శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మెట్రాలజీ, ఖచ్చితమైన కొలతల గురించి అవగాహన అవసరం: శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ, ఐఏఎస్, డైరెక్టర్ జనరల్- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్


"ఒక వారం ఒక ప్రయోగశాల" కార్యక్రమం క్రింద "మెట్రాలజీ కాన్క్లేవ్"ని నిర్వహించిన సిఎస్ఐఆర్ - ఎన్సీపిఎల్

Posted On: 19 APR 2023 4:47PM by PIB Hyderabad

సిఎస్ఐఆర్ - ఎన్సీపిఎల్  'ఒక వారం ఒక ప్రయోగశాల' (ఓడబ్ల్యూఓఎల్) కార్యక్రమాన్ని 17-21 ఏప్రిల్ 2023 నుండి నిర్వహిస్తున్నారు. దీనిని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి, సిఎస్ఐఆర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. నేషనల్ మెట్రాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంఐ) అయినందున, ఒక-రోజు కార్యక్రమం - “మెట్రాలజీ కాన్క్లేవ్” సిఎస్ఐఆర్ - ఎన్సీపిఎల్  ప్రధాన అంశాన్ని అంటే, మెట్రాలజీ ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. 

ఇటీవలి కాలంలో, మెట్రాలజీ ఖచ్చితమైన కొలతలు ఉత్పత్తి నాణ్యతను నిర్వచించే కీలక అంశాలు, ప్రామాణీకరణను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి దాని మెట్రాలాజికల్ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మెట్రాలజీ కాన్క్లేవ్ అనేది ఖచ్చితమైన కొలత, సంపన్న దేశం ఆవశ్యకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (డీజీ-బిఐఎస్) డైరెక్టర్ జనరల్, శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ, గౌరవ అతిథి  క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) డైరెక్టర్  శ్రీ జక్సే షా,  సిఎస్ఐఆర్ - ఎన్సీపిఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట తో కలిసి ప్రారంభించారు. ఓడబ్ల్యూఓఎల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రీతు శ్రీవాస్తవ, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ & ఈవెంట్ కన్వీనర్ డాక్టర్ నవీన్ గార్గ్ పాల్గొన్నారు. 

ప్రొ. వేణుగోపాల్ ఆచంట తన అధ్యక్ష ప్రసంగంలో మెట్రాలజీ పరిణామాత్మక అంశాల గురించి సంక్షిప్త అవలోకనాన్ని అందించారు.  మెట్రాలజీ రంగంలో సిఎస్ఐఆర్ - ఎన్సీపిఎల్ వివిధ ప్రయత్నాలపై అంతర్దృష్టులను అందించారు. దేశంలో పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్న సిలికాన్ వ్యర్థాలను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఎన్సీపిఎల్ “వేస్ట్ టు వెల్త్” విధానం ప్రొఫెసర్ ఆచంట ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటి. సిఎస్ఐఆర్ లేబొరేటరీలు, బిఐఎస్, క్యూసిఐ సహకారంతో ద్వితీయ ప్రమాణాల మెట్రాలజీ లేబొరేటరీలను స్థాపించాల్సిన అవసరాన్ని కూడా ఆయన వివరించారు.

డైరెక్టర్- క్యూసీఐ శ్రీ జక్సే షా మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి దార్శనికత, “ఆత్మనిర్భర్ భారత్”ను దృష్టిలో ఉంచుకుని మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం (నైపుణ్యం, స్కేల్, స్పీడ్‌పై దృష్టి సారించి) నేపథ్యంలో మనం ప్రపంచ డిమాండ్‌లను తీర్చడమే కాకుండా మన ఉత్పత్తి అంగీకార రేటును కూడా పెంచాలని ఆయన నొక్కి చెప్పారు. సిఎస్ఐఆర్ - ఎన్పీఎల్, లీగల్ మెట్రాలజీ, బిఐఎస్, క్యూసిఐ- ఎన్ఏబిఎల్ అనే నాలుగు స్తంభాల మద్దతుతో మాత్రమే విశ్వసనీయత, నాణ్యతను సాధించవచ్చని అన్నారు. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

శిక్షణ నిర్వహించడం, ఎంఎస్ఎంఈ లకు సాధికారత కల్పించడం వంటి అనేక కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలలో మెట్రోలాజికల్ కార్యకలాపాల గురించి అవగాహన కల్పించడం ప్రాముఖ్యతను  బిఐఎస్ డీజీ శ్రీ ప్రమోద్ కుమారి తివారీ ప్రధానంగా ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడానికి మన దేశంలోని విద్యాసంస్థలు మెట్రాలజీ రంగంలో కోర్సులను రూపొందించడం, శిక్షణ నిర్వహించడం వంటి విధానంపై పని చేయవచ్చని అయన తెలిపారు. ఒకే గొడుగు కింద టెస్టింగ్, క్యాలిబ్రేషన్, ధ్రువీకరణ ల్యాబొరేటరీల పాన్-ఇండియా డేటాబేస్‌ను రూపొందించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.

ఈ సందర్భంగా, దాదాపు అన్ని భౌతిక పరిమాణాల రంగాలను వాటి మెట్రాలాజికల్ అంశాలతో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉపన్యాసాలు చేశారు. ఇందులో పర్యావరణం కోసం మెట్రాలజీ, భారీ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం మెట్రాలజీ, భారతీయ నిదేశక్ ద్రవ్య (బిఎన్డిలు), మెట్రాలజీ ఫర్ హెల్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మెట్రాలజీ ఫర్ ఇ-మొబిలిటీ అండ్ ఎనర్జీ, మెట్రాలజీ ఫర్ ఫోటో-వోల్టాయిక్ మెట్రాలజీ, కార్యక్రమాలను ప్రదర్శించారు. మెట్రాలజీలో సిఎస్ఐఆర్ - ఎన్పీఎల్ పాత్ర, ప్రయత్నాలు, భవిష్యత్తు కోసం  సిఎస్ఐఆర్ - ఎన్పీఎల్  రోడ్ మ్యాప్ కి రూపకల్పన జరిగింది. సిఎస్ఐఆర్ - ఎన్పీఎల్ భవిష్యత్తు అంచనాలు" అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. వివిధ అంశాల నిపుణులు మెట్రోలాజికల్ రంగంలో తమ సవాళ్లను, ఎన్పీఎల్ సామర్త్యాన్ని అందించగల సాధ్యమైన పరిష్కారాన్ని చర్చించారు. ఇది ఫలవంతమైన సెషన్, ఇది కొత్త సహకార కోణాన్ని తెరిచింది. రాబోయే సంవత్సరాల్లో దేశ వృద్ధికి ఇది సహాయపడుతుంది. విద్యార్థుల కోసం, క్విజ్ పోటీ నిర్వహించారు. దీనికి ఢిల్లీలోని ఐఐటి, ఇతర ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో సహా చాలా మంది విద్యార్థులు హాజరయ్యారు. వారు ఉపన్యాసాల నుండి ప్రయోజనం పొందారు మెట్రాలజీలో వృత్తిని కొనసాగించడానికి తమ ఆసక్తిని కనబరిచారు.

సిఎస్ఐఆర్ - ఎన్పీఎల్, దాని “వన్ వీక్ వన్ ల్యాబ్” ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాల కోసం, ఎన్పీఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.nplindia.org/ ఎన్పీఎల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ (You Tube, Facebook, LinkedIn, Instagram, Twitter) . ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం NPL YouTube ఛానెల్‌లో ఉంది.

***


(Release ID: 1918134)
Read this release in: English , Urdu , Hindi , Marathi