భారత పోటీ ప్రోత్సాహక సంఘం
సువేన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వోటింగ్ హక్కును కల్పించే 76.10% వరకు మూల ధన వాటాను బెర్హిండా లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన సిసిఐ
Posted On:
20 APR 2023 7:11PM by PIB Hyderabad
బెర్హిండా లిమిటెడ్ ద్వారా సువేన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి వోటింగ్ హక్కును కల్పించే 76.10% వరకు మూల ధన వాటాను కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదాన్ని తెలిపింది.
ప్రతిపాదిత కలయిక 26 డిసెంబర్ 2022 నాటికి వాటా కొనుగోలు ఒప్పందం ద్వారా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) (తగినన్ని వాటాల కొనుగోలు, స్వాయత్తం చేసుకునే) నిబంధనలు, 2011కు అనుగుణంగా తప్పనిసరి బహిరంగ ఆఫర్ ద్వారా సువేన్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ (లక్ష్యిత సంస్థ) నుంచి ఓటింగ్ హక్కు కల్పించగల దాదాపు 76.10% మూలధనవాటాను బెర్హిందా లిమిటెడ్ (కొనుగోలు సంస్థ)కు సంబంధించింది.
కొనుగోలు సంస్థ బెర్ హిందా మిడ్‌కో లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, అంటే, జస్మిరల్ మిడ్‌కో లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. వీటిని సమిష్టిగా అంతర్జాతీయ జిపిఇ IX ఫండ్స్, అడ్వెంట్ ఇంటర్నేషనల్ జిపిఇ X ఫండ్స్ నియంత్రిస్తుండగా, అంతిమంగా వీటన్నింటినీ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
లక్ష్యిత సంస్థ, ఒక బయోఫార్మస్యూటికల్ కంపెనీ. దీనిని 6 నవంబర్ 2018లో విలీనం చేసిన సమగ్ర కాంట్రాక్ట్ అభివృద్ధి, ఉత్పత్తి సంస్థ. ఇది ప్రపంచ ఫార్మస్యూటికల్ సంస్థలకు, ఆగ్ర వ్యవసాయ రసాయన సంస్థలకు వారి ఆవిష్కరణ కృషిలో తోడ్పాటు సేవలను అందిస్తుంది. ఇది ఉత్పత్తి చేసిన ఎపిఐలను, అత్యాధునిక ఔషధీయ ఇంటర్మీడియేట్స్‌ను భారత్‌కు బయిట ఉన్న మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది.
దీనికి సంబంధించిన సిసిఐ వివరణాత్మక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
***
(Release ID: 1918430)
Visitor Counter : 172