శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై ఒక పూట శిబిరాన్ని నిర్వహించిన సిఎస్ఐఆర్ - ఎన్ఐఎస్‌సిపిఆర్ & ఐడబ్ల్యుఎస్ఎ
Posted On:
25 MAY 2023 11:21AM by PIB Hyderabad
కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసువాయువు) కేంద్రీకరణ పెరుగడం అన్నది మన హార్మోన్లను, జీవక్రియలను, మొత్తంగా భావోద్వేగ సమతుల్యతను ప్రభావితం చేసిందని, కనుక, ఒత్తిడి, డిప్రెషన్ (స్తబ్దత, వ్యాకులత), ఆందోళన వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు అన్నవి నేడు సర్వసాధారణమయ్యాయని సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ అన్నారు. మన, మన కుటుంబ, స్నేహితుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం నేటి తక్షణ అవసరమని ఆమె పేర్కొన్నారు.
భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం (ఐడబ్ల్యుఎస్ఎ) సహకారంతో సిఎస్ఐఆర్ - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్‌సిపిఆర్) మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై ఒకపూట నిర్వహించిన శిబిరం ప్రారంభ సెషన్‌లో ప్రొఫెసర్ అగర్వాల్ తన ఆలోచనలను పంచుకున్నారు.
సాధారణంగా మనం భౌతిక ఆరోగ్యం గురించి చర్చిస్తాము, కానీ సామాజిక అపవాదు/ కళంకం అన్నది మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడకుండా చేస్తుంది. కానీ, మానసిక ఆరోగ్యాన్ని విస్మరించడం అన్నది మన భౌతిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని ప్రొఫెసర్ అగర్వాల్ అన్నారు. మానవ పరిణామం, భావోద్వేగాలు, పర్యావరణ మార్పులతో దాని సంబంధం గురించి మాట్లాడుతూ, దాదాపు గత రెండు దశాబ్దాలలో భూమాతపై బొగ్గుపులుసువాయువు కేంద్రీకరణ క్రమంగా పెరగడం కనిపించిందని ఆమె అన్నారు.
ఇమేజ్
మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు అన్న అంశంపై జరిగిన కార్యక్రమ ప్రారంభ సెషన్‌లో తన ఆలోచనలను పంచుకుంటున్న సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్
ఈ కార్యక్రమానికి సిఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ప్రధాన శాస్త్రవేత్త, ఐడబ్ల్యుఎస్ ఎ అధ్యక్షురాలు డాక్టర్ రీనా శర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఐడబ్ల్యుఎస్ఎ లక్ష్యాలను చర్చిచడమే కాక విజ్ఞానాన్ని సమాజానికి తీసుకువెళ్ళేందుకు తమ సంఘం ఎలా పని చేస్తుందో ఆమె చర్చించారు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహనను వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
సమతుల జీవనశైలి & మానసిక ఆరోగ్యం అన్న అంశంపై కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధనా అధికారి డాక్టర్ అమిత్ మదన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. భౌతిక, మానసిక శ్రేయస్సు మధ్య గల సహజ అనుసంధానతను ఆయన వివరించారు.
సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ సీనియర్ ప్రధాన శాస్త్రవేత్త, మానసిక ఆరోగ్య శిబిరం కోఆర్డినేటర్ డాక్టర్ కనికా మాలిక్ వందన సమర్పణ చేశారు. మానసిక ఆరోగ్య కార్యక్రమం అనంతరం ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇందులో సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ సిబ్బంది వైద్యులను కలిసి తమ ఆరోగ్య సమస్యలను పంచుకుని, వారితో సంప్రదించారు.
***
(Release ID: 1927254)
Visitor Counter : 171