భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆటోమోటివ్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ఎస్ఓపిలను విడుదల చేసిన కేంద్రం
ఆత్మనిర్భర్ భారత్‌కు గొప్ప ప్రేరణ: డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే
ఎస్ఓపిలు స్థానిక తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం
తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా రూపుదిద్దుకున్నాయి: డా. పాండే
प्रविष्टि तिथि:
27 APR 2023 6:10PM by PIB Hyderabad
టెస్టింగ్ ఏజెన్సీలకు పిఎల్ఐ ఆటో పథకం కింద ఎస్ఓపిలను విడుదల చేస్తున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు ఇక్కడ ప్రకటించింది. దీనితో, పథకం కింద ఉన్న దరఖాస్తుదారులు ఇప్పుడు ఏఏటి ఉత్పత్తుల (ఓఈఎంలు, విడి భాగాలు రెండూ) పరీక్ష, ధృవీకరణ కోసం తమ దరఖాస్తులను సమర్పించవచ్చు, ఇది పిఎల్ఐ ఆటో పథకం కింద ప్రోత్సాహకాల కోసం అర్హత పొందడంలో వారికి సహాయపడుతుంది.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా మంత్రిత్వ శాఖ అందిపుచ్చుకుంటోందని అన్నారు. ఈ ఎస్ఓపిలు దానిని సాధించడంలో సహాయపడటమే కాకుండా తయారీ వ్యవస్థకు కూడా ఉపకరిస్తుందని అన్నారు. దీనితో, దేశీయ తయారీ రంగాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, తద్వారా భారతీయులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించడం మంత్రిత్వ శాఖ లక్ష్యం. దేశంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ చొరవ ఆ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. దేశం మొత్తం ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ పథకం గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుంది. భారతదేశం ఆటోమొబైల్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మారడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) భారతదేశంలో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమ (పిఎల్ఐ -ఆటో స్కీమ్ ) కోసం ఉత్పాద ఆధారిత ప్రోత్సాహక (పిఎల్ఐ) స్కీమ్‌ను 2021, సెప్టెంబర్ 23న 25,938 కోట్ల బడ్జెట్‌తో నోటిఫై చేసింది. పిఎల్ఐ -ఆటో పథకం ఆధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటి) ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచడానికి, ఆటోమోటివ్ తయారీ విలువ గొలుసులో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తుంది. ఈ పథకంలో రెండు భాగాలు ఉన్నాయి: ఛాంపియన్ ఓఈఎం, ఇది ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్-ఆధారిత వాహనాలను తయారు చేస్తుంది. రెండోది కాంపోనెంట్ ఛాంపియన్‌లు, ఇవి అధిక-విలువ, హై-టెక్ భాగాలను తయారు చేస్తాయి.
పిఎల్ఐ పథకం లక్ష్యాలు:
ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం ముఖ్య లక్ష్యాలు అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచడానికి, ఆటోమోటివ్ తయారీ విలువ గొలుసులో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం.
ఈ పథకం దేశంలో ఉపాధిని సృష్టించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
ఆటోమొబైల్ పరిశ్రమ విలువ గొలుసును అధిక-విలువ-జోడించిన ఉత్పత్తులలోకి తరలించడానికి సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఎంహెచ్ఐ, 2021, నవంబర్ 9 న 19 ఏఏటి వాహనాలు, 103 ఏఏటి కాంపోనెంట్ లు ఈ స్కీమ్ కింద కవర్ అవుతాయి. ఈ కాంపోనెంట్‌లు అధునాతన టెక్నాలజీ ఆటోమోటివ్ కాంపోనెంట్‌లు, భారతదేశంలో సరఫరా గొలుసు లేనివి లేదా రెండూ. తద్వారా, ఈ పథకంతో, గ్లోబల్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సప్లై చెయిన్‌లలో భారతదేశం తన వాటాను పెంచుకోగలుగుతుంది.
దేశీయ విలువ జోడింపు (డివిఏ):
పథకం మార్గదర్శకాల ప్రకారం, పథకం కింద ప్రోత్సాహకాలను క్లెయిమ్ చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 50% డివిఏని సాధించాలి. ఆటో కంపెనీలు, కాంపోనెంట్ తయారీదారులు తమ సరఫరా గొలుసు అంతటా డివిఏని లెక్కించి, సమర్పించాలి. ఈ వివరాలను టెస్టింగ్ ఏజెన్సీలకు అందించాలి. మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ప్రోత్సహించడానికి, అధునాతన ఆటోమోటివ్ ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచడానికి ఈ చర్యలు చేపట్టారు.
ఎస్ఓపి తయారీకి కమిటీ:
డివిఏ లేదా దేశీయ విలువను గణించడానికి, ఎస్ఓపి చేయడానికి, పూణే ఏఆర్ఏఐ డైరెక్టర్ నేతృత్వంలోని ఐక్యాట్ మనేసర్, నట్రాక్స్, పూణే, జిఏఆర్సి చెన్నై, ఐఎఫ్సిఐ (పిఎల్ఐ ఆటో స్కీమ్ కోసం పిఎంఏ) టెస్టింగ్ ఏజెన్సీలతో కూడిన సభ్యులతో ఏర్పాటు చేశారు. దీని ప్రకారం, వివిధ వాటాదారుల మధ్య పరిజ్ఞాన్నాన్ని, అభిప్రాయాలను పంచుకోవడంతో, కమిటీ వాటాదారుల నుండి అందిన అన్ని సూచనలపై చర్చించిన తర్వాత ఎస్ఓపి ముసాయిదాను రూపొందించింది. పిఎల్ఐ పథకం కోసం మొత్తం 85 మంది దరఖాస్తుదారులతో సంప్రదింపులు జరిగాయి. వీటిలో 18 ఓఈఎంలు, 67 ఆటో విడిభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయి.
సంప్రదింపుల ప్రక్రియ:
వాటాదారుల సంప్రదింపులు, నిరంతర చర్చల ద్వారా పరిశ్రమ వివిధ వినతి పత్రాలను, సూచనలను పంచుకుంది. ఇంకా, ముసాయిదా ఎస్ఓపి, వారి ఇన్‌పుట్, ఫీడ్‌బ్యాక్ కోసం ఎప్పటికప్పుడు దరఖాస్తుదారుల కంపెనీలతో సహా వాటాదారులతో పంచుకోవడం జరిగింది. ఇంకా, కమిటీ ఎంపిక చేసిన ప్రాతిపదికన కొంతమంది ఓఈఎం, కాంపోనెంట్ దరఖాస్తుదారులతో ట్రయల్ డివిఏ గణన కసరత్తు కూడా నిర్వహించింది.
ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు పొందిన అనుభవాన్ని అమలు చేయడం ద్వారా పిఎల్ఐ పథకాలను అమలు చేయడం నుండి క్రాస్-సెక్టోరల్ లెర్నింగ్స్ అవలంబించడం జరిగింది. వీటిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డిఓపి), ఎంఎన్ఆర్ఈ, ఎంఈఐటివై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఉక్కు మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.
3 రౌండ్ల వివరణాత్మక వాటాదారుల సంప్రదింపుల తర్వాత, కమిటీ డెస్క్ మదింపు, దరఖాస్తుదారులకు, వారి సరఫరాదారుల తయారీ సౌకర్యాలకు క్షేత్ర సందర్శనలు, దరఖాస్తుదారుల సాంకేతిక-వాణిజ్య ఆడిట్, కాలానుగుణ నిఘా అంచనాతో కూడిన ముసాయిదా ఎస్ఓపి తో ముందుకు వచ్చింది. ఇది వాటాదారులందరికీ అధిక స్థాయి హామీని అందిస్తుంది. ఎస్ఓపి దానికి సంబంధించిన విధానాలను తగినంత వివరంగా నిర్దేశిస్తుంది.
ఎస్ఓపి ఇప్పుడు టెస్టింగ్ ఏజెన్సీల ద్వారా విడుదల అయింది. ఇది ఏఏటి ఉత్పత్తుల (ఓఈఎంలు, విడి పరికరాలు) ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పిఎల్ ఐ పథకం కింద దరఖాస్తుదారులను అనుమతిస్తుంది.
ఎస్ఓపి ఇప్పుడు టెస్టింగ్ ఏజెన్సీల ద్వారా విడుదల అయింది. ఇది ఏఏటి ఉత్పత్తుల (ఓఈఎంలు, భాగాలు రెండూ) ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పిఎల్ఐ పథకం కింద దరఖాస్తుదారులను అనుమతిస్తుంది.
సులభతరం వాణిజ్యం:
సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం, పిఎల్ఐ పథకం కింద దరఖాస్తును ఫైల్ చేయడానికి అవసరమైన కనీస పత్రాలతో సరళమైన విధానాలను రూపొందించడానికి జాగ్రత్తలు తీసుకుంది.
ఓఈఎంకి ప్రత్యక్ష సరఫరాదారుని "టైర్ 1 సప్లయర్ అంటారు. టైర్ 1 సరఫరాదారులను టైర్ 2 సప్లయర్‌లు అంటారు. టైర్ 3 స్థాయి వరకు దిగుమతులకు సంబంధించిన సమాచారం దరఖాస్తుదారులచే ప్రామాణీకరించబడాలి. అయితే, దరఖాస్తును ఫైల్ చేసే సమయంలో టైర్ 3 వరకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు సమర్పించిన డిక్లరేషన్‌లు పథకం కింద చాలా అవసరాలకు సరిపోతాయి.
ఇబ్బందులను తొలగించే అధికారం:
ఎస్ఓపి లో ఉన్న అన్ని నిబంధనలను పాటించలేని పరిస్థితులు ఉన్నట్లయితే, ఎస్ఓపి నిబంధనలను సడలించే అధికారం టెస్టింగ్ ఏజెన్సీలకు ఇవ్వబడింది. ఇది ఆటోమోటివ్ పరిశ్రమ సంక్లిష్ట సరఫరా గొలుసులో తలెత్తే సమస్యల పరిష్కారానికి అనువైన విధానానికి అవకాశం ఇస్తుంది.
*****
(रिलीज़ आईडी: 1920583)
आगंतुक पटल : 251