వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్ లోని బుద్ని లో సెంట్రల్ ఫామ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ స్టిట్యూట్ ను సందర్శించి రైతులతో ముచ్చటించిన డి ఎ అండ్ ఎఫ్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ

Posted On: 19 APR 2023 5:04PM by PIB Hyderabad

బుద్ని (మధ్యప్రదేశ్) లోని సెంట్రల్ ఫామ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ,  టెస్టింగ్ కార్యకలాపాలను, వ్యవసాయ యాంత్రీకరణ రంగంలో  ప్రదర్శన ను సమీక్షించే ఉద్దేశ్యంతో, వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ  అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖీ ఆ  సంస్థను సందర్శించి రైతులతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా ఆయన సంస్థ డైరెక్టర్, సిబ్బందితో మాట్లాడి వివిధ శిక్షణ, పరీక్షా ప్రయోగశాలలను పరిశీలించారు. ఈ సంస్థ దేశంలోని ఏకైక ట్రాక్టర్ టెస్టింగ్ సెంటర్ మాత్రమే కాకుండా ట్రాక్టర్ల ఎగుమతిని ప్రోత్సహించే ఒ.ఇ.సి.డి ప్రమాణాల ప్రకారం ట్రాక్టర్లను పరీక్షించడానికి ఒక జాతీయ నిర్దేశిత అథారిటీ కూడా. కేంద్ర మోటారు వాహన చట్టం కింద ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర స్వయం చోదక వ్యవసాయ యంత్రాలను పరీక్షించడానికి ఈ సంస్థకు రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ అధికారం ఇచ్చింది. ఇంజన్ల ఎగ్జాస్ట్ వాయువుల భారీ ఉద్గారాల కోసం ఈ సంస్థ పరీక్షా ప్రయోగశాలను కూడా కలిగి ఉంది, ఇది సి ఎం వి ఆర్  కింద ఒక ముఖ్యమైన అవసరం. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి సంస్థ అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను, సంస్థ చేస్తున్న గొప్ప కృషిని ఆయన ప్రశంసించారు.

 

వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి, సిఎఫ్ఎంటిటిఐ - బుద్ని ఇప్పటికే డిజిసిఎ నుండి రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్ పి టి ఒ) గా గుర్తింపు పొందే పనిలో ఉంది, ఇక్కడ డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తారు.  పరిశ్రమ తో ఉన్న సంబంధాలతో ఈ సంస్థ ప్రస్తుత శిక్షణా సౌకర్యాలను నవీకరించే పనిలో ఉంది. అత్యాధునిక అంతర్జాతీయ సౌకర్యాలతో సంస్థను అభివృద్ధి చేయడం, వ్యవసాయ యాంత్రీకరణ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ట్రాక్టర్‌ల డ్రాబార్ పనితీరు కోసం టైలర్‌మేడ్ ఎక్విప్‌మెంట్ అయిన లోడ్ కార్, బుడ్ని ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉన్న ఏకైక రకం, దీనిని 1988లో యు కె  నుండి ఇన్‌స్టిట్యూట్ స్వీకరించింది.మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సహకారంతో అత్యాధునిక డేటా అక్విజిషన్ సిస్టమ్ తో ఈ లోడ్ కారును దేశీయంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

వ్యవసాయ డ్రోన్లతో సహా వివిధ మెరుగైన వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను కూడా డాక్టర్ లిఖీ వీక్షించారు. రైతులతో సంభాషిస్తూ, చిన్న , సన్నకారు రైతులకు,  వ్యవసాయ విద్యుత్ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు వ్యవసాయ యాంత్రీకరణ పరిధిని పెంచడం , చిన్న కమతాలు, వ్యక్తిగత యాజమాన్యం వల్ల అధిక వ్యయం కారణంగా తలెత్తే ప్రతికూల ఆర్థిక వ్యవస్థలను భర్తీ చేయడానికి 'కస్టమ్ హైరింగ్ సెంటర్లను' ప్రోత్సహించడం, .చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరిధిని పెంచే ప్రధాన లక్ష్యాలతో వ్యవసాయ యాంత్రీకరణపై సబ్ మిషన్ (ఎస్ ఎంఎఎం) కింద  రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా డిపార్ట్ మెంట్  అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ జోక్యాలను వివరించారు.  ఈ పథకం కింద, యంత్రాలు , పరికరాలు రైతులకు అందుబాటు ధరలో ఉండటానికి వీటి కొనుగోలు కోసం ఎస్ఎంఎఎం కింద రైతుల కేటగిరీలను బట్టి ఖర్చులో 40% నుండి 50% వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సిహెచ్ సిలు) ,అధిక విలువ కలిగిన వ్యవసాయ యంత్రాల హైటెక్ హబ్ ల ఏర్పాటు కోసం గ్రామీణ యువత,  పారిశ్రామికవేత్తగా రైతు, రైతు సహకార సంఘాలు, రిజిస్టర్డ్ ఫార్మర్స్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లు (ఎఫ్ పిఓలు) ,పంచాయితీలకు ప్రాజెక్ట్ వ్యయంలో 40% ఆర్థిక సహాయం అందించబడుతుంది. రూ.10 లక్షల లోపు వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం చొప్పున గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల (ఎఫ్ ఎంబీ) ఏర్పాటు కోసం సహకార సంఘాలు, రిజిస్టర్డ్ రైతు సంఘాలు, ఎఫ్ పీవోలు, పంచాయతీలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు ఎఫ్ఎంబీల స్థాపనకు ఆర్థిక సాయం రేటు రూ.10 లక్షల వరకు ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్టు వ్యయంలో @95% గా ఉంది.

 

వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం పంట నిర్వహణ స్థిరత్వం , సమర్ధతను పెంచడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఖర్చును తగ్గించడంతో పాటు ప్రమాదకరమైన పని పరిస్థితులకు మానవ ప్రభావిత స్థాయిని కూడా తగ్గిస్తుందని ఆయన తెలియజేశారు.

పంటల మదింపు, భూ రికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందులు, పోషకాల పిచికారీ కోసం కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని 2022-23 కేంద్ర బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది.

 

వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీల ప్రత్యేక ప్రయోజనాలను పరిశీలిస్తూ, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ  పురుగుమందులు ,పోషక అనువర్తనంలో డ్రోన్ల ఉపయోగం కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ను తీసుకువచ్చింది, ఇది డ్రోన్ల సమర్థవంతమైన సురక్షితమైన కార్యకలాపాలకు సంక్షిప్త సూచనలను అందిస్తుంది. వ్యవసాయంలో డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి ,డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రంగంలోని ఇతర భాగస్వాములకు చౌకగా అందించడానికి , రైతుల పొలాలలో దానిని ప్రదర్శించడానికి వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ (ఎస్ఎమ్ఎఎమ్) కింద వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షా సంస్థలు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, కృషి విజ్ఞాన కేంద్రం (కెవికె) ,రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఎస్ఎయు) లకు 100% ఖర్చు ను ఆర్థిక సహాయం గా అందిస్తారు. రైతుల పొలాల్లో డ్రోన్ల ప్రదర్శన కోసం డ్రోన్ల కొనుగోలుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్. పి ఒ లు) 75% గ్రాంట్లు ఇస్తారు. డ్రోన్ అప్లికేషన్ ద్వారా వ్యవసాయ సేవలను అందించడానికి, డ్రోన్ l,  దాని అటాచ్ మెంట్ ప్రాథమిక వ్యయంలో 40% లేదా రూ.4 లక్షలు, ఏది తక్కువైతే అది, సహకార రైతు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఒ లు)  గ్రామీణ పారిశ్రామికవేత్తల సహకార సంఘం కింద ఉన్న , ఇంకా కొత్త కస్టమ్ హైరింగ్ సెంటర్ల కు (సి హెచ్. సి లు ) డ్రోన్ కొనుగోలు కోసం ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది. సి హెచ్ సి లను నెలకొల్పే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లు డ్రోన్ ఖర్చులో 50 శాతం చొప్పున గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం పొందేందుకు అర్హులు.

 

సీహెచ్ సీలు/హైటెక్ హబ్ లకు సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల కొనుగోలుతో సాంకేతిక పరిజ్ఞానం వారికి అందుబాటు ధరల్లోకి వస్తుంది. ఇది భారతదేశంలోని సామాన్యులకు డ్రోన్లను మరింత అందుబాటులో ఉంచుతుంది . ఇంకా దేశీయ డ్రోన్ ఉత్పత్తిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.

 

****



(Release ID: 1918131) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Marathi , Hindi