అణుశక్తి విభాగం

అరుదైన భూ నిక్షేపాల తవ్వకాలు

Posted On: 06 APR 2023 4:53PM by PIB Hyderabad
అరుదైన భూ నిక్షేపాలు కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో లభిస్తున్న  వనరులు గణనీయంగా లీన్ wrt గ్రేడ్ తో  రేడియోధార్మికత కలిగి ఉన్నాయి. నిక్షేపాలు  వెలికి తీయడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా ప్రక్రియ  సంక్లిష్టంగా ఖర్చుతో కూడుకున్న పైగా ఉంటుంది. భారతదేశంలో లభిస్తున్న వనరులు  భారతీయ వనరులు లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (LREE) కలిగి ఉన్నాయి. అయితే హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (HREE) వెలికి తీయదగిన పరిమాణంలో అందుబాటులో లేవు.
అరుదైన భూ నిక్షేపాలను వెలికి తీయడానికి, లభిస్తున్న ప్రాంతాల నుంచి  శుద్ధి కేంద్రాలు/ప్లాంట్లకు రవాణా చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా  మార్చడానికి  సుదీర్ఘమైన పర్యావరణ వ్యవస్థ అవసరం ఉంటుంది. తవ్వకాల కోసం  చట్టబద్ధమైన అనుమతులు పొందడం, మైనింగ్,నిక్షేపాలు వేరు చేయడం, వెలికితీత, వేరు చేయడం, ఆక్సైడ్‌లలో శుద్ధి చేయడం, మెటల్ వెలికితీత, మిశ్రమం తయారీ వంటివి ఉంటాయి. అల్లాయ్‌ను మాగ్నెట్‌గా మార్చి  ఆ తర్వాత శక్తి ఆదా చేసే ఉపకరణాలలో తుది ఉత్పత్తి మోటారుగా ఉపయోగించాల్సి ఉంటుంది.  తుది ఉత్పత్తిలో అరుదైన మూలకాల  వినియోగం తక్కువ పరిమాణంలో ఉంటుంది.
 మైనింగ్ నుంచి  వేరు చేయడం, ఆక్సైడ్ రూపంలో శుద్ధి చేయడం, మెటల్ వెలికితీత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వరకు  భారతదేశంలో   సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే,  మిశ్రమం, అయస్కాంతం మొదలైన వాటి నుండి పారిశ్రామిక స్థాయి సౌకర్యాలు (మధ్యస్థ) అందుబాటులో  లేవు . ఈ మిశ్రమంలో రేర్ ఎర్త్  ఒక చిన్న భాగం గా ఉంటుంది. ప్రక్రియ పూర్తి చేయడానికి  అరుదైన భూమి మూలకాలు (REE) కాకుండా అనేక ఇతర పదార్థాలు అవసరం ఉంటాయి.   మెటల్ వెలికితీత దశ నుంచి ఈ రంగం ఉచిత కేటగిరీ కింద ఉన్నప్పటికీ, సాంకేతిక  అందుబాటులో లేని కారణంగా మధ్యస్థ  విభాగంలో పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. 
  కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో తీరప్రాంత  ఇసుకలో మరియు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని మారుమూల  ప్రాంతాలలో 13.07 మిలియన్  టన్నులు మోనజైట్ (~55-60% మొత్తం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆక్సైడ్ కలిగి ఉంటుంది) ఉన్నట్లు గుర్తించారు. విలువ పరంగా అరుదైన ఎర్త్‌ల వినియోగంలో 80% కంటే ఎక్కువ RE శాశ్వత అయస్కాంతాల లో ఉంది. దీనికోసం  మాగ్నెటిక్ REE అంటే నియోడిమియంప్రాసియో డైమియండిస్ప్రోసియం మరియు టెర్బియం అవసరం ఉంటుంది. ఇంధన పరివర్తన కార్యక్రమంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది.   అధిక విలువ కలిగిన  డిస్ప్రోసియం, టెర్బియం భారతదేశంలో  వెలికి తీయడానికి తగినంత పరిమాణంలో లభించడం లేదు.  నియోడిమియం, ప్రాసియోడైమియం మాత్రమే భారతదేశంలో లభిస్తున్నాయి. వీటిని 99.9% స్వచ్ఛత స్థాయి వరకు వెలికి తీస్తున్నారు. భారతదేశంలో బీఎస్ఎం ఇనుప ఖనిజంలో 0. 0011 
నుంచి  0.012% వరకు    నియోడిమియంప్రాసియో డైమియం ఉన్నాయి. తీరా ప్రాంత పరిరక్షణ  నిబంధనలు, మడ అడవులు, అడవులు  కారణంగా అరుదైన భూ నిక్షేపాల తవ్వకాలు పరిమితంగా సాగుతున్నాయి. 
అరుదైన భూమి వనరులను (లైట్ రేర్ ఎర్త్స్) లోహ వెలికితీత వరకు చేపట్టడానికి భారతదేశంలో  సామర్థ్యం ఉంది.  టొయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం, టయోటో సుషో కార్పొరేషన్, జపాన్ అనుబంధ సంస్థ ఐఆర్‌ఇఎల్ నుండి అరుదైన ఇసుక రేణువులను గుర్తించి అరుదైనమూలకాలను  శుద్ధి చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 

ఈ సమాచారాన్ని సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్,  ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో ఓకే ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 
***
 


(Release ID: 1914523) Visitor Counter : 266


Read this release in: English , Urdu