ఆర్థిక మంత్రిత్వ శాఖ
మీడియా ప్రకటన
‘6.17% ప్రభుత్వ సెక్యూరిటీలు 2023’ తిరిగి చెల్లింపు
Posted On:
17 MAY 2023 8:40PM by PIB Hyderabad
‘6.17% ప్రభుత్వ సెక్యూరిటీలు 2023’ బకాయిలను జూన్ 12, 2023న చెల్లించడం జరుగుతుంది. పేర్కొన్న తేదీ తర్వాత ఆ సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపు ఉండదు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం 1881 ప్రకారం, ఒక రాష్ట్రంలో చెల్లింపు గడువు రోజున సెలవు వస్తే, ఆ రాష్ట్రంలోని చెల్లింపు కార్యాలయాల ద్వారా ముందు పని దినం నాడు ఆ రుణం/రుణాలకు సంబంధించిన చెల్లింపు జరుగుతుంది.
ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు 2007లోని ఉప నిబంధనలు 24(2), 24(3) ప్రకారం, సబ్సిడియరీ జనరల్ లెడ్జర్ లేదా కాన్‌స్టిట్యూట్ సబ్సిడియరీ జనరల్ లెడ్జర్ అకౌంట్ లేదా స్టాక్ సర్టిఫికేట్ రూపంలో గవర్నమెంట్ సెక్యూరిటీ హోల్డర్‌కు గడువు నాటికి చెల్లింపు జరుగుతుంది. పే ఆర్డర్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నిధులను స్వీకరించే సదుపాయం ఉన్న అతని/ఆమె బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం క్రెడిట్ అవుతుంది. ఇందుకోసం, ప్రాథమిక చందాదారు లేదా తదుపరి చందాదారు తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను ముందుగానే సమర్పించాలి.
గడువు తేదీ నాడు చెల్లింపుల కోసం బ్యాంక్ ఖాతా లేదా ఇతర ఆదేశానికి సంబంధించిన వివరాలు లేకుంటే, చందాదార్లు పబ్లిక్ డెట్ ఆఫీసులు, ఖజానా కార్యాలయాలు/ఉప ఖజానా కార్యాలయాలు, స్టేట్ బ్యాంక్ శాఖల వద్ద ఆ సెక్యూరిటీ పత్రాలను జమ చేయవచ్చు. చెల్లింపు గడువు తేదీకి 20 రోజుల ముందుగానే ఈ పని చేయాలి.
చెల్లింపులను స్వీకరించే ప్రక్రియ పూర్తి వివరాల కోసం పైన పేర్కొన్న చెల్లింపు కార్యాలయాల నుంచి పొందవచ్చు.
****
(Release ID: 1925115)