వ్యవసాయ మంత్రిత్వ శాఖ
శ్రీ అన్న వల్ల దేశంలోని సన్న కారు రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది– శ్రీ తోమర్
2014 నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు ––శ్రీ తోమర్
Posted On:
16 MAY 2023 5:33PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్లో నాలుగు రోజుల పాటు జరిగిన శ్రీ అన్న (చిరుధాన్యాల) ముగింపు ఉత్సవం ఈరోజు డెహ్రాడూన్లో,
కేంద్ర వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ముఖ్య ఆతిథ్యంలో జరిగింది.
శ్రీ అన్న వల్ల కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని శ్రీ తోమర్ అన్నారు. ప్రత్యేకించి చిన్న రైతులు దీనివల్ల ఎంతో ప్రయోజనం పొందుతారన్నారు. శ్రీ అన్నతో రైతుల రాబడి పెరగడంతో దేశ ఆర్ధిక వ్యవస్థకూడా పుంజకుంటుందని ఆయన అన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య ఆతిథ్యంలో ముగిసిన ఉత్తరాఖండ శ్రీ అన్న మహోత్సవ్.
శ్రీ అన్న వాడడం అంటే
ఆరోగ్యంగా ఉండడం అని అర్థమని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు. శ్రీ అన్నలో సంపూర్ణ పోషకాలు ఉన్నాయని, వీటి సాగుకు రైతుకు తక్కువ ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. వీటికి ఎరువులు అవసరం లేదని,
వీటిని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో కూడా పండించవచ్చని ఆయన అన్నారు.
సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచేందుకు, దేశంలో, ప్రపంచంలో ఆహారధాన్యాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
ఐక్యరాజ్యసమితి వేదికనుంచి దీనిని
ప్రతిపాదించారని, దీనికి 72 దేశాలు మద్దతు పలికాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశంలో
ఈ సంవత్సరం ఈవెంట్ ద్వారా శ్రీ అన్న ప్రాధాన్యత గురించి ప్రచారం చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీ అన్నతో అగ్రి స్టార్టప్లు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చిరుధానాయల ఉత్పాదకత, ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
అలాగే ప్రాసెసింగ్, ఎగుమతులు కూడా పెరగనున్నాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. శ్రీ అన్నవల్ల బహుముఖమైన ప్రయోజనాలు ఉన్నాయి.
దేశంలోని పేద ప్రజల జీవన ప్రమాణాలలో గణనీయమైన మార్పు తీసుకురావడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత చెప్పుకోదగినదని శ్రీ తోమర్ అన్నారు. పేదలకు వారి ఇళ్లలో టాయిలెట్లు నిర్మించి ఇవ్వడం,
విద్యుత్ కల్పించడం, ప్రధానమంత్రి ఆవాస్ ఇళ్ల నిర్మాణం, స్వయం సహాయక గ్రూపుల ద్వారా పేద మహిళల పురోగతి ఇవన్నీ ప్రధానమంత్రి దార్శనికతలో భాగమని ఆయన అన్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవాలి. అభివృద్ధి పుంజుకోవాలి. పరిశ్రమలు పుంజుకోవాలి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అలాగే మన దేశం శక్తిమంతమైనదిగా ఎదగడమే కాక ఇండియా సూపర్ పవర్
కావాలి. ప్రపంచం మొత్తం మీద ఇండియా ఉక్కును వినియోగించే స్థితి రావాలి. ఈ రకమైన బహుముఖీనమైన ఆలోచనలు ప్రధానమంత్రి గారివి.
ప్రధానమంత్రి గారి సమర్థత, దార్శనికత, కష్టించి పనిచేసే తత్వం వల్ల ఇండియా ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నదన్నారు. మనతో ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా , ఏ అంతర్జాతీయ వేదికపై చర్చ జరిగినా,
ఆర్ధిక వ్యవస్థ విషయానికి వచ్చినపుడు ప్రపంచ ఆర్ధిక వేత్తలు, భవిష్యత్తు ఇండియాదే నని అంటున్నారని చెప్పారు. ఇది మనకు గొప్ప అదృష్టం, గర్వకారణం అని ఆయన అన్నారు.
.భారతదేశ ప్రత్యేకతను, ప్రపంచ ప్రత్యేకతగా చేయడంలో ప్రధానమంత్రి ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోలేదు. యోగా భారతీయ సనాతన విధానం. ఇది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. స్వామీ రామ్దేవ్ దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం
ఇంటింటికి యోగా చేరేందుకు ప్రచారం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యోగా ముఖ్యాంశాలను ఐక్యరాజ్యసమితి వేదికమీద ప్రస్తావించి , యోగా దినోత్సవాన్ని జరుపుకోవలసిందిగా ప్రపంచానికి పిలుపునిచ్చారు.
ఆరకంగా భారతీయ యోగ విధానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.
ఆరోగ్యంగా ఉండడానికి యోగా అవసరం, కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారు వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు.
2014 సంవత్సరం లో వ్యవసాయ రంగం బడ్జెట్ 21 వేల కోట్ల రూపాయలు ఉండగా , ఇవాళ అది లక్షా 25 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఆ రకంగా వ్యవసాయరంగం బడ్జెట్ ఐదు రెట్లకు పైగా పెరిగింది.
సన్నకారు రైతులకు ఆదాయమద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం , కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాలలో పి.ఎం.కిసాన్ పథకం కింద 2.40 లక్షల కోట్ల రూపాయలను జమ చేసింది. అలాగే, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ,
అన్ని కోణాలలోనూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచుతూ వచ్చింద. రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు రక్షణ, ఆహారధాన్యాల ఉత్పాదకత పెంపు, సేంద్రియ, సంప్రదాయ
సాగుపై ప్రత్యేకదృష్టిపెట్టడం జరిగింది.
దేవభూమి ఉత్తరాఖండ్ వైవిధ్యంతో కూడిన వాతావరణం కలిగిఉంటుందని, వ్యవసాయానికి ఎంతో అనువైనదని శ్రీ తోమర్ అన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషితున్నదని, దీని ఫలితాలను రైతులకు అందేలా చేస్తున్నదని ఆయన అన్నారు.
వ్యవసాయం తో సహా అన్ని రంగాలలో ఉత్తరాఖండ్ ముందుకు సాగిపోతున్నదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అవసరమైనప్పుడల్లా ప్రధానమంత్రి ఉత్తరాఖండ్ కు అండగా ఉంటున్నారని ఆయన తెలిపారు.
ఉత్తరాఖండ్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ గణేశ్ జోషి, ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ ప్రేమ్ అగర్వాల్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆచార్య శ్రీ బాలకృష్ణ, సీనియర్ అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, స్టార్టప్ లకు చెందిన వారు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1924681)
Visitor Counter : 201