బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఉత్పత్తులు త్వరితగతిన ప్రారంభించడానికి భూమి లభ్యత, సకాలంలో అనుమతులు మంజూరు చేయడం అవసరం-- బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమ్రిత్ లాల్ మిశ్రా
క్యాప్టివ్/కమర్షియల్ బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన వారితో సమావేశం నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
12 APR 2023 4:54PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు ఉత్పత్తి , తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా తెలిపారు. క్యాప్టివ్/ కమర్షియల్ బొగ్గు బ్లాకుల కేటాయింపు పొందిన వారితో శ్రీ మీనా ఈ రోజు సమావేశం నిర్వహించారు. కొత్తగా కేటాయించిన బ్లాకులలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి సకాలంలో భూమి కేటాయించడం, ఇతర అనుమతులు జారీ చేయడం ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పర్యవేక్షించి సకాలంలో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం దీనికోసం పోర్టల్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించిందని శ్రీ అమ్రిత్ లాల్ మిశ్రా తెలిపారు.
దేశంలో ఆర్ధికాభివృద్ధి తో సమానంగా ఇంధన వినియోగం పెరిగిందని శ్రీ అమ్రిత్ లాల్ మిశ్రా అన్నారు. బొగ్గు దిగుమతులు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు రంగంలో స్వావలంబన సాధించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు చేస్తుందని శ్రీ అమ్రిత్ లాల్ మిశ్ర తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అంశానికి ప్రాధాన్యత ఇస్తున్న మంత్రిత్వ శాఖ సుస్థిర అభివృద్ధి సాధించడానికి దోహద పడే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని అన్నారు. వనరుల పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణ పర్యావరణ రక్షణ అంశాల ఆధారంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించామని శ్రీ అమ్రిత్ లాల్ మిశ్రా తెలిపారు.
బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయడానికి, సులభతర వ్యాపార నిర్వహణ కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలను మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ.ఎం. నాగరాజు వివరించారు. మంత్రతివా శాఖ అమలు చేస్తున్న చర్యలు బొగ్గు రంగం అభివృద్ధికి దోహదపడతాయన్నారు. బొగ్గు గనుల వేలం పారదర్శకంగా, లాభసాటిగా జరిగేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను ఆయన వివరించారు. బొగ్గు బ్లాకుల వేలం/కేటాయింపు, ఉత్పత్తి ఎక్కువ చేయడానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు, వ్యాపార అవకాశాలు లాంటి అంశాలపై బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ. మారేపల్లి వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
సమావేశానికి ఎన్టిపిసి, వేదాంత లిమిటెడ్, జె ఎస్ డబ్ల్యు, దాల్మియా సిమెంట్ ( భారత్) లిమిటెడ్, సింగరేణి, సీఎల్, ఎన్ఎల్సిఐఎల్, ఒడిశా కోల్ లిమిటెడ్ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో బొగ్గు రంగం ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంశాలు చర్చించిన ప్రతినిధులు బొగ్గు గనుల్లో త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి, దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
బొగ్గు గనుల వేలం ప్రక్రియలో బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సంస్కరణల పట్ల ప్రతినిధులు హరీశమ్ వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సకాలంలో చర్యలు అమలు చేస్తూ బొగ్గు గనులు ఉత్పత్తి ప్రారంభించడానికి సహకారం అందిస్తోందని వారు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పర్యావరణం, అడవులు,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు చట్ట నిబంధనలు వివరించారు.
బొగ్గు ఉత్పత్తి త్వరితగతిన ప్రారంభించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నెలకొల్పిన ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సలహాదారుగా ఎస్బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది.
***
(Release ID: 1916062)
Visitor Counter : 176