స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరిన్ని శిషు సదనాలు తెరవాలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Posted On:
22 MAY 2023 4:54PM by PIB Hyderabad
మహిళా శ్రామిక శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరిన్ని శిషు సదనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ 20లో భాగంగా తిరువనంతపురంలో బీఎంఎస్ రాష్ట్ర మహిళా సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేరళలోని అంగన్‌వాడీలను మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 వేల అంగన్‌వాడీల్లో 13 శాతం సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కోరారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అనేది సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించి నేరుగా ప్రయోజనాలను అందించే పథకాలకు ఉత్తమ ఉదాహరణ అని శ్రీమతి ఇరానీ అన్నారు. మరింత మంది లబ్ధిదారులను గుర్తిస్తే ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆమె తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ. వి మురళీధరన్ ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు.
రాష్ట్రంలోని పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ మొత్తం సమాజం యొక్క పురోగతిని కలిగి ఉన్న ఒక బృహత్తర కార్యక్రమంగా మారుతుందని ఆయన అన్నారు.
(Release ID: 1926530)
Visitor Counter : 139