కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నిధుల దుర్వినియోగం మరియు పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా పోస్టల్ యూనియన్ గుర్తింపు రద్దు

Posted On: 03 MAY 2023 12:19PM by PIB Hyderabad


సేవా సంఘాలు ఎల్లప్పుడూ తపాలా శాఖలో అంతర్భాగంగా ఉన్నాయి. సభ్యుల ఉమ్మడి సేవా ప్రయోజనాలను పెంపొందించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సర్వీస్ అసోసియేషన్ గుర్తింపు) రూల్స్ - సిసిఎస్ (ఆర్‌ఎస్‌ఏ) రూల్స్, 1993 సర్వీస్ అసోసియేషన్లకు గుర్తింపు అందిస్తాయి. దీనిప్రకారం సిసిఎస్(ఆర్‌ఎస్‌ఏ) రూల్స్ 1993లోని అన్ని నిబంధనలను పాటించాల్సిన బాధ్యత  గుర్తింపు పొందిన అన్ని సంఘాలపై ఉంది.

ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ ‘సి’ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌పిఈ) అనే రెండు సంఘాలు ఈ నిబంధనలను ఉల్లంఘించాయని ఫిర్యాదు అందింది. సంఘాల సభ్యుల నుంచి సేకరించిన నిధులను సక్రమంగా వినియోగించలేదని ఆరోపణలు వచ్చాయి.

విధి విధానాలను అనుసరించి ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టారు. తమ వాదనను వినిపించేందుకు యూనియన్‌కు తగిన అవకాశం ఇవ్వబడింది.

సిసిఎస్ (ఆర్‌ఎస్‌ఏ) నియమాలు, 1993లోని నిబంధనలను ఉల్లంఘించిడంతో పాటు నిధుల వినియోగంలో యూనియన్‌ వివిధ అవకతవకలకు పాల్పడినట్టు విచారణ నివేదిక గుర్తించింది. ఈ నిబంధనల ప్రకారం బహుళ నిబంధనలను ఉల్లంఘించడం వలన కింది అంశాలకు సంబంధించి సేవా సంఘాల లక్ష్యాన్ని పాటించకపోవడమే:

  1.  సభ్యుల ఉమ్మడి సేవా ఆసక్తిని ప్రచారం చేయడం [రూల్ 5(బి)].
  2. సేవా సంఘం [రూల్ 5 (హెచ్)]  ఆబ్జెక్ట్ పెంపుదల కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నిధులను ఉపయోగించడం.
  3. రాజకీయ నిధులు లేదా ఏ పార్టీ లేదా దాని సభ్యుని రాజకీయ అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు [రూల్ 6 (సి)]


ఈ చర్యలు ప్రభుత్వోద్యోగిచే నిర్వహించబడితే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు, 1964 [రూల్ 6 (కె)] నిబంధనలకు కూడా విరుద్ధంగా ఉంటుంది.

అందువల్ల విధి విధానాలను అనుసరించి, తపాలా శాఖ ఏప్రిల్ 25, 2023 నుండి అమల్లోకి వచ్చేలా ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ ‘సి’ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ (ఎన్‌ఎఫ్‌పిఈ) గుర్తింపును ఉపసంహరించుకుంది.

తపాలా శాఖ ప్రైవేటీకరణ/కార్పొరేటీకరణకు సంబంధించి కొన్ని ఉద్యోగుల సంఘాలు అవాస్తవాలు మరియు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నాయి.

పోస్టాఫీసుల కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని స్పష్టంగా తెలియజేయబడింది.

గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇంటింటికి డిజిటల్ బ్యాంకింగ్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను అందించడానికి తపాలా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంది. అందువల్ల పోస్ట్ ఆఫీస్ నెట్‌వర్క్ అనేక ఏళ్లుగా విస్తరించబడింది మరియు బలోపేతం చేయబడింది.


 

***



(Release ID: 1921613) Visitor Counter : 142