పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఈజిప్టు పర్యటనకు బయలుదేరి వెళ్ళిన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాప్
प्रविष्टि तिथि:
15 MAY 2023 6:21PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సిఒఎఎస్- సాయుధ దళాల అధిపతి) జనరల్ మనోజ్ పాండే మే 16-17 2023లో ఈజిప్టులో పర్యటించేందుకు బయలుదేరి వెళ్ళారు. తన పర్యటన సందర్భంగా, ఆ దేశపు సీనియర్ సైనిక నాయకత్వాన్ని కలుసుకుని, భారత్- ఈజిప్టు రక్షణ సంబంధాలను పెంచుకునేందుకు మరిన్ని మార్గాల గురించి సాయుధ దళాల అధిపతి చర్చించనున్నారు. ఆయన వివిధ ఈజిప్షియన్ సాయుధ దళాల స్థాపనలను సందర్శించి, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకుంటారు.
ఈజిప్టు సాయుధ దళాల కమాండర్-ఇన్- చీఫ్ తో, రక్షణ & సాయుధ దళాల ఉత్పత్తి, ఈజిప్టు సైనిక దళాల అధిపతితో ఆర్మీ చీఫ్‌తో సంభాషించనున్నారు. ఈజిప్టు సాయుధ దళాల కార్యకలాపాల ప్రాధికార సంస్థ అధిపతితో కూడా ఆయన విస్త్రత చర్చల్లో పాల్గొంటారు.
ఈజిప్టుతో పెరుగుతున్న సైనిక సంబంధాలు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ఫష్టమయ్యాయి. ఈ సందర్భంగా ఈజిప్టు సాయుధ దళాల బృందం తొలిసారి పరేడ్‌లో కనిపించగా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దా ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈ ఏడాది జనవరిలో భారత, ఈజిప్టు సైన్యాలు ఎక్స్ సైక్లోన్-1 ప్రత్యేక దళాలతో తొలి ఉమ్మడి విన్యాసాలు నిర్వహించారు.
ఇరు సైన్యాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపడేందుకు సిఒఎఎస్ పర్యటన దోహదం చేయడమే కాక, అనేక వ్యూహాత్మక అంశాలపై ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకార, సమన్వయాలకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 1924269)
आगंतुक पटल : 223