రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మ‌ణిపూర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్ళిన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సిఒఎఎస్‌)

Posted On: 27 MAY 2023 1:55PM by PIB Hyderabad

 చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ (సిఒఎఎస్‌) మ‌నోజ్ పాండే 27&28 మే 2023న మ‌ణిపూర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ ప్రాంతాల‌ను సంద‌ర్శించి, స్థానిక ఫార్మేష‌న్ క‌మాండ‌ర్‌ల‌తో ముచ్చ‌టించి, క్షేత్రస్థాయి ప‌రిస్థితి గురించి వాస్త‌వాల‌ను తెలుసుకుంటారు. ఆయ‌న ద‌ళాల‌తో కూడా ముచ్చ‌టిస్తారు. 
మ‌ర్నాడు, 28 మే 2023న ఆయ‌న కుమారి అన‌సూయ యుకేను, మ‌ణిపూర్ గౌర‌వ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఎన్‌.బీరేన్ సింగ్‌ను, ముఖ్య‌మంత్రి శ్రీ కుల్దీప్ సింగ్‌, మ‌ణిపూర్ ప్ర‌ధాన భ‌ద్ర‌తా స‌ల‌హాదారునుక‌లిసి మ‌ణిపూర్‌లో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా సాధార‌ణ ప‌రిస్థితుల‌ను పున‌రుద్ద‌రించేందుకు వ‌ర్త‌మాన‌ ప‌రిస్థితి, భ‌విష్య‌త్ మార్గం గురించి చ‌ర్చిస్తారు.
మ‌ణిపూర్‌లో అంత‌ర్గ‌త ప‌రిస్థితి కార‌ణంగా, త‌క్ష‌ణ‌మే రాష్ట్రప్ర‌భుత్వం 03 మే 2023న సైన్యానికి, అస్సాం రైఫిల్స్‌కు తోడ్ప‌డ‌వ‌ల‌సిందిగా విజ్ఞ‌ప్తి చేసింది. దీనికి త‌క్ష‌ణమే స్పందన‌గా, సైన్యం, అస్సాం రైఫిల్స్  135 కాల‌మ్‌ల‌ను న‌మోహ‌రించి, సున్నిత‌మైన‌, స‌రిహ‌ద్దుల‌లో ప్రాంతాల‌పై చురుకుగా ఆధిప‌త్యాన్ని సాధించ‌డం ద్వారా ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాదాపు 35,000 మంది పౌరుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి, నిర్వాసిత పౌరుల‌కు సైన్యం, అస్సాం రైఫిల్స్ త‌క్ష‌ణ స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను అందించింది.

***


(Release ID: 1927792) Visitor Counter : 223


Read this release in: English , Urdu , Hindi , Tamil