విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రికార్డ్ స్థాయి త్రైమాసిక, వార్షిక లాభాలు (రూ.3,001 కోట్లు, రూ.11,055 కోట్లు) సాధించిన ఆర్‌ఈసీ
Posted On:
17 MAY 2023 6:54PM by PIB Hyderabad
ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడం, ఒత్తిడిలో ఉన్న ఆస్తులను తగ్గించుకోవడం ద్వారా, ఆర్‌ఈసీ అత్యధిక త్రైమాసిక, వార్షిక లాభాన్ని వరుసగా ₹3,001 కోట్లు, ₹11,055 కోట్లుగా నమోదు చేసింది.
ఈరోజు ముంబైలో జరిగిన సమావేశంలో REC లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు, 31 మార్చి 2023తో ముగిసిన త్రైమాసికం, సంవత్సరానికి ఆడిట్ చేసిన స్వతంత్ర, ఏకీకృత ఆర్థిక ఫలితాలను ఆమోదించింది.
మార్చి 31, 2023తో ముగిసిన సంవత్సరానికి EPS (ఒక్కో షేరు ఆదాయం) 31 మార్చి 2022 నాటికి ఉన్న ₹38.02 నుంచి ₹41.86కు మెరుగుపడింది.
లాభాల పెరుగుదల కారణంగా, 31 మార్చి 2023 నాటికి నికర విలువ ₹57,680 కోట్లకు చేరింది, గత సంవత్సరం కంటే 13% పెరిగింది. లోన్ బుక్‌లో వృద్ధి పథం కొనసాగింది, 31 మార్చి 2022 నాటి ₹3.85 లక్షల కోట్ల నుంచి 13% పెరిగి ₹4.35 లక్షల కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదలకు సూచనగా, నికర కేటాయింపులు 1.01%కి తగ్గాయి, మార్చి 31, 2023 నాటికి ఎన్‌పీఏలపై కవరేజ్ నిష్పత్తి 70.64%గా ఉంది. కంపెనీ మూలధన సమృద్ధి నిష్పత్తి 31 మార్చి 2023 నాటికి సౌకర్యవంతంగా 25.78% వద్ద ఉంది, భవిష్యత్ వృద్ధికి పుష్కలమైన మద్దతు అవకాశాలకు ఇది సూచన.
కార్యాచరణ, ఆర్థిక ముఖ్యాంశాలు –12MFY23 వర్సెస్ 12MFY22 (స్వతంత్ర గణాంకాలు)
జారీ చేసిన రుణాలు: ₹96,846 కోట్లు వర్సెస్ ₹64,150 కోట్లు
రుణ ఆస్తులపై వడ్డీ ఆదాయం: ₹38,360 కోట్లు వర్సెస్ ₹37,811 కోట్లు, 1% వృద్ధి
నికర లాభం: ₹11,055 కోట్లు వర్సెస్ ₹10,046 కోట్లు, 10% వృద్ధి
ఆర్‌ఈసీ లిమిటెడ్ గురించి: ఆర్‌ఈసీ లిమిటెడ్ ఒక ఎన్‌బీఎఫ్‌సీ. విద్యుత్ రంగానికి రుణాలు ఇచ్చి, ఆ రంగం అభివృద్ధి కోసం పని చేస్తుంది. 1969లో ప్రారంభమైన REC లిమిటెడ్, విజయవంతంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విద్యుత్ రంగ విలువలోని అన్ని విభాగాలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. విద్యుద్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పునరుత్పాదక శక్తి సహా వివిధ రకాల ప్రాజెక్ట్‌ల కోసం రుణాలు ఇస్తుంది. భారతదేశ విద్యుత్ రంగ రుణాల్లో నాలుగో వంతు రుణాలు ఆర్‌ఈసీ ద్వారానే అందుతున్నాయి.
వెబ్‌సైట్: https://www.recindia.nic.in/
ఫేస్‌బుక్: https://www.facebook.com/reclindia
ట్విట్టర్: https://twitter.com/reclindia
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/reclindia/
లింక్డ్ఇన్: https://www.linkedin.com/company/reclindia/
***
(Release ID: 1925111)
Visitor Counter : 127