నౌకారవాణా మంత్రిత్వ శాఖ

చెన్నైలో నౌకాశ్రయాలు, జలమార్గాలు, కోస్ట్ డిస్కవరీ క్యాంపస్ కోసం నేషనల్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్


భారతదేశంలో సముద్ర తీర రంగ అభివృద్ధి కోసం
పరిష్కారాలను రూపొందించడానికి ఆర్ అండ్ డి కేంద్రంగా పనిచేయడానికి ఐఐటీఎం
వద్ద రూ. 77 కోట్ల ఎన్టిసిపిడబ్ల్యూసి పెట్టుబడితో నిర్మాణం

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపిఎస్డబ్ల్యూ) ప్రతిష్టాత్మక సాగరమాల పథకం కింద చేపట్టిన ఈ కేంద్ర నిర్మాణం

2022-23 ఆర్థిక సంవత్సరం కోసం, సాగరమాల కార్యక్రమం కింద
రూ. 2,500 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులు మంజూరు

Posted On: 24 APR 2023 5:20PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు తమిళనాడులోని చెన్నైలోని ఐఐటీఎంలో నౌకాశ్రయాలు, జలమార్గాలు మరియు తీరాలకు సంబంధించిన నేషనల్ టెక్నాలజీ సెంటర్ డిస్కవరీ క్యాంపస్‌ను ప్రారంభించారు. దేశంలో పటిష్టమైన సముద్ర అభివృద్ధి పరిశ్రమను నిర్మించాలనే అంతిమ లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కారాలను చూపుతూ సముద్ర రంగం కోసం పరిశోధన, అభివృద్ధిని ప్రారంభించడం ఈ కేంద్రం లక్ష్యం. ఈ అత్యాధునిక కేంద్రం సముద్ర సాంకేతిక రంగంలో పురోగతిని నిర్ధారిస్తుంది, అలాగే 2047 నాటికి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించే దిశగా ఓడరేవు, కార్యకలాపాలలో ఆధునికీకరణ & అప్‌గ్రేడేషన్ అవకాశాలను నిర్ధారిస్తుంది.

 

నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్, వాటర్‌వేస్, కోస్ట్స్ అన్ని విభాగాలలో పోర్ట్, కోస్టల్, వాటర్‌వేస్ సెక్టార్ కోసం పరిశోధన,  కన్సల్టెన్సీ స్వభావం కలిగిన 2డి, 3డి పరిశోధనలను చేపట్టడానికి ప్రపంచ స్థాయి సామర్థ్యాలను కలిగి ఉంది. సముద్రం మోడలింగ్, తీర, నదీముఖ ప్రవాహాలను నిర్ణయించడం, అవక్షేప రవాణా, మార్ఫ్ డైనమిక్స్, నావిగేషన్, డ్రెడ్జింగ్, సిల్టేషన్ అంచనా, పోర్ట్, కోస్టల్ ఇంజనీరింగ్‌లో కన్సల్టెన్సీ - నిర్మాణాలు మరియు బ్రేక్‌వాటర్‌ల రూపకల్పన, స్వయంప్రతిపత్త ప్లాట్‌ఫారమ్‌లు, వాహనాలు, మోడలింగ్ ఆఫ్ ఫ్లో, హల్ ఇంటరాక్షన్, మల్టిపుల్ హల్‌ల హైడ్రోడైనమిక్స్, ఓడరేవు సౌకర్యాలతో కూడిన ఓషన్ పునరుత్పాదక శక్తి వంటివి భారతదేశంలోని సముద్ర రంగం సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ఎన్టిసిపిడబ్ల్యూసి ఇప్పటికే దోహదపడిన కొన్ని రంగాలు. 

చెన్నై సదుపాయంలో 5 అత్యాధునిక ల్యాబ్‌లు ఉన్నాయి, ఇవి ఆత్మనిర్భర్ భారత్ దృష్టికి అనుగుణంగా సముద్ర తీర పరిష్కారాల రూపకల్పన, అభివృద్ధి, అనుకరణ, విశ్లేషణ, ఉత్పత్తి, ప్రతి అంశాన్ని కవర్ చేస్తాయి. నిర్దిష్ట డొమైన్‌లోని ఇతర అంతర్జాతీయ ల్యాబ్‌లతో పోల్చితే ఇక్కడ రూపొందిన ప్రయోగశాలలు అత్యుత్తమమైనవి.

 



ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, “సముద్ర రంగం వృద్ధికి వీలుగా సాంకేతిక పరిష్కారాల పరిశోధన, అభివృద్ధికి అంకితమైన ఈ అత్యాధునిక కేంద్రం ప్రారంభోత్సవంతో,  భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దేశంగా మార్చాలి అన్న మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాధించడానికి మరింత దగ్గరవుతున్నాము. దేశ నిర్మాణంలో సముద్ర రంగ పాత్ర అత్యున్నతమైనది. మన పనితీరును మెరుగు పరచుకోవడానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున, ఈ విషయంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన సుసంపన్నమైన, ప్రతిభావంతులైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తల సమూహం సముద్ర రంగం డైనమిక్ సవాళ్లను ఎదుర్కోగలిగే అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని మేము నమ్ముతున్నాము. లాజిస్టిక్స్ ఉద్యమం బహుళ మోడల్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా, పీఎం జాతీయ గతి శక్తి ద్వారా లాజిస్టిక్స్ రంగాన్ని సమర్థవంతంగా ఇంకా ఖర్చు తగ్గించే దిశగా మార్చాలనే ప్రధాన మంత్రి మోడీ దృష్టి ఈ కేంద్రం ప్రారంభంతో అద్భుతమైన స్థితికి చేరుకుంది. సాగరమాల కార్యక్రమం ప్రస్తుత వ్యవస్థలో ఆధునిక, ప్రపంచ స్థాయి ఓడరేవులుగా మారడానికి, భారతదేశ వృద్ధికి శక్తినిచ్చేలా పరివర్తన తీసుకురావడానికి రూపొందించారు.

మారిటైమ్ స్టార్ట్-అప్‌లకు మద్దతుగా మరిన్ని ప్రపంచ స్థాయి ల్యాబ్ సౌకర్యాలు, ఇన్నోవేషన్ హబ్‌లను చేర్చడానికి ఈ సదుపాయాన్ని విస్తరింపజేస్తామని కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. . దీనదయాళ్ పోర్ట్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్, పరదీప్ పోర్ట్, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, VOC పోర్ట్, న్యూ మంగళూరు పోర్ట్, విశాఖపట్నం ఓడరేవు వంటి ప్రధాన ఓడరేవులు ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఉదారంగా సహకరించాయి. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముఖ్యమైన సహకారాన్ని అందించింది. ఎస్ఎంపి కోల్‌కతా, మోర్ముగావ్ పోర్ట్, కొచ్చిన్ పోర్ట్‌లు కూడా ప్రధాన కేస్ స్టడీ సెంటర్‌లను అందించడం ద్వారా ఈ కార్యాచరణలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

 

 

ఈ సాంకేతిక కేంద్రం... పరిశోధన వ్యయాన్ని కూడా భారీగా తగ్గిస్తుంది. నౌకాశ్రయం, సముద్ర రంగంలో పని కోసం ఖర్చు, సమయం ఆదా అవుతుంది. ఈ కేంద్రం శాస్త్రీయ మద్దతు ద్వారా పరిశ్రమలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తుంది.  స్థానిక,  ప్రాంతీయ, జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలలో సముద్ర రవాణాలో అనువర్తిత పరిశోధన, సాంకేతిక బదిలీని అందిస్తుంది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఓడరేవు ఆధారిత అభివృద్ధిని మెరుగుపరచడానికి, తీరప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, భారతదేశ ఓడరేవుల రంగాన్ని ఆధునీకరించడానికి సాగరమాల కార్యక్రమం వ్యూహాత్మక, కస్టమర్-ఆధారిత ప్రాజెక్ట్. సాగరమాల కింద గత ఎనిమిది సంవత్సరాలలో లోతట్టు ప్రాంతాలలో క్లిష్టమైన ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, పెరుగుతున్న వాణిజ్య పరిమాణం అవసరాలను తీర్చడానికి, మెరుగైన సామర్థ్యాల ద్వారా లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడానికి, ఓడరేవుల మొత్తం కార్యాచరణ వ్యయాలను తగ్గించడంలో, నౌకల టర్న్‌అరౌండ్ సమయాన్ని తగ్గించడంలో, సామర్థ్యం, నిర్గమాంశను పెంచడంలో సహాయపడింది. 

 

సాగరమాల పథకం కింద, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, యుటిలలో రూ.10,900 కోట్లు పాక్షికంగా 171 ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. 171 ప్రాజెక్టుల్లో రూ. 2,900 కోట్లు విలువైన 48 ప్రోజెక్టులు పూర్తయ్యాయి. రూ. 8,000 కోట్లు విలువైన 123 ప్రాజెక్టులు అమలు, అభివృద్ధి వివిధ దశలలో ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్లు విలువైన 37 ప్రాజెక్ట్‌లు  సాగరమాల పథకం కింద ఈ మంత్రిత్వ శాఖ  మంజూరు చేసింది. కార్యకలాపాలలో ప్రైవేట్ రంగం నుండి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు, రూ. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిలో మేజర్ పోర్టులలో 40,200 కోట్ల విలువైన  52 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా, విలువ రూ. 49,500 కోట్లు 84 ప్రాజెక్టుల అమలు, అభివృద్ధి వివిధ దశలలో ఉన్నాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా, సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ రూ. 530 కోట్లతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

సాగరమాల కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రోత్సాహాన్ని అందించింది, దీని ఫలితంగా కార్గోను భూ-ఆధారిత రవాణా నుండి తీరప్రాంత, లోతట్టు జలమార్గాల విధానంలో స్థిరంగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా మార్చవచ్చు. ఈ చర్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఓడరేవుల వద్ద నిర్వహించే తీరప్రాంత సరుకు రవాణా మొత్తం 16% పెరిగింది.

ఈ ప్రయత్నాల ఫలితంగా పోర్ట్‌లలో నిర్వహించబడే మొత్తం కార్గో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.6% వృద్ధిని నమోదు చేసింది. ఇది భారతదేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 440 బిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతిని సాధించడంలో దోహదపడింది.

ప్రారంభోత్సవం సందర్భంగా, ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి మాలిని వి శంకర్, చెన్నై పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ శ్రీ సునీల్ పలివాల్, న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ డాక్టర్ వెంకట రమణ అక్కరాజు, ఐఐటిఎమ్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ వి.కామకోటి, ప్రొఫెసర్ కె. మురళి, డీన్ (ఫ్యాకల్టీ) ఓషన్ ఇంజనీరింగ్ విభాగం; ఓషన్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్. నల్లయరసు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1919380) Visitor Counter : 161


Read this release in: Urdu , English , Hindi