శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సుస్థిర ఇంధన పరివర్తన కోసం జీ-20 దేశాలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న విధానాలపై చర్చించిన పరిశోధన,ఆవిష్కరణ కోసం ఏర్పాటైన జీ-20 రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ గాదరింగ్
Posted On:
20 APR 2023 4:36PM by PIB Hyderabad
సుస్థిర ఇంధన పరివర్తన కోసం జీ-20 దేశాలు అనుసరిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న విధానాలపై పరిశోధన,ఆవిష్కరణ కోసం ఏర్పాటైన జీ-20 రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ గాదరింగ్ సదస్సులో నిపుణులు చర్చించారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో సుస్థిర ఇంధన పరివర్తన కోసం అమలు చేయాల్సిన చర్యలను జీ-20 రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ గాదరింగ్ (ఆర్ఐఐజి ) సదస్సులో చర్చించారు.
సదస్సును శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆర్ఐఐజి చైర్మన్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ ప్రారంభించారు. 'శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇంధన అవసరాలు తీర్చే అంశంలో పునరుత్పాదక ఇంధన వనరులు కీలకంగా ఉంటాయి. పునరుత్పాదక ఇంధన వనరులను గుర్తించడం, అవసరాలకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగానికి సిద్ధం చేయడం, భారీ పరిమాణంలో నిల్వ చేయడం లాంటి అంశలపై సంఘటిత కృషి అవసరం ' అని తన ప్రారంభ ఉపన్యాసంలో డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2023 ఏప్రిల్ 19న జరిగిన సదస్సులో 29 మంది విదేశీ ప్రతినిధులు,భారతదేశానికి చెందిన 30 మంది నిపుణులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాస్త్రీయ విభాగాలు/ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చెందిన శ్రీ డి.పి.శ్రీవాస్తవ కార్బన ఆధారిత ప్రపంచంలో భారతదేశం శక్తి పరివర్తన గురించి ప్రసంగించారు.
ఇండోనేషియా, తుర్కియా , అమెరికా , రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, యూకే , నెదర్లాండ్స్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, యూరోపియన్ యూనియన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) కి చెందిన నిపుణులు సదస్సులో పాల్గొన్నారు.
స్మార్ట్ ఎనర్జీ ట్రాన్స్ ఫర్మేషన్, స్టోరేజ్, మేనేజ్ మెంట్ వంటి అంశాలు, సుస్థిర శక్తి పరివర్తనలో పరిశోధన, కార్బన్-న్యూట్రల్ ఎనర్జీ వనరులు, గ్రీన్ హైడ్రోజన్ లో పరిశోధన,ఆవిష్కరణ కోసం విధాన నిర్ణయం తదితర అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి. గుర్తించిన రంగాల్లో జి 20 సభ్య దేశాల మధ్య సహకారం గురించి సమావేశంలో చర్చించారు.
జీ-20 అధ్యక్ష హోదాలో 2022 లో ఇండోనేషియా జీ-20 రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేటివ్ గాదరింగ్ (ఆర్ఐఐజి) ను ఏర్పాటు చేసింది.
సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఎదురయ్యే శాస్త్రీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై తదుపరి ఆర్ఐఐజీ సమావేశం డయ్యూలో జరుగుతుంది. 2023 జూలై 5 న ముంబైలో జరిగే శిఖరాగ్ర సదస్సు, మంత్రుల సమావేశంతో ఆర్ఐఐజి సమావేశాలు ముగుస్తాయి. శిఖరాగ్ర సదస్సులో జీ-20 సభ్య దేశాలు సంయుక్త ప్రకటనను ఆమోదిస్తాయి.
***
(Release ID: 1918399)
Visitor Counter : 161