వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భోపాల్ లోని ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్ (పీడీఎఫ్ సీ)ని సందర్శించి, రైతులతో మాట్లాడిన డీఏ అండ్ ఎఫ్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ

Posted On: 19 APR 2023 7:39PM by PIB Hyderabad

భోపాల్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లోని ఐసీఏఆర్ లోని ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్మెంట్ సెంటర్ (పీఎఫ్ డీసీ)ను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ ఈరోజు సందర్శించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న 22 పిడిఎఫ్ సీలు తమ సమీప గ్రామాలను దత్తత తీసుకుని  బహిరంగ క్షేత్రం, రక్షిత సాగు సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 

 భోపాల్  పిఎఫ్ డిసి 3.8 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో  సహజ వెలుతురు ప్రసరించే పాలీహౌస్ (02), కృత్రిమ వెలుతురూ ప్రసారం అయ్యే  పాలీహౌస్ (02), కేబుల్ ,పోస్ట్ షేడ్ నెట్ (01), షేడ్ నెట్ గృహాలు (18 ), వ్యవసాయ కార్యక్రమాలు చెప్పడానికి సొరంగం తరహాలో నిర్మించిన సౌకర్యాలు  ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ ఏకీకృతంగా ఉంటాయి. ఈ సౌకర్యాలకు సూక్ష్మ బిందు నీటి పారుదల సౌకర్యం, సౌర శక్తితో అనుసంధానం చేశారు. ప్రదర్శనలు నిర్వహించడానికి రెండు హెక్టార్ల స్థలాన్ని కేంద్రంలో ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.

ఓపెన్ ఫీల్డ్ , పాలీహౌస్ పరిస్థితుల్లో టమాటో, క్యాప్సికమ్ పంటల సాగు కోసం  వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం  అధ్యయనం, అభివృద్ధి కోసం కేంద్రం పరిశోధనలు నిర్వహిస్తోంది. అదేవిధంగా   బహిరంగ పొలం,  షేడ్ నెట్ పాలీహౌస్లలో టమాటో, క్యాప్సికమ్ పెరుగుదల అంచనా వేయడానికి పరిశోధన సాగిస్తోంది.  మామిడి, జామ పంటలకు డ్రిప్ ఫెర్టిగేషన్ వ్యవస్థ ద్వారా నీరు సరఫరా చేయడం, మైక్రో స్ప్రింక్లర్ వ్యవస్థ ద్వారా  బఠానీలు సాగు చేయడం అంశాలపై కేంద్రం లో పరిశోధన సాగుతోంది.  అనుమతించిన పొడవున ఎన్ పి సి  డ్రిప్పర్ ద్వారా  నిర్దిష్ట ప్రమాణంలో నీరు విడుదల అవుతున్న తీరు  పరీక్షించడం, వివిధ సూక్ష్మ సేద్యం వ్యవస్థల కింద వరి, గోధుమ పంట పెరుగుతున్న తీరు,  విభిన్న రంగులతో నిర్మించిన షెడ్ల కింద  పండ్లు ,కూరగాయల సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించడానికి కేంద్రం పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  జామ, మామిడి, క్యాప్సికం, టమాటా, బఠానీ, పెసర, బంగాళాదుంపలు, ఉల్లి, శనగలు, గెర్బెరా పంటలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అభివృద్ధి చేస్తోంది.  డ్రిప్ విధానం, నీరు ఆవిరి కాకుండా భూమిలో తేమ ఉండేలా చూసే మల్చింగ్ విధానం, పాలీహౌస్ కింద బిందు సేద్యం,మైక్రో స్ప్రింక్లర్, ఫ్లడ్ ఇరిగేషన్,ద్వారా నీరు సరఫరా చేసి   పచ్చిక బయళ్లు, పళ్ళ తోటల పెంపకం   వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం రైతుల కోసం ప్రదర్శిస్తోంది. 

ఇంతవరకు  సంస్థ 123 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. వీటిలో  సుమారు 3,100 మంది రైతులు / రాష్ట్ర ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.  36 జాతీయ / ప్రాంతీయ స్థాయి వ్యవసాయ కార్యక్రమాలను కూడా సంస్థ నిర్వహించింది.  పీఎఫ్ డీసీ వివిధ పద్ధతుల ద్వారా అందించిన పరిజ్ఞానం కారణంగా గత ఐదేళ్లలో పీఎఫ్ డీసీ, రాష్ట్ర ఉద్యాన శాఖ కృషితో బిందు సేద్యం విస్తీర్ణం 50000 హెక్టార్ల నుంచి 320000 హెక్టార్లకు పెరిగింది. ప్లాస్టిక్ మల్చింగ్ 2000 హెక్టార్ల నుంచి 25,000 హెక్టార్లకు, షేడ్ నెట్ గృహాలు 20 హెక్టార్ల నుంచి  240 హెక్టార్ల వరకు,  పాలీహౌస్ లు1 హెక్టార్ నుంచి  210 హెక్టార్ల వరకు పెరిగాయి. 

2023-24 సంవత్సరంలో సాంకేతిక మదింపు,శుద్ధి కోసం నాలుగు ప్రాజెక్టులను సంస్థ ప్రతిపాదించింది. రక్షిత నిర్మాణం కింద పోషకాలు అధికంగా ఉండే నీటితో నిలువు వ్యవసాయం, ఏడాది పొడవునా సాగు కోసం బై ఫేషియల్ సోలార్ గ్రీన్ హౌస్ వినియోగం, పాలీహౌస్ లో ఐఓటి / క్లౌడ్ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థ, షేడ్ నెట్ విధానంలో జరిగే కూరగాయల పంటల సాగులో  బయోటిక్, అబయోటిక్ ఒత్తిళ్లను అధ్యయనం చేయడానికి ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ ప్రతిపాదించింది. 

బిందు సేద్యంతో ప్లాస్టిక్ మల్చ్ కింద క్యారెట్, బిందు సేద్యంతో మల్చింగ్ కింద స్వీట్ కార్న్ సాగు, వివిధ మైక్రో ఇరిగేషన్ విధానంలో బఠానీలు, మల్చింగ్, పాలీహౌస్ లో టమోటా సాగుకు మైక్రో ఇరిగేషన్, పాలీహౌస్ లో దోసకాయ సాగు, మైక్రో ఇరిగేషన్ వంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సంస్థ ప్రణాళిక రూపొందించింది. 

***


(Release ID: 1918177) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi