వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ లో జాతీయ కార్యక్రమం

Posted On: 19 MAY 2023 3:47PM by PIB Hyderabad

      భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ  మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  మధ్యప్రదేశ్ లోని బాలఘాట్  దగ్గరి బారాసింవి రాజా భోజ్ వ్యవసాయ కళాశాలలో శనివారం  ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుగుతుంది.

       ప్రపంచ తేనెటీగల దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి,  మధ్యప్రదేశ్ ప్రభుత్వ  ఓబిసి సంక్షేమ కమిషన్  చైర్మన్ తదితర ప్రముఖులు ఈ  
ఉత్సవాలకు హాజరవుతారు.  తేనె తయారీతో సంబంధమున్న రైతులు / తేనెటీగల  పెంపకందార్లు / తయారీదారులు / పారిశ్రామికవేత్తలు  మరియు తేనె తయారీతో సంబంధమున్న భాగస్వామ్యపక్షాలకు చెందిన  దాదాపు  1000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు.  

   ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో  తేనెటీగల  పెంపకందార్లు,  తయారీదార్లు,  తేనె తయారీ రంగానికి చెందిన వివిధ భాగస్వామ్య పక్షాలు వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి వందకుపైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.

          తేనె ఉత్పత్తి, పరిశోధన, పరిశ్రమలతో భాగస్వామ్యం, దేశీయ & ఎగుమతి మార్కెట్ల కోసం వ్యూహం,  "మార్కెటింగ్ సవాళ్లు మరియు పరిష్కారాలు" వంటి అంశాలపై సాంకేతిక సమావేశాలు & చర్చ  జరుగుతాయి.  ఈ సమావేశం ఉద్దేశం రైతులు / తేనెటీగల పెంపకందార్ల శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం.  

         తేనెటీగల పెంపకం ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక  చర్యలు తీసుకుంటున్నది.  ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో 'జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్' పథకం ప్రారంభించింది.  దీని లక్ష్యం 'తీపి విప్లవం' తీసుకురావడం.  ఈ మిషన్ ద్వారా చిన్న మరియు మధ్య స్థాయి రైతులకు శాస్త్రీయ పద్ధతిలో తేనె తయారీ గురించి తెలియజెప్పడం.  అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం. పరిశోధన అభివృద్ధికి మద్దతివ్వడం.

       దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, వాటి నాణ్యత  పెరగడానికి,  వ్యవసాయ వాణిజ్యం పెంపొందడానికి తేనెటీగల పెంపకం ఆవశ్యకత ఎంతో  ఉంది.   దానివల్ల  భారతీయ రైతులు అంతర్జాతీయంగా తేనెకు, తేనెతుట్టెలకు ఉన్న డిమాండ్ వల్ల తమ ఆదాయాన్ని పెంచుకో గలుగుతారు.  

***


(Release ID: 1925821) Visitor Counter : 218


Read this release in: English , Urdu , Hindi , Tamil