వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని ఐసిఎఆర్‌- నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ (ఎన్‌బిఎఫ్‌జిఆర్ - జాతీయ మ‌త్స్య జ‌న్యు వ‌న‌రుల బ్యూరో)ను సంద‌ర్శించిన మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌& పాడి ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని మ‌త్స్య విభాగం ఓఎస్‌డి డాక్ట‌ర్ అభిలాష్ లిఖి

Posted On: 08 MAY 2023 5:21PM by PIB Hyderabad

మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌& పాడి ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని మ‌త్స్య విభాగం ఓఎస్‌డి డాక్ట‌ర్ అభిలాష్ లిఖి ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని ఐసిఎఆర్‌- నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ (ఎన్‌బిఎఫ్‌జిఆర్ - జాతీయ మ‌త్స్య జ‌న్యు వ‌న‌రుల బ్యూరో)ను సంద‌ర్శించి, సంస్థ‌లోని మ‌త్స్య రైతుల‌తో ముచ్చ‌టించారు. దేశంలోని విభిన్న జ‌ల జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన చేప‌ల జ‌న్యు వ‌న‌ర‌ల సేక‌ర‌ణ‌, క్యారెక్ట‌రైజేష‌న్ (ల‌క్ష‌ణాలు), జాబితా, లిపిబ‌ద్ధీక‌ర‌ణ‌, వాటి ప‌రిర‌క్ష‌ణ వ్యూహాల‌న్న‌వి ఐసిఎఆర్‌- నేష‌న‌ల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్‌బిఎఫ్‌జిఆర్‌) ప్ర‌ధాన కార్య‌క‌లాపాలు. అంతేకాకుండా, సంస్థ ప‌రిశోధ‌న‌ను చేప‌ట్టి, అసాధర‌ణ‌మైన, విదేశీ జాతుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి, స‌రిహ‌ద్దు ఆవ‌లి వ్యాధుల‌ను నివారించేందుకు క్వారంటీన్‌కు అవ‌స‌ర‌మైన విధాన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, ప‌రిశోధ‌న‌ను సంస్థ చేప‌డుతుంది. 
దీనితో పాటుగా, సంస్థ  నీటి జంతువుల వ్యాధుల కోసంనేష‌న‌ల్ స‌ర్వియ‌లెన్స్ ప్రోగ్రాం (జాతీయ ప‌ర్య‌వేక్ష‌ణ కార్య‌క్ర‌మం)ను (ఎన్ఎస్‌పిఎఎడి)ని దేశ‌వ్యాప్తంగా గ‌ల 31 ఆరోగ్య ప్ర‌యోగ‌శాల‌ల ప్ర‌మేయం ద్వారా 21 రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తుంది. 
సంస్థ ప‌రిశోధ‌న & అభివృద్ధి (ఆర్‌&డి) కార్య‌క‌లాపాల గురించి ఐసిఎఆర్‌- ఎన్‌బిఎఫ్‌జిఆర్ డైరెక్ట‌ర్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. ఈ స‌మావేశంలో ఐసిఎఆర్ శాస్త్ర‌వేత్త‌లు, ఫ్యాక‌ల్టీ స‌భ్యులు కూడా పాల్గొన్నారు. అనంత‌రం, ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మ‌త్స్య విభాగం అధికారులు రాష్ట్రంలో లోత‌ట్టు మ‌త్స్య సంప‌ద ప‌రిధి గురించి వివ‌ర‌ణాత్మ‌క ప్రెజెంటేష‌న్ ను ఇచ్చారు. దీనితో పాటుగా బార‌బంకీలోని దేవా బ్లాక్‌లోని మిశ్రిపూర్ గ్రామంలోని మ‌త్స్య పెంప‌క కేంద్రాన్ని కూడా డాక్ట‌ర్ లిఖి సంద‌ర్శించి మ‌త్స్య రైతులతో ముచ్చ‌టించారు. ఐసిఎఆర్‌-ఎన్‌బిఎఫ్‌జిఆర్, రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లిసి వివిధ కార్య‌క్ర‌మాలు, కార్య‌క‌లాపాలు, ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న కింద రైతుల‌కు అందుబాటులో ఉండే స‌బ్సిడీల గురంచి మ‌త్స్య రైతులలో అవ‌గాహ‌న‌ను పెంపొందించేందుకు విస్త్ర‌త‌మైన కృషి చేయాల‌ని డాక్ట‌ర్ అభిలాష్ లేఖీ ఉద్ఘాటించారు. 


***


(Release ID: 1922712) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi