ఆర్థిక మంత్రిత్వ శాఖ
టుటికోరిన్ తీరం వద్ద రూ. 31.67 కోట్ల విలువైన 18.1 కిలోల అంబర్‌గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ
Posted On:
20 MAY 2023 3:25PM by PIB Hyderabad
దేశంలోని వృక్ష, జంతుజాలానికి ముప్పుగా ఉన్న అంబర్‌గ్రిస్ ( అంబరు అనే పరిమళద్రవ్యం) అక్రమ రవాణా ముఠా రాకెట్‌ను డైరెక్టొరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ఛేదించి, అక్రమ మార్కెట్లో సుమారు రూ. 31.67 కోట్ల విలువ చేసే 18.1 కిలోల అంబర్‌గ్రిస్‌ను ట్యుటికోరిన్ తీరం వద్ద నుంచి స్వాధీనం చేసుకుంది.
టుటికోరిన్‌లోని హార్బర్ బీచ్ తీరం సమీపం నుంచి శ్రీలంకకు 18..05. 2023 రాత్రి సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి అంబర్‌గ్రిస్‌ను అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠాకు సంబంధించి సేకరించిన నిర్ధిష్ఠ ఆధారం సహాయంతో, డిఆర్ఐ అధికారులు ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఒక వాహనాన్ని ఆపి, వాహనం ముందు సీటు నుంచి 18.1 కిలోల అంబర్‌గ్రిస్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని వ్యక్తులు తాము అక్రమరవాణాకు ప్రయత్నిస్తున్నట్టు అంగీకరించారు
అంబర్‌గ్రిస్ అనేది. స్పెర్మ్ వేల్ (తిమింగళాలలో దంతాలు కలిగిన రకం) ఉత్పత్తి. ఈ తిమింగళాలు వన్యప్రాణ సంరక్షణ చట్టం,1972, షెడ్యూలు II కింద జాబితాలో ఉన్న ఒక రక్షిత జాతి, కనుక దానిని స్వాధీనంలో ఉంచుకోవడం/ రవాణా/ ఎగుమతి చేయడం అన్నవి నిషిద్ధం.కనుక, అంబర్‌గ్రిస్‌తో పాటుగా నిషేధిత వస్తువును రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇటువంటి అక్రమ రవాణా ప్రయత్నాల నుంచి వృక్ష జంతుజాలాన్ని కాపాడేందుకు, పరిరక్షించే కృషిలో భాగంగా డిఆర్ఐ కోస్తా ప్రాంతాలలో తన నిఘాను, పర్యవేక్షణను తీవ్రతరం చేసింది. గత రెండేళ్ళలో, టుటికోరిన్ తీరం నుంచి అక్రమంగా దేశం నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో రూ. 54 కోట్ల విలువైన సుమారు 40.52 కిలోల అంబర్‌గ్రిస్‌ను డిఆర్ఐ స్వాధీనం చేసుకుంది.
అంబర్‌గ్రిస్‌ను అక్రమరవాణా చేసే ప్రయత్నంలో క్రియాశీలకంగా నిమగ్నమై ఉన్న కేరళ, తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
తదుపరి విచారణ పురోగతిలో ఉంది.
***
(Release ID: 1926065)
Visitor Counter : 158