శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22 ఫలితాలు విడుదల భారతీయ తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి

Posted On: 28 APR 2023 3:17PM by PIB Hyderabad

 “నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22:  సారాంశం”ని డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విధాన రూపకర్తల కోసం ఏప్రిల్ 27, 2023 న విడుదల చేసారు.

 

"భారత ప్రభుత్వం భారత తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి మరియు జీ డీ పీ లో తన వాటాను పెంచడానికి ప్రాధాన్యతనిచ్చే ఉద్దేశ్యంతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22 డీ ఎస్ టీ చేపట్టింది" అని విధాన నిర్ణేతల కోసం సారాంశ నివేదికను ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సర్వే ఫలితాలను సంగ్రహించారు.

 

"సర్వే ఫలితాలు సంస్థల ద్వారా ఆవిష్కరణలను ప్రారంభించడంలో చేయవలసిన కార్యకలాపాలు మరియు ఎదురయ్యే అడ్డంకులగురించి  విస్తృత అంతర్దృష్టులను అందిస్తాయి అలాగే కొత్త ఉత్పత్తులు, సేవలు మరియు వ్యాపార ప్రక్రియలను ఉత్పత్తి చేసే ఉత్పాదక సంస్థల సామర్థ్యానికి సంబంధించి రాష్ట్రాలు మరియు రంగాలు ఎలా పనిచేశాయో నిశితంగా అంచనా వేసింది. సర్వే ఫలితాల వివరణాత్మక విశ్లేషణ భారతదేశంలోని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థపై విలువైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. అందువల్ల, ఈ నివేదిక విధాన నిర్ణేతలు, పరిశోధకులు మరియు ఆవిష్కరణ మరియు ఆర్థికాభివృద్ధి రంగంలో అభ్యాసకులకు గొప్ప ఆసక్తిని కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు.

 

ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు ఆటోమొబైల్స్‌తో సహా వివిధ రంగాలలో తయారీని పెంచడానికి ఈ అభ్యాసాలు మేక్-ఇన్-ఇండియా ప్రోగ్రామ్ లక్ష్యానికి, ప్రత్యేకంగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) (PLI) పథకాలకు గణనీయమైన విలువను జోడించగలవని ఇవి ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తున్నాయనీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 

 

ఆవిష్కర్తలు సరసమైన ధరకు మంచి ఆవిష్కరణలతో ముందుకు రావాలని, మరియు ప్రక్రియలలో కనీస మార్పులు అవసరమని, ఫలితంగా ఉత్పత్తులు చౌకగా, మెరుగైనవి మరియు పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే, ఆవిష్కరణలను గ్రహించే సామర్ధ్యంకు తగినంత కర్మాగారాలు ఉండాలి.

 

" ఎన్ ఎం ఐ ఎస్ అధ్యయనం, అన్వేషణలు, ఆవిష్కరణలు తక్షణ శ్రద్ధ అవసరమయ్యే తయారీ విలువ-గొలుసులలోని కొన్ని సామర్థ్యాలు, అవకాశాలు మరియు సవాళ్లకు బేస్‌లైన్‌లను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయి" అని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు.

 

నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22 అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) మరియు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO) భారతదేశంలోని తయారీ సంస్థల యొక్క ఆవిష్కరణ పనితీరును అంచనా వేయడానికి చేసిన సంయుక్త అధ్యయనం. ఎన్ ఎమ్ ఐ ఎస్ S 2021-22 అధ్యయనం రెండు కోణాల సర్వేగా నిర్వహించబడింది, ఇది ఆవిష్కరణ ప్రక్రియలు, ఫలితాలు మరియు తయారీ సంస్థలలోని అడ్డంకులను పరిశీలించింది మరియు ఈ సంస్థలలో ఆవిష్కరణ ఫలితాలను ప్రభావితం చేసే ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను కూడా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం 2011లో జరిగిన డి ఎస్ టీ యొక్క మొదటి నేషనల్ ఇన్నోవేషన్ సర్వే యొక్క ఫాలో-అప్. డి ఎస్ టీ- యూ ఎన్ ఐ డీ ఓ యొక్క సహకార అధ్యయనం సంస్థ స్థాయిలో తయారీ ఆవిష్కరణ ఫలితాలు, ప్రక్రియలు మరియు అడ్డంకులను అంచనా వేయడానికి 360-డిగ్రీల విధానాన్ని అనుమతించింది. సహకార ప్రక్రియలు మరియు పరస్పర చర్యలను గుర్తిస్తుంది మరియు తద్వారా రాష్ట్రాలు, రంగాలు మరియు సంస్థ పరిమాణాల పనితీరును అంచనా వేసింది. డాక్టర్ అఖిలేష్ గుప్తా, సెక్రటరీ, సీనియర్ అడ్వైజర్, మరియు హెడ్ పీ సి పీ ఎం, డీ ఎస్ టీ, సర్వే యొక్క రూపురేఖలను అందించారు. సర్వే భారతదేశంలోని తయారీ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత ఆవిష్కరణ కార్యకలాపాల గురించి అలాగే సంస్థాగత దృఢత్వాన్ని పెంచే మార్గాలపై అనుభావిక అవగాహనను అందించిందని చెప్పారు. ఆవిష్కరణల కోసం మార్కెట్ డిమాండ్‌ను సులభతరం చేయడానికి. "సాంకేతిక అభ్యాసం, ఆవిష్కరణ మరియు అభివృద్ధి, మరియు భారతీయ పరిశ్రమల అప్-గ్రేడేషన్‌కు అడ్డంకులు మరియు సవాళ్లకు సంబంధించిన సాక్ష్యాలు ఆవిష్కరణ ఫలితాలు మరియు ప్రయోజనాలను బలోపేతం చేయడానికి విధానాలు, కార్యక్రమాలు మరియు భాగస్వామ్యాలను రూపొందించడానికి ఉపయోగించబడతాయి" అని ఆయన చెప్పారు. “తయారీ రంగంలో ఆవిష్కరణలు ఇంకా సాధారణం కానప్పటికీ సంస్థలకు లాభదాయకంగా ఉన్నాయని ఎన్ ఎమ్ ఐ ఎస్ సర్వే చూపిస్తుంది. ఉత్పత్తిని విస్తరింపజేయడంతో పాటు తయారీ ఆవిష్కరణలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది” అని యూ ఎన్ ఐ డి ఓ లోని భారతదేశంలోని ప్రాంతీయ కార్యాలయం ప్రతినిధి & హెడ్ డాక్టర్ రెనే వాన్ బెర్కెల్ అన్నారు. ఎన్ ఎమ్ ఐ ఎస్ 2021-22 సర్వేలో రెండు నిర్దిష్ట భాగాలు ఉన్నాయి: సంస్థ-స్థాయి సర్వే మరియు సెక్టోరియల్ సిస్టమ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ (SSI) సర్వే. ఇన్నోవేషన్ ప్రక్రియ, ఫైనాన్స్ యాక్సెస్, రిసోర్స్‌లు మరియు ఇన్నోవేషన్‌కు సంబంధించిన సమాచారంతో పాటు సంస్థలో ఇన్నోవేషన్ కార్యకలాపాలపై ప్రభావం చూపే కారకాలను రికార్డ్ చేయడంతో పాటుగా సంస్థలు తీసుకున్న ఆవిష్కరణల రకాలు మరియు వినూత్న చర్యలకు సంబంధించిన డేటాను సంస్థ-స్థాయి సర్వే సంగ్రహించింది. ప్రతి నాలుగింటిలో ఒక సంస్థ పరిశీలనా కాలంలో ఒక ఆవిష్కరణను విజయవంతంగా అమలు చేసినట్లు కనుగొనబడింది అలాగే ఈ సంస్థలలో 80% పైగా   ఉత్పత్తిని మరియు మార్కెట్లను విస్తరించడంలో మరియు ఖర్చులను తగ్గించడంలో గణనీయంగా ప్రయోజనం పొందాయి. సెక్టోరియల్ సిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్ సర్వే తయారీ ఇన్నోవేషన్ సిస్టమ్ మరియు సంస్థల్లో ఆవిష్కరణలను సాధించడంలో దాని ఎనేబుల్ పాత్రను మ్యాప్ చేసింది. ఎస్  ఎస్ ఐ అధ్యయనం ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ లబ్దిదారుల మధ్య పరస్పర చర్యలను లెక్కిస్తుంది, ఆవిష్కరణకు సాపేక్ష అడ్డంకులు, అలాగే ప్రస్తుత విధాన సాధనాలు భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన ఎంపిక చేసిన ఐదు కీలక ఉత్పాదక రంగాలైన వస్త్రాలు; ఆహార & పానీయా; ఆటోమోటివ్; ఫార్మా; మరియు ఐ సి టీ ఎల్ మధ్య ఐక్యత లేదా వైవిధ్యం వాటిపై ప్రభావశీలత గురించితెలుపుతుంది.

 

మొత్తం 8,087 సంస్థలు సంస్థ-స్థాయి సర్వేలో పాల్గొన్నాయి, అయితే 5,488 సంస్థలు మరియు నాన్-సంస్థలు ఎస్ ఎస్ ఐ సర్వేలో పాల్గొన్నాయి. సంస్థ-స్థాయి సర్వే నుండి కనుగొన్న విషయాలు 'భారత తయారీలో సంస్థ-స్థాయి ఆవిష్కరణల అంచనా'లో సంగ్రహించబడ్డాయి. విడిగా, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్, టెక్స్‌టైల్, ఫుడ్ & బెవరేజెస్ మరియు ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ICT) అనే ఐదు ఉత్పాదక రంగాలలోని ఆవిష్కరణల రంగ వ్యవస్థల అధ్యయనం నుండి ఐదు నివేదికలు అభివృద్ధి చేయబడ్డాయి.

 

 ఎన్ ఎం ఐ ఎస్ నివేదికలు

 

http://www.nstmis-dst.org/NMIS/nmis-reports.html

***


(Release ID: 1920922) Visitor Counter : 244


Read this release in: English , Urdu , Hindi , Tamil