ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రూ1570 కోట్లు వ్యయంతో 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలలో ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచడం మరియు దేశంలో నాణ్యమైన, సరసమైన మరియు సమానత్వమైన నర్సింగ్ విద్యను అందించడం లక్ష్యంగా ఉంది


ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలతో నర్సింగ్ కళాశాలల సహస్థానం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, నైపుణ్య ప్రయోగశాలలు, క్లినికల్ సౌకర్యాలు మరియు అధ్యాపకుల యొక్క సరైన వినియోగానికి ఉపకరిస్తుంది.

ప్రణాళిక మరియు అమలు యొక్క ప్రతి దశకు నిర్దేశించిన వివరణాత్మక సమయపాలనతో వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Posted On: 26 APR 2023 7:38PM by PIB Hyderabad

దేశంలో నర్సింగ్ నిపుణుల లభ్యతను బలోపేతం చేసే దిశగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, 2014 నుండి స్థాపించబడిన ప్రస్తుత వైద్య కళాశాలల సహ-స్థానంలో 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనితో ప్రతి సంవత్సరం సుమారు 15,700 నర్సింగ్ గ్రాడ్యుయేట్‌లు అదనం అవుతారు. ఇది భారతదేశంలో, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నాణ్యమైన, సరసమైన మరియు సమానత్వమైన నర్సింగ్ విద్యను మరింత నిర్ధారిస్తుంది. మొత్తం ఆర్థిక వ్యయం రూ.1,570 కోట్లు అవుతుంది.

 

ఆరోగ్య సంరక్షణ రంగంలో భౌగోళిక మరియు గ్రామీణ-పట్టణ అసమతుల్యతలను పరిష్కరించడం ఈ చొరవ లక్ష్యం. ఇది నర్సింగ్ నిపుణుల లభ్యతకు దారితీస్తుంది అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రభావితం చేస్తుంది. ఈ నర్సింగ్ కళాశాలల స్థాపన ఆరోగ్య సంరక్షణలో అర్హత కలిగిన మానవ వనరుల లభ్యతకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇది సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ (UHC) కోసం జాతీయ ఆదేశంలో భాగంగా  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDG) సాధించడంలో సహాయపడుతుంది. నర్సింగ్ విద్య కోసం  ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రెగ్యులేటరీ  సంస్కరణలు కూడా పరిశీలనలో ఉన్నాయి.

 

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) నైపుణ్యం అభివృద్ధి మరియు విదేశీ స్థానాలకు అర్హత కలిగిన నర్సుల నియామకం కోసం ప్రముఖ అంతర్జాతీయ మరియూ జాతీయ ఏజెన్సీలతో కూడా సహకరిస్తుంది.

 

ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలతో ఈ నర్సింగ్ కళాశాలల సహ-స్థానం ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, నైపుణ్య ప్రయోగశాలలు, క్లినికల్ సౌకర్యాలు మరియు అధ్యాపకుల యొక్క సరైన వినియోగానికి ఉపకరిస్తుంది. ఈ చొరవ నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన క్లినికల్ అనుభవాన్ని అందించగలదని మరియు వైద్య కళాశాలల్లో రోగులకు మెరుగైన సంరక్షణ మరియు సేవా సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఈ నర్సింగ్ కళాశాలల్లో హరిత సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం కూడా అన్వేషించబడుతుంది. ఇంధన సామర్థ్యం మరియు కార్బన్ పాదముద్ర తగ్గడాన్ని నిర్ధారించడానికి హరిత సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం  సముచితంగా వినియోగించబడుతుంది.వచ్చే రెండేళ్లలోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది . ప్రాజెక్ట్ యొక్క ప్రతి దశ ప్రణాళిక మరియు అమలు కోసం వివరణాత్మక సమయపాలనను నిర్దేశించింది. కేంద్రంలోని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మరియు రాష్ట్రాల్లోని ఆరోగ్య/వైద్య విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని సాధికార కమిటీ పని పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఈ పథకం కింద కొత్త నర్సింగ్ కళాశాలల స్థాపన కోసం జరుగుతున్న పనుల భౌతిక పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం/యూ టీ లు ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యూ కి క్రమ పద్ధతిలో తెలియజేస్తాయి. 

 

నేపథ్య సమాచారం: నర్సింగ్ నిపుణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలతో నాణ్యమైన ఆరోగ్య  నిపుణుల శ్రామికశక్తిని నిర్ధారించడానికి ఈ ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వైద్య కళాశాలల సంఖ్యను పెంచింది అలాగే తదనంతరం ఎం బీ బీ ఎస్ సీట్లను పెంచింది. 2014కి ముందు 387 ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ప్రస్తుతం 660కి 71% పెరిగింది. 2013-14 నుండి ఎం బీ బీ ఎస్ సీట్ల సంఖ్య దాదాపు రెండింతలు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రెండింతలు పెరిగాయి. భారతీయ నర్సుల సేవలకు విదేశాలలో గణనీయమైన గుర్తింపు ఉంది, కాబట్టి వారి  చలనశీలత మరియు మెరుగైన ఉపాధి అవకాశాలను సులభతరం చేయడానికి భారతీయ నర్సింగ్ విద్యను ప్రపంచ ప్రమాణాలతో సమానంగా తీసుకురావడం చాలా ముఖ్యం. వారు అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులుగా గుర్తించబడ్డారు. వైద్య ఆరోగ్య సంరక్షణ సేవా వ్యవస్థను నడుపుతున్నారు, అయితే వారి సంఖ్యా బలం ప్రపంచ నిబంధనల కంటే తక్కువగా ఉంది మరియు తగినంతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. 

 

 

****(Release ID: 1920292) Visitor Counter : 156