నౌకారవాణా మంత్రిత్వ శాఖ

చెన్నై, కామరాజర్ ఓడరేవులలో సామర్థ్యాన్ని పెంచడానికి రూ. 148 కోట్ల విలువైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ సర్బానంద సోనోవాల్


చెన్నై వ్లాడివోస్టాక్ మారిటైమ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు
రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది: శ్రీ సోనోవాల్

చెన్నైలోని భారతి డాక్ వద్ద బంకర్ బెర్త్ 1 ఎంఎంటిపిఏ సామర్థ్యంతో విస్తరణ ;
10,000 డిడబ్ల్యూటి వరకు బంకర్ ట్యాంకర్లకు అవకాశం: శ్రీ సోనోవాల్

ఆటంకం లేని కార్గో ట్రాఫిక్ కోసం పోర్ట్ యాక్సెస్ రోడ్డు ‘అమృత్ మహోత్సవ్ మార్గ్’
వల్హూర్ జంక్షన్ నుండి కేపిఎల్ ఎన్సిటిపిఎస్ జంక్షన్ వరకు అప్‌గ్రేడ్

గ్రీన్ పోర్ట్ కార్యక్రమం కింద, 40 కేఎల్డి సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి
కర్మాగారం, గూడ్స్ షెడ్ యార్డ్ శ్రీ సోనోవాల్ చే ప్రారంభం

Posted On: 23 APR 2023 7:14PM by PIB Hyderabad

రాష్ట్రంలోని చెన్నై, కామరాజర్ ఓడరేవుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తమిళనాడులోని చెన్నైలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు. రూ.148 కోట్లను దాటిన ఈ ప్రాజెక్టులు చెన్నై, కామరాజర్ ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సిద్ధం అయ్యాయి.  భారత్, రష్యాల దేశాల మధ్య సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు ‘చెన్నై-వ్లాడివోస్టాక్ మారిటైమ్ కారిడార్’ను ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలను  కేంద్ర మంత్రి ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

 

భారతి డాక్‌లో ఒక బంకర్ బెర్త్, జోలార్‌పేటలో గూడ్స్ షెడ్ యార్డ్, 40 కేఎల్డి (రోజుకి కిలో లీటర్లు) మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను శ్రీ సర్బానంద సోనోవాల్ చెన్నై పోర్ట్‌లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.55 కోట్ల కంటే ఎక్కువ. పోర్ట్‌లు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఓపిఎస్డబ్ల్యూ) దార్శనిక ప్రాజెక్ట్  సాగరమాల పథకం కింద నిధులు సమకూర్చిన 182 మీటర్ల బంకర్ బెర్త్ ప్రాజెక్ట్ విలువ రూ.50.25 కోట్లు. ఇది 1 ఎంఎంటిపిఏ (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) సామర్థ్యాన్ని జోడిస్తుంది.  10,000 డిడబ్ల్యూటి వరకు బంకర్ ట్యాంకర్‌లను కూడా నిర్వహిస్తుంది. ఇది చెన్నై, కామరాజర్,  కాటుపల్లిలోని ప్రాంతీయ ఓడరేవులకు, సమీపంలోని ఇతర నౌకలకు సంబంధించిన నౌకల బంకర్ అవసరాలను తీర్చగలదు.

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “తమిళనాడు సముద్ర వాణిజ్యం గొప్ప చరిత్ర భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పునాదిగా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి మేము కృషి చేస్తున్నందున, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని సముద్ర రంగంలో సానుకూల మార్పును ఇంజినీరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు సముద్ర రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఎగ్జిమ్ ట్రేడ్‌తో పాటు ప్రాంతీయ వాణిజ్యంలో వృద్ధిని పెంచుతాయి. సాగర్‌మాల వంటి విప్లవాత్మక పథకాల ద్వారా బ్లూ ఎకానమీ భారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడానికి మా ప్రయత్నం, మోదీ జీ ఊహించిన న్యూ ఇండియా విజన్‌తో సమకాలీకరించబడింది" అని అన్నారు. 

 

రష్యా, భారతదేశం మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడం గురించి శ్రీ సోనోవాల్ వ్యాఖ్యానిస్తూ, “బ్లూ ఎకానమీలో భారీ వాణిజ్య సామర్థ్యాన్ని వినియోగిస్తూ ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాన్ని మరింత పెంచడానికి చెన్నై-వ్లాడివోస్టాక్ మారిటైమ్ కారిడార్‌ను తెరవడానికి రష్యాతో భారత్ చర్చలు జరుపుతోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ   నాయకత్వంలో, భారతదేశ వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తన వాణిజ్యం, పెట్టుబడి సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం తన నిబద్ధతను ధృవీకరిస్తోంది. ఈ కారిడార్ రెండు దేశాల్లోని గొప్ప సముద్ర చరిత్ర కలిగిన చెన్నై, వ్లాడివోస్టాక్ అనే రెండు చారిత్రాత్మక నగరాల మధ్య వృద్ధి, పెట్టుబడి సహకారానికి మార్గంగా పని చేస్తుంది" అని కేంద్ర మంత్రి అన్నారు. 

జోలార్‌పేట్‌లో 15,000 చదరపు మీటర్ల పెద్ద గూడ్స్ షెడ్ సౌకర్యం, లోడింగ్  స్టాకింగ్ సౌకర్యాలతో, రైల్వే ద్వారా చెన్నై పోర్ట్ వరకు కార్గోను తరలించడానికి వీలు కల్పిస్తుంది, కార్గో ముఖ్యంగా కంటైనర్ల కదలికను పెంచుతుంది. టెర్మినల్ యాక్సెస్ ఛార్జీల నుండి ఓడరేవు ఆదాయ వాటా (దక్షిణ రైల్వే నుండి) కూడా పొందుతుంది.

ఎంఓపిఎస్డబ్ల్యూ గ్రీన్ పోర్ట్ ఇనిషియేటివ్‌లో భాగంగా, 40 కేఎల్డి కెపాసిటీ గల మురుగునీటి శుద్ధి కర్మాగారం వివిధ ప్రయోజనాల కోసం శుద్ధి చేసిన తర్వాత వ్యర్థ జలాలను తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది. వల్లూర్ జంక్షన్ నుండి ఎన్సిటిపిఎస్ జంక్షన్ వరకు కామరాజర్ పోర్ట్ 4.8 కిమీ యాక్సెస్ రోడ్డు మధ్య అమృత్ మహోత్సవ్ మార్గ్ రూ.88 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. ఇది ఓడరేవుకు మెరుగైన రహదారి కనెక్టివిటీతో కార్గో అవాంతరాలు లేని కదలికను పెంచుతుంది. ఎంఓపి ఎస్డబ్ల్యూ “నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్” ప్రాజెక్ట్‌లలో ఒకటైన సాగర్మాల కింద వల్లూర్ జంక్షన్ నుండి ఎంసిటిపిఎస్ జంక్షన్ వరకు పోర్ట్ యాక్సెస్ రోడ్డు విస్తరణ శంకుస్థాపన పూర్తయింది.

సాగరమాల కార్యక్రమం గురించి... 
 

సాగరమాల కార్యక్రమం భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమగ్ర విధానాన్ని అమలు చేస్తోంది. అభివృద్ధి కోసం 5 కీలక స్తంభాల క్రింద ప్రాజెక్టులను గుర్తించింది - పోర్ట్ ఆధునికీకరణ, పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్-ఆధారిత పారిశ్రామికీకరణ, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్. 2035 నాటికి సాగరమాల కార్యక్రమం కింద రూ.5.40 లక్షల కోట్ల విలువైన 802 ప్రాజెక్టులు అమలు చేయవలసి ఉంది. వాటిలో రూ.1.12 లక్షల కోట్ల విలువైన 221 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ. 2.29 లక్షల కోట్ల విలువైన 252 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా రూ.1.98 లక్షల కోట్ల విలువైన 329 ప్రాజెక్టులు వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నాయి.

మొత్తం సాగరమాల ప్రాజెక్టులలో రూ.1.46 లక్షల కోట్ల విలువైన 108 ప్రాజెక్టులు తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. 108 ప్రాజెక్టులలో, రూ.34,752 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి, రూ. 67,759 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. 31 ప్రాజెక్టులు రూ. 44,057 కోట్లు వివిధ దశల అభివృద్ధిలో ఉన్నాయి. పోర్ట్ ఆధునీకరణ కేటగిరీ కింద, రూ.49,045 కోట్ల విలువైన 44 ప్రాజెక్ట్‌లు, ఈ కేటగిరీ కింద కొన్ని కీలక ప్రాజెక్టులు 'విఓసి  పోర్ట్‌లోని ఫిషరీస్ కాలేజీకి ఎదురుగా ఎన్హెచ్ -7ఏ కి ఆనుకుని పూర్తి స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్ అభివృద్ధి,  నిర్వహణ', 'డ్రెడ్జింగ్' విఓసి పోర్ట్ వద్ద కోస్టల్ కార్గో బెర్త్ కోసం డాక్ బేసిన్ మొదలైనవి.

దక్షిణ భారతదేశంలోని పారిశ్రామికీకరణలో చెన్నై పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. కామరాజర్ పోర్ట్‌తో పాటు, చెన్నై ఓడరేవు రాష్ట్ర ఎగ్జిమ్ వాణిజ్యానికి వెన్నెముకగా ఉంది. చెన్నై పోర్ట్ 2022-23కి రూ.943 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని, రూ.150 కోట్ల నికర మిగులును సాధించింది, ఇది గత 13 ఏళ్లలో అత్యధికం. కామరాజర్ పోర్ట్ కూడా 2023 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా రూ.1,000 కోట్ల ఆదాయ మార్కును దాటింది. కేపిఎల్... 2022-23లో రూ.670 కోట్ల నికర మిగులు (పన్నుకి ముందు లాభం) నమోదు చేసింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 24.39% పెరిగింది.

                                                                                                       

****



(Release ID: 1919088) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Tamil