ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలో రహస్య తాత్కాలిక ప్రయోగశాలను డిఆర్‌ఐ గుర్తించింది; రూ.3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్‌ చేసింది.

प्रविष्टि तिथि: 24 MAY 2023 8:55PM by PIB Hyderabad

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో రహస్య తాత్కాలిక ప్రయోగశాలను గుర్తించింది. మరియు 31.42 కిలోల అల్ప్రాజోలం (ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 ప్రకారం సైకోట్రోపిక్ పదార్ధం) స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

 


 


నిర్ధిష్ట నిఘా ఆధారంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా, వట్టెం గ్రామం (బిజినేపల్లి మండలం) పొలాల్లోని వ్యవసాయ పొలాల మధ్య మారుమూల పౌల్ట్రీ ఫారంలో అల్ప్రాజోలం తయారీకి సంబంధించిన రహస్య తాత్కాలిక ప్రయోగశాలను గుర్తించారు.

 



ప్రణాళికాబద్ధమైన సోదాల ఫలితంగా 31.42 కిలోల అల్ప్రాజోలం తుది ఉత్పత్తి (అక్రమ మార్కెట్‌లో సుమారు రూ. 3.14 కోట్లు) మరియు తయారీలో ఉపయోగించే యంత్రాలు మరియు ఇతర పరికరాలతో పాటు ప్రక్రియలో ఉన్న మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 



అల్ప్రాజోలం తయారీలో నిమగ్నమైన వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

 

****


(रिलीज़ आईडी: 1927064) आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी