమ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోప్రగతిశీల మత్స్యకారులుమత్స్యకారులు మరియు చేపల పెంపకందారులుయువ మత్స్య పారిశ్రామికవేత్తలు మొదలైన వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం (పీఎంఎంఎస్వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీసంబంధించిన సర్టిఫికేట్లు/ అనుమతులు అందజేయబడతాయి.  పీఎంఎఎంఎస్వై  పథకంయుటీ పథకాలు-శ్రమ్ఎఫ్ఐడీఎఫ్కేసీసీ మొదలైన వాటి గురించి మత్స్యకారులకు తెలియజేసేందుకు గాను ప్రింట్ మీడియాఎలక్ట్రానిక్ మీడియావీడియోలు, జింగిల్స్ ద్వారా డిజిటల్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. సాగర్ పరిక్రమ అనేది మత్స్యకారులకు సంబంధించిన తీరప్రాంత సమస్యలను అర్థం చేసుకోవడానికి మత్స్యకారులు మరియు మత్స్యకారులతో ప్రత్యక్ష పరస్పర చర్చకు దారితీసే ప్రభుత్వ సుదూర విధాన వ్యూహాన్ని ప్రతిబింబించే కార్యక్రమం. సాగర్ పరిక్రమ మత్స్యకారుల అభివృద్ధి వ్యూహంలో భారీ మార్పులను సృష్టిస్తుంది. అందువల్ల, వాతావరణ మార్పు మరియు స్థిరమైన అభివృద్ధితో సహా మత్స్యకారులు మరియు మత్స్యకారుల జీవనోపాధి మరియు సమగ్ర అభివృద్ధిపై ఈ సాగర్ పరిక్రమ ప్రభావం రాబోయే దశల్లో చాలా విస్తృతంగా ఉంటుంది.

 

***



(Release ID: 1928048) Visitor Counter : 144