జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా రాజ్‌కోట్‌లోని చింతన్ శివిర్-టెక్స్‌టైల్స్ కాన్క్లేవ్‌కు హాజరుకానున్న శ్రీ పీయూష్ గోయల్


టెక్నికల్ టెక్స్‌టైల్స్‌పై చింతన్ శివిర్ ఆలోచనలు: హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్‌లలో వృద్ధి అవకాశాలను అన్వేషించడం

పత్తిపై టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్ మరియు మ్యాన్ మేడ్ ఫైబర్స్‌పై టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్‌ల వాటాదారుల సమావేశాలకు అధ్యక్షత వహించనున్న శ్రీ గోయల్

సోమనాథ్‌ను సందర్శించడంతో పాటు సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా నిర్వహిస్తున్న హస్తకళ మరియు హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను సందర్శించనున్న శ్రీ గోయల్

Posted On: 21 APR 2023 10:33AM by PIB Hyderabad

గౌరవనీయులైన కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు జౌళి మరియు రైల్వే శాఖల సహాయమంత్రి  శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ ఈ చింతన్ శివిర్  మేధోమథన సమావేశానికి హాజరవుతారు.ఇది టెక్నికల్ టెక్స్‌టైల్స్, నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్‌కు చెందిన ప్రధాన పథకం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శుక్రవారం, 21 ఏప్రిల్ 2023న జరిగే సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా ఏర్పటు చేసిన ఈ సదస్సు హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్‌లలో వృద్ధి అవకాశాలను  అన్వేషిస్తుంది.

సింథటిక్ & రేయాన్ టెక్స్‌టైల్స్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (ఎస్‌ఆర్‌టిఈపిసి) మరియు ఇండియన్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ (ఐటీటీఏ)తో కలిసి ఈ సెషన్ నిర్వహించబడుతోంది. ఇందులో గృహ వస్త్రాలు మరియు పారిశ్రామిక కుట్టు దారాలు, అంటుకునే టేప్‌లు, లేబుల్‌లు మరియు బ్యాచ్‌లు, ఫర్నిచర్ మరియు కోటెడ్ ఫ్యాబ్రిక్స్, దోమల వలలు, ఫైబర్‌ఫిల్, ఫిల్టర్ ఫ్యాబ్రిక్స్, హౌస్‌హోల్డ్ వైప్స్, స్టఫ్డ్ టాయ్‌లు వంటి 50 కంటే ఎక్కువ ప్రధాన పరిశ్రమల భాగస్వామ్యంతో కార్యక్రమంలో నిర్వహించబడుతోంది.

ఈ సదస్సులో పరిశ్రమల ప్రముఖులు, తయారీదారులు, పరిశోధకులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లైన్ మినిస్ట్రీలు మరియు వినియోగదారుల విభాగాలను ఒకే వేదికపైకి తీసుకుని ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు రంగం యొక్క భవిష్యత్తు అభివృద్ధి  చర్చిస్తారు.

ఈ సెషన్‌లో భారత్‌తో పాటు ప్రపంచంలో హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్  పెట్టుబడులు మరియు ఎగుమతి అవకాశాలు, ప్రముఖ హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్ ఇండస్ట్రీ మాగ్నెట్‌లతో నిపుణుల సంభాషణలు, గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రదర్శన మరియు నాయకత్వంతో ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తరాల సెషన్‌పై చర్చ జరుగుతుంది. అలాగే సెషన్ చర్చలు హోమ్‌టెక్ మరియు క్లాత్‌టెక్ పరిశ్రమల వృద్ధికి మరియు భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచడానికి బలమైన మార్గాన్ని సుగమం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.

పర్యటన సందర్భంగా ఎంఎంఎఫ్ విలువ గొలుసు వాటాదారులతో మానవ నిర్మిత ఫైబర్స్‌పై టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్‌పై జరిగే 2వ సమావేశానికి శ్రీ గోయల్ అధ్యక్షత వహిస్తారు.

గౌరవనీయమైన జౌళి మంత్రి శ్రీ గోయల్ పత్తిపై టెక్స్‌టైల్ అడ్వైజరీ గ్రూప్ (టిఏజి-సి) 6వ సమావేశానికి కూడా అధ్యక్షత వహిస్తారు. టిఏజి-సి 25 మే, 2022న స్థాపించబడింది. మొత్తం కాటన్ వాల్యూ చైన్‌లోని వాటాదారులైన  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపిఈడీఏ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సిఐటీఐ), కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఏఐ), ది కాటన్ టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ (టీఈఎక్స్‌పిఆర్‌ఓసిఐఎల్), ఇండియా కాటన్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐసీఏఎల్), ది క్లాతింగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎంఏఐ), అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపిసి), ఆల్ ఇండియా కాటన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ కాటన్ ఫెడరేషన్ (ఐసిఎఫ్), సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ (ఎస్‌ఐఎంఐ)తో పాటు దేశీయంగా ప్రముఖులు తయారీదారులు/ఎగుమతిదారులు & వినియోగదారులు మరియు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల ప్రతినిధులు ఉంటారు.

టెక్స్‌టైల్స్‌లో సస్టైనబిలిటీ అండ్ సర్క్యులారిటీ - ఫ్యూచర్ రోడ్‌మ్యాప్‌పై కూడా మంత్రి ప్రసంగిస్తారు.ఏటియూఎఫ్‌ఎస్ మరియు పిఎం మిత్ర వంటి మంత్రిత్వ శాఖ ప్రధాన పథకాలలో సుస్థిరత కేంద్ర బిందువు - రీసైక్లింగ్ సౌకర్యాల కార్యక్రమం ఏటియుఎఫ్‌ఎస్ మరియు పిఎం మిత్రా పార్కుల క్రింద ఊపందుకుంది.

స్థిరమైన మరియు వృత్తాకార ఉత్పత్తుల కోసం పెరుగుతున్న అంతర్గత మరియు గ్లోబల్ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం కూడా తనను తాను బ్రేస్ చేస్తోంది మరియు అనేక మంది భారతీయ ఆవిష్కర్తలు టెక్స్‌టైల్ విలువ గొలుసు యొక్క వివిధ ప్రక్రియలను సమర్థవంతంగా మరియు పర్యావరణ అనుకూలమైనదిగా చేయడానికి అవసరమైన సాంకేతికతలపై ప్రయోగాలు చేస్తున్నారు.

గుజరాత్ మరియు తమిళనాడులోని టెక్స్‌టైల్ క్లస్టర్లు సుస్థిరత దిశగా ముందున్నాయి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఫైబర్-ఫైబర్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయ సేంద్రీయ రంగులు/రసాయనాలకు మారడం అలాగే పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం వంటి ప్రక్రియల ద్వారా ఉత్పాదక ప్రక్రియలను మరింత సమర్ధవంతంగా చేయడానికి ఈ రోజు వారు గొప్ప పని చేస్తున్నారు. దీనితో పాటు, మెరుగైన పని పరిస్థితులు మరియు ప్రయోజనాల ద్వారా కార్మికుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని కూడా జరుగుతోంది. తద్వారా ఈఎస్‌జీ సూత్రాల యొక్క అన్ని అంశాలను లక్ష్యంగా చేసుకుంటుంది.

ఈ పర్యటనలో శ్రీ పీయూష్ గోయల్ కూడా సోమనాథ్‌ను సందర్శిస్తారు మరియు సౌరాష్ట్ర తమిళ సంగమం సందర్భంగా నిర్వహిస్తున్న హస్తకళ మరియు చేనేత ఎక్స్‌పోను తిలకిస్తారు.

'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం కింద గుజరాత్ మరియు తమిళనాడు మధ్య సాంస్కృతిక సంబంధాలను జరుపుకోవడానికి సౌరాష్ట్ర తమిళ సంగమం 2023 ఏప్రిల్ 17 నుండి 30 వరకు నిర్వహించబడుతోంది. ఐక్యతను జరుపుకోవడానికి మరియు భాగస్వామ్య చరిత్రతో రెండు ప్రాంతాల ఏకత్వాన్ని హైలైట్ చేయడానికి ఈ కార్యక్రమం నాలుగు వేర్వేరు ప్రదేశాలైన సోమనాథ్, ద్వారక, రాజ్‌కోట్ మరియు కెవాడియాలోని ఐక్యతా విగ్రహ వద్ద  నిర్వహించబడుతోంది.



 

****


(Release ID: 1918547) Visitor Counter : 157