ఆయుష్
azadi ka amrit mahotsav

యునాని వేఐద్య వ్య‌వ‌స్థ అభివృద్ధికి మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తోడ్పాటు


యునాని వైద్య వ్య‌వ‌స్థ ప్రోత్సాహం కోసం తొలిసారి రూ. 45.34 కోట్ల‌ను కేటాయించిన మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌

హైద‌రాబాద్‌, చెన్నై, ల‌క్నో, సిల్చార్‌, బెంగ‌ళూరుల‌లో యునాని వైద్య కేంద్రాల ఆధునీక‌ర‌ణ‌

Posted On: 25 MAY 2023 1:15PM by PIB Hyderabad

భార‌త‌దేశంలో యునాని వైద్య కేంద్రాల‌ను ప్రోత్స‌హించేందుకు, ఆధునీక‌రించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సిసిఆర్‌యుఎం - యునాని వైద్య ప‌రిశోధ‌న కేంద్ర మండ‌లి),  బెంగుళూరులోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (ఎన్ ఐయుఎం -జాతీయ యునాని వైద్య సంస్థ)కు మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ తోడ్పాటునందించింది. కేంద్ర ప్రాయోజిత ప‌థ‌క‌మైన (సిఎస్ ఎస్) ప్ర‌ధాన‌మంత్రి జ‌న వికాస్ కార్య‌క్ర‌మం (పిఎంజెవికె) కింద రూ. 45.34 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను ఇచ్చేందుకు మైనారిటీ వ్య‌వ‌హారాల శాఖ ఆమోదాన్ని తెలిపింది. ఇది హైదరాబాద్‌, చెన్నై, ల‌క్నో, సిల్చార్‌, బెంగుళూరులో ఉన్న యునాని వైద్య కేంద్రాల ఆధునీక‌ర‌ణ‌కు తోడ్ప‌డుతుంది.
మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ సిసిఆర్‌యుఎంకు మొత్తం రూ. 35.52 కోట్ల‌ను, ఎన్ఐయుఎంకు రూ. 9.81 కోట్ల‌ను కేటాయించింది. కేంద్ర మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖకు నాయ‌క‌త్వం వహిస్తున్న శ్రీ స్మృతి ఇరానీని ఆయుష్ మంత్రిత్వ శాఖ కొనియాడుతూ, ఆమె స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వం కింద మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఎంఒఎ ప‌రిధిలోని యునానీ వైద్య కేంద్రాల అభివృద్ధికి నిధుల‌ను కేటాయించార‌ని పేర్కొంది.  
హైద‌రాబాద్‌, చెన్నై, ల‌క్నో, సిల్చార్, బెంగ‌ళూరు ప్రాంతాల‌లో యునాని వైద్యానికి సంబంధించిన వివిధ కేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు నిధుల‌ను ఆమోదించారు. సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ (సిసిఆర్‌యుఎం)కు మొత్తం రూ. 35.52 కోట్ల‌ను కేటాయించ‌గా, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (ఎన్ఐయుఎం) బెంగుళూరుకు రూ. 9.81 కోట్ల‌ను కేటాయించారు. 
హైద‌రాబాదులోని నేష‌న‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫ‌ర్ స్కిన్ డిజార్డ‌ర్స్ ( చ‌ర్మ వ్యాధుల‌కు యునాని వైద్య జాతీయ ప‌రిశోధ‌న సంస్థ‌)లోని యునాని వైద్య ప్రాథ‌మిక ప‌రిశ‌క్ష‌ధ‌నా కేంద్రాన్ని రూ. 16.05 కోట్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. చెన్నైలోని రీజిన‌ల్ రీసెర్చ్ ఆఫ్ యునాని మెడిసిన్‌లో ప్రీక్లినిక‌ల్ లాబొరేట‌రీకి రూ. 8.15 కోట్ల‌ను కేటాయించాల‌ని, ల‌క్నోలోని సెంట్ర‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిస‌న్‌లో మ‌స్క్యులోస్కెలిట‌ల్ డిజార్డ‌ర్స్కు ఇలాజ్ బిట్ త‌ద్బీర్ (రెజిమెన‌ల్ థెర‌పీ) కేంద్రం కోసం రూ. 8.55 కోట్లు, సిల్చార్ లోని రీజిన‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్‌లోని చ‌ర్మ‌, జీవ‌న‌శైలి వ్యాధుల‌కు (రెజిమెన‌ల్ థెర‌పీ) చికిత్స కోసం ఇలాజ్ బిట్ త‌ద్బీర్ కేంద్రానికి రూ. 2.75 కోట్ల‌ను కేటాయించాల‌ని మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాదించింది. 
బెంగుళూరులోని ఎన్ఐయుఎం లో రోగుల‌తో తోడుగా వ‌చ్చేవారికి విశ్రామ్ గృహ ను ఏర్పాటు చేసేందుకు రూ. 5.55 కోట‌ల‌ను, మోడ‌ల్ యునాని కాస్మెటిక్ కేర్‌, చిన్న‌స్థాయి యునాని ఫార్మ‌సీ, యునాని ముడి ఔష‌ధ నిల్వ కేంద్రానికి రూ. 4,26 కోట్ల‌ను పొంద‌నున్నారు. 
మైనారిటీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు చెందిన సాధికార క‌మిటీ 02 మార్చి 2023న జ‌రిగిన స‌మావేశంలో ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించింది. ఇప్ప‌టికే చెన్నై, ల‌క్నో, సిల్చార్‌లోని సిసిఆర్‌యుఎంలోని మూడు ప్రాజెక్టుల మంజూరు మొత్తం వ్య‌యంలో మొద‌టి విడ‌త‌గా (25%) రూ. 4,86 కోట్ల‌ను విడుద‌ల చేసింది. హైద‌రాబాదుకు సిసిఆర్‌యుఎం ప్రాజెక్టును, బెంగుళూరు ఎన్ఐయుఎంలోని ప్రాజెక్టుల‌కు నిధుల‌ను వారి డిపిఆర్‌ల‌ను ఆమోదించిన అనంత‌రం, ఇత‌ర సాంకేతిక‌త‌ల‌ను ఖ‌రారు చేసిన త‌ర్వాత విడుద‌ల చేస్తారు. గుర్తించిన ప్రాంతాల‌లో సామాజిక మౌలిక‌, ప్రాథ‌మిక సౌక‌ర్యాల కింద ప్రాంత అభివృద్ధి కార్య‌క్ర‌మం పిఎంజెవికె. 

 

***
 


(Release ID: 1927403) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi , Marathi