శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సహకార పరిశోధన, బోధన, ఉమ్మడి అంకుర సంస్థలకు మార్గం సుగమం చేసేందుకు వివిధ విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ, విద్యాసంస్థల అధిపతులు, వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, అధిపతుల ఉన్నత-స్థాయి ఉమ్మడి అంతర్-సంస్థాగత సమావేశానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు:


సిలోస్ లో పని చేయడానికి బదులుగా ఎక్కువ ఏకీకరణ ఆధారంగా పని ప్రణాళిక.


ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం., ఐ.ఐ.ఎం.సి., ఏ.ఐ.ఐ.ఎం.ఎస్., సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.ఐ.ఎం. మొదలైన ప్రతిష్టాత్మక సంస్థలతో జమ్మూ భారతదేశంలో ఒక విద్యా కేంద్రంగా ఉంది. సహకార పరిశోధన, సామూహిక వ్యవస్థాపకత, & నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక కోసం ఈ తొలి అంతర్-సంస్థల అనుసంధాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది : డాక్టర్ జితేంద్ర సింగ్


నేడు దేశంలోని ఇతర సంస్థలకు వనరులను పంచుకోవడం, ఎక్కువ పరస్పర అనుసంధానం మొదలైన వాటి కోసం, ఈ అంతర్ సంస్థల అనుసంధాన సదస్సు ఒక కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్


భారతదేశంలో ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలో సిలోస్ లో పని చేయడం ఇకపై ఒక ఎంపిక కాదు, ఇది ఎక్కువ ఏకీకరణ, ఎక్కువ ఫలితాల కోసం విస్తృతమైన మేధోమథనాన్ని నొక్కి చెబుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 18 MAY 2023 7:11PM by PIB Hyderabad

సమిష్టి కార్యాచరణ ప్రణాళిక ద్వారా సహకార పరిశోధన, బోధన, ఉమ్మడి అంకుర సంస్థలకు మార్గం సుగమం చేయడంతో పాటు ఎక్కువ ఏకీకరణ ఆధారంగా పనిచేయడం కోసం ఏర్పాటు చేసిన వివిధ విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ, విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, అధిపతుల మొట్టమొదటి ఉన్నత-స్థాయి ఉమ్మడి అంతర్-సంస్థాగత సమావేశానికి, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు అధ్యక్షత వహించారు. 

 

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశంలో జమ్మూ ఒక విద్యా కేంద్రంగా ఉందనీ, ఐ.ఐ.టి., ఐ.ఐ.ఎం., ఐ.ఐ.ఎం.సి., ఏ.ఐ.ఐ.ఎం.ఎస్., సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.ఐ.ఎం., జి,ఎం,సి., ఎస్.కె.యు.ఏ.ఎస్.టి., సి.యు., జె.యు. వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఒకదానికొకటి సమీప దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు.   విస్తరించిన ఏకీకరణ నమూనాను అభివృద్ధి చేయడం కోసం ఈ తొలి అంతర్- సంస్థాగత అనుసంధానం సదస్సు ను ఎంపిక చేయడం జరిగిందని, తెలియజేశారు. ఇది ఇతర ప్రదేశాలు, సంస్థల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. 

 

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక సంస్థలన్నీ, కేవలం కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉన్నాయనీ, వాటి మధ్య అంతర్-సంస్థాగత అనుసంధానం, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   వనరుల భాగస్వామ్యం, మార్పిడితో పాటు, ఈ సంస్థల మధ్య ఉమ్మడి కార్యక్రమాలు కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను సృష్టిస్తాయని, ఆయన పేర్కొన్నారు.

 

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో, భారతదేశం ప్రపంచంలోని అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉందని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  జమ్మూ-కశ్మీర్‌ లోని అంకుర సంస్థల ఔత్సాహికులు ముందుకు వచ్చి నాయకత్వం వహించడానికి, జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ అంతర్- సంస్థాగత అనుసంధాన సదస్సు సహాయపడుతుందని, తెలియజేశారు.   జమ్మూ-కశ్మీర్‌ లో అరోమా మిషన్ కింద అంకుర సంస్థల సంస్కృతిని (అగ్రి-టెక్ స్టార్టప్‌లు) సృష్టించే దిశగా సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.ఐ.ఎం. ముందడుగు వేస్తున్నందున, ఇతర సంస్థలు కూడా తమ వనరులకు అనుగుణంగా అంకుర సంస్థలను రూపొందించడంలో ఈ అనుసంధాన సదస్సు సహాయపడుతుందని కూడా డాక్టర్ సింగ్ వివరించారు. 

 

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో సిలోస్ లు పని చేయడం ఇకపై ఒక ఎంపిక కాదు, ప్రత్యేకించి ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ ఏకీకరణ, ఎక్కువ ఫలితాల కోసం విస్తృతమైన మేధోమథనాన్ని నొక్కి చెబుతుంది, అని పేర్కొన్నారు.   ఈ రోజు దేశంలోని ఇతర సంస్థలకు వనరులను పంచుకోవడం, ఎక్కువ అంతర్- అనుసంధానత కలిగి ఉండడం వంటి వాటి కోసం, ఈ అంతర్-సంస్థాగత అనుసంధాన సదస్సు,  ఒక కార్యాచరణ ప్రణాళిక ను అందిస్తుందని, డాక్టర్ సింగ్ తెలియజేశారు. 

 

 

సంస్థలు ఏ రంగంలోనైనా సహకార నమూనాలను సూచించవచ్చు, తద్వారా ఇతర సంస్థలు కూడా పరిసర అనుసంధాన వాతావరణాన్ని సృష్టించడంలో అడుగులు వేయవచ్చు, అని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. 

 

 

ఉదాహరణకు, ఇంటర్న్-షిప్ లో ఉన్న వైద్యుల కోసం ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్వహణకు సంబంధించి ఐ.ఐ.ఎం. ఒక నమూనాను రూపొందించవచ్చునని, కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.

 

 

భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు శ్రీ అజయ్ కుమార్ సూద్, సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ & డి.ఎస్.ఐ.ఆర్. కార్యదర్శి డాక్టర్ ఎన్. కలై సెల్వి తో పాటు,  ఈ సమావేశంలో సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.ఐ.ఎం. డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్,  జమ్మూ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శక్తి గుప్తా,  జమ్మూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ప్రొ. ఉమేష్ రాయ్,   క్లస్టర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బచ్చన్ లాల్,  జమ్మూ ఎస్.కె.యు.ఏ.ఎస్.టి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ గనియె,  బి.జి.బి.ఎస్.యు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అక్బర్ మసూద్, ఎస్.ఎం.వి.డి.యు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.కె. సిన్హా,  సి.యు.జె. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.కె.సిన్హా,  జమ్మూ ఐ.ఐ.ఎం. డైరెక్టర్, ప్రొఫెసర్ బి.ఎస్. సహాయ్,  జమ్మూ ఐ.ఐ.టి. డైరెక్టర్ మనోజ్ కుమార్,  జమ్మూ జి.ఎం.సి. ప్రిన్సిపాల్ శ్రీమతి శశి సుదాన్ ప్రభృతులు పాల్గొన్నారు.  

 

 

*****



(Release ID: 1925669) Visitor Counter : 121


Read this release in: English , Urdu , Hindi