సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఈశాన్య ప్రాంత వ్యాపార విస్తరణ కోసం బిజ్ఆంప్ – శ్రీ ఫండ్ , నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన మొదటి చేరువ కార్యక్రమం

Posted On: 04 MAY 2023 4:45PM by PIB Hyderabad

 ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ ఎన్ ఎస్ ఐ సి వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ (NVCFL)తో కలిసి తన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా (SRI) ఫండ్ కింద 4 మే 2023న దిమాపూర్ నాగాలాండ్‌లో నిర్వహించిన మొదటి చేరువ కార్యక్రమానికి ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ బీ. బీ స్వైన్ అధ్యక్షత వహించారు.  బిజ్ఆంప్ - ఈశాన్య రాష్ట్రాల నుండి ఎం ఎస్ ఎం ఈలకు సాధికారత కల్పించడం మరియు శ్రీ ఫండ్  ప్రయోజనాలను ఉపయోగించడం ద్వారా వారి వ్యాపారాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంతంలోని ఎం ఎస్ ఎం ఈలు, డాటర్ ఫండ్స్ మరియు ఇతర ప్రముఖ భాగస్వాములు పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం ఎస్ బీ ఐ క్యాపిటల్ వెంచర్స్, ఎన్ ఎఫ్ డీ ఎఫ్ ఐ  మొదలైన వారు అవగాహన సదస్సు లు నిర్వహించారు. ఈ కార్యక్రమం లబ్ధిదారులైన ఎం ఎస్ ఎం ఈలకు వారి సమస్యలను వెల్లడించడానికి  మరియు ఈవెంట్‌కు హాజరైన ఔత్సాహిక ఎం ఎస్ ఎం ఈలను ప్రేరేపించడానికి ఒక వేదికను అందించింది. ఈ కార్యక్రమంలో వివిధ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పరిశ్రమల కార్యదర్శుల సమక్షంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సమిష్టి ప్రయత్నాలను ప్రదర్శించారు, వారు ఎం ఎస్ ఎం ఈల కోసం రూపొందించిన వివిధ విధానాల గురించి వారి వృద్ధికి సహాయపడటానికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా శ్రీ బిబి స్వైన్ , సెక్రటరీ ఎం ఓ ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ, మాట్లాడుతూ ఎన్ వీ సి ఎఫ్ ఎల్  అధికారులందరినీ అభినందించారు. “ ఈశాన్య ప్రాంతంలో ఎం ఎస్ ఎం ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రయత్నాలు వృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తాయి. స్టార్టప్‌లను మరియు ఇప్పటికే ఉన్న సంస్థలను ప్రోత్సహించండి అలాగే రాష్ట్రంలోని ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది” అని కూడా ఆయన అన్నారు. హాజరైన వారు శ్రీ ఫండ్ ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందాలని మరియు వీలైనంత ఎక్కువ డాటర్ ఫండ్స్తో పరస్పర అనుసంధానం చేయాలని కోరారు.

 

భారత ప్రభుత్వం, రూ. 10,006 కోట్ల వ్యయంతో శ్రీ ఫండ్‌ను ప్రారంభించింది, డాటర్ ఫండ్స్ ద్వారా ఎం ఎస్ ఎం ఈలకు మూలధన ఫైనాన్సింగ్ వైపు దృష్టి సారించింది. ఎన్ వీ సి ఎఫ్ ఎల్  ద్వారా నిర్వహించబడుతున్న  శ్రీ  ఫండ్, మూలధన పెట్టుబడి/క్వాసీ-ఈక్విటీ/ఈక్విటీ లాంటి నిర్మాణాత్మక సాధనాల ద్వారా ఎం ఎస్ ఎం ఈలకు వృద్ధి మూలధనాన్ని అందించే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి. 31 మార్చి 2023 నాటికి, ఫండ్ మూలధన నిబద్ధత 42 ఎంపానెల్డ్ డాటర్ ఫండ్‌లకు రూ.5,120 కోట్లు అందించింది.

 

బిజ్ఆంప్, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మొదటి మొదటి చేరువ కార్యక్రమం. ఎన్ వీ సి ఎఫ్ ఎల్  యొక్క  శ్రీ  ఫండ్ ద్వారా మూలధన ప్రయోజనాలను పెంచడంపై దృష్టి సారించింది. ఇది భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ఎం ఎస్ ఎం ఈలను చేరుకోవడానికి  శ్రీ  ఫండ్ యొక్క ఎంప్యానెల్ చేయబడిన డాటర్ ఫండ్‌ల కోసం ఒక వేదికను అందించడానికి ఉపయోగపడింది.

 

మన ఆర్థిక వ్యవస్థపై ఎం ఎస్ ఎం ఈల ప్రభావం దృష్ట్యా, యువతలో వ్యవస్థాపకతను, వాణిజ్య స్పృహ ను ప్రోత్సహించడానికి మరియు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు సమగ్ర పాత్ర పోషించే అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయడం అత్యవసరం.

దేశం యొక్క ఆర్థిక శ్రేయస్సు కోసం ఎం ఎస్ ఎం ఈ రంగాన్ని పెంపొందించడం చాలా ముఖ్యం. ఎం ఓ ఎం ఎస్ ఎం ఈ సుస్థిరమైన వృద్ధి కోసం ఎం ఎస్ ఎం ఈలను శక్తివంతం చేయడానికి మరియు ప్రపంచ విలువ గొలుసు లో ఎం ఎస్ ఎం ఈలను భాగస్వాములను చేస్తూ అది వారికి అనుకూలంగా మారడానికి స్థిరంగా పనిచేస్తోంది. ఇది ఈశాన్య ప్రాంతం లోని ఎం ఎస్ ఎం ఈలు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (డాటర్ ఫండ్స్)తో చేరువ అవ్వడానికి మరియు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెట్టుబడి ని సమకూర్చడం  ద్వారా ప్రయోజనాలను పొందేందుకు సహాయపడుతుంది. ఛైర్‌పర్సన్, ఎన్ వీ సి ఎఫ్ ఎల్  & ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు సెక్రటరీ - నార్త్ ఈస్ట్ కౌన్సిల్, సీ ఎం డీ,నార్త్ ఈస్టర్న్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్), సీ జీ ఎం - ఎస్ బీ ఐ (ఈశాన్య ప్రాంతం), ఎం డీ & సీ ఈ ఓ , ఎస్ బీ ఐ క్యాపిటల్ ఫండ్, డైరెక్టర్ & సీ ఈ ఓ  ఎన్ వీ సి ఎఫ్ ఎల్ తో సహా పలువురు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో   పాల్గొన్నారు.

***



(Release ID: 1922216) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi , Tamil