బొగ్గు మంత్రిత్వ శాఖ
2027 నాటికి 67 మొదటి మైలు అనుసంధాన ప్రాజెక్టులను పూర్తి చేయనున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు
పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన బొగ్గు రవాణాపై దృష్టి
Posted On:
05 MAY 2023 2:27PM by PIB Hyderabad
బొగ్గు ఉత్పత్తి సంస్థల మొదటి మైలు అనుసంధానత (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టుల పురోగతిపై, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షత సమీక్ష జరిగింది. సంవత్సరానికి 885 ఎంటీ బొగ్గును లోడ్ చేయగల సామర్థ్యంతో 67 ఎఫ్‌ఎంసీ ప్రాజెక్టులను (59 – సీఐఎల్, 5- ఎస్‌సీసీఎల్ & 3 – ఎల్‌సీఐఎల్) బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తవుతాయి.
గనుల నుంచి రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాను నివారించడానికి, ఎఫ్‌ఎంసీ ప్రాజెక్టు కింద యాంత్రిక బొగ్గు రవాణా & లోడింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళిక రూపొందించింది. క్రషింగ్, బొగ్గు పరిమాణం, కంప్యూటర్ సహాయంతో శీఘ్ర లోడింగ్ వంటివి బొగ్గు నిర్వహణ ఫ్లాంట్లు (సీహెచ్‌పీలు), శీఘ్ర లోడింగ్ వ్యవస్థతో ఉన్న ప్రయోజనాలు.
మానవ జోక్యం తగ్గించడం, ఖచ్చితమైన ముందస్తు-బరువు పరిమాణం, వేగంగా లోడ్ చేయడం, మెరుగైన బొగ్గు నాణ్యత ఎఫ్‌ఎంసీ ప్రాజెక్టుల ద్వారా ఒనగూరే ప్రయోజనాలు. లోడింగ్ సమయం తగ్గితే రేక్‌లు, వ్యాగన్‌లు మరింత త్వరగా అందుబాటులోకి వస్తాయి. రోడ్డు మార్గంలో తక్కువ ట్రాఫిక్ వల్ల కాలుష్యం, డీజిల్ వినియోగం తగ్గుతుంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ ఎఫ్‌వై25లో 1.3 బిలియన్ టన్నుల బొగ్గును, ఎఫ్‌వై30లో 1.5 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ఇంధన భద్రతను మెరుగుపరుస్తుంది, దిగుమతి చేసుకునే బొగ్గుకు బదులు దేశీయంగా ఉత్పత్తి చేసిన బొగ్గును భర్తీ చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుంది. పర్యావరణ అనుకూలమైన, త్వరితగతి, తక్కువ ఖర్చుతో కూడిన బొగ్గు రవాణాను అభివృద్ధి చేయడం లక్ష్యం.
***
(Release ID: 1922264)
Visitor Counter : 170